For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో స్వయంగా హెర్బల్ షాంపు తయారుచేసుకునే పద్దతి

అందానికి సంబంధించిన ప్రతీ ఉత్పత్తి ఈనాడు మనం ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇంటిలో తయారుచేసుకునేవాటి ఉపయోగాలు ఏంటంటే, అవి పూర్తిగా సహజంగా, తాజాగా ఉండి ఏ ప్రిజర్వేటివ్స్ కలపము. ఫేస్ ప్యాక్ లతో పాటు, మాస్కులు

By Mallikarjuna
|

అందానికి సంబంధించిన ప్రతీ ఉత్పత్తి ఈనాడు మనం ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇంటిలో తయారుచేసుకునేవాటి ఉపయోగాలు ఏంటంటే, అవి పూర్తిగా సహజంగా, తాజాగా ఉండి ఏ ప్రిజర్వేటివ్స్ కలపము. ఫేస్ ప్యాక్ లతో పాటు, మాస్కులు, నూనెలు, ఇదిగో ఈ హెర్బల్ షాంపూ కూడా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

మార్కెట్ కి వెళ్ళి సరిగ్గా కావాల్సిన వస్తువులు, కావల్సిన పరిమాణాలతో తెచ్చుకోండి. ఇక ఈ సులభ పద్ధతితో ఇంట్లోనే హెర్బల్ షాంపూను తయారుచేసుకోవచ్చు.ఈ ఇంట్లో చేసుకున్న షాంపూతో లాభాలేముంటాయి అనుకుంటున్నారా? ఇదిగో చదవండి ;

recipe for natural hair shampoo

డబ్బుకి తగ్గ ప్రమాణం

ఇందులో వాడే వస్తువులు, దినుసులు చాలా తక్కువ ధరకే వచ్చేస్తాయి. ఒక సీసాడు షాంపూ తయారుచేయడానికి, 100 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు.

సులభంగా దొరుకుతాయి

ఈ హెర్బల్ షాంపూలో వాడే వస్తువులు మార్కెట్లో సులువుగా లభిస్తాయి. అందుకే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తయారుచేసుకోవచ్చు. దీనికి పెద్ద తయారీ అంటూ అవసరంలేదు.

ప్రతిరోజూ వాడకానికి మంచిది

మన జుట్టుకు పట్టే దుమ్ము, కాలుష్యం వల్ల షాంపూని తరచుగా వాడటం తప్పనిసరి. కానీ బయట దొరికే షాంపూలలో రసాయనాలు ఉండి మీ జుట్టుతో చర్య జరిగి, ఫలితాలు దారుణంగా ఉంటాయి. అదే ఇంట్లో తయారుచేసుకునే షాంపూ వల్ల రోజూ వాడినా జుట్టుకి ఏం అవదు. అదింకా జుట్టును బలపరచి, కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

recipe for natural hair shampoo

కావాల్సిన వస్తువులు ; ఇంట్లో తయారయ్యే హెర్బల్ షాంపూ

ఈ షాంపూను తయారుచెయ్యడానికి, మీకు ఈ కింద రాసిన పదార్థాలు అవసరమవుతాయి. మంచి నాణ్యత ఉన్న పదార్థాలను, సరైన పరిమాణాలలో వాడటం మంచిది.

• మెంతి గింజలు

• పొడి శీకాకాయ

• పొడి ఉసిరి

• కుంకుడు నీరు

హెర్బల్ షాంపూలో ఈ వస్తువుల ప్రతిదాని ఉపయోగం చూద్దాం.

మెంతి గింజలు

వైద్యవిలువలు ఎక్కువ. విటమిన్ సి, నికోటినిక్ యాసిడ్, లెసిథిన్, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. మెంతులు ముఖ్యంగా జుట్టు ఊడే లేదా బట్టతల వస్తున్న ప్రదేశాల కుదుళ్ళలో పనిచేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్ళతో చర్య చెంది కొత్త వెంట్రుకలు వచ్చేట్లా ప్రేరేపిస్తాయి. మీ తల సున్నితమైతే, మెంతులపై ఆధారపడటం మంచిది.

recipe for natural hair shampoo

పొడి షీకాకాయ

తలంటుకోవడం, షాంపూ చేసుకోవటం ముఖ్య ఉద్దేశం జుట్టును, తల పై భాగాన్ని శుభ్రం చేసుకోవటమే. దీనికి శీకాకాయ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే సహజ ఆస్ట్రింజెంట్ లక్షణాలు జుట్టు పరిమాణం పెంచి, మెరిసేలా చేస్తుంది.

పొడి ఉసిరి

ఉసిరిపొడి నూనె స్థాయి, జుట్టు,తల పై భాగ పిహెచ్ స్థాయిలను సమన్వయం చేస్తుంది. ఇది జిడ్డు జుట్టు లేదా ఎండిపోయిన జుట్టు రెండిటిపైనా పనిచేస్తుంది. పైగా కాంతివంతంగా మారుస్తుంది. ఉసిరికాయ లాభాలను సైన్స్, ఆయుర్వేదం రెండూ ఆమోదించాయి.

రీతాను కుంకుడుకాయలు అంటారు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించి, జుట్టును మృదువుగా చేస్తుంది. జుట్టు చిక్కుపడకుండా చేస్తుంది. జుట్టు పెరగడానికి సహజమైన కండీషనర్ గా కూడా పనికొస్తుంది.

• 2 చెంచాల మెంతులు

• ½ కప్పు ఉసిరిపొడి

• ½ కప్పు శీకాకాయ పొడి

• 10 కుంకుడుకాయలు

• 1.5 లీటర్ల నీరు

recipe for natural hair shampoo

విధానం ;

• ఒక పెద్ద గుండ్రటి స్టీలు గిన్నె తీసుకోండి. పైన చెప్పిన అన్ని వస్తువులు అందులో సరిగ్గా వేసేయండి. నీరు పోయండి. రాత్రంతా అలా దాన్ని దేంతోనైనా కప్పి ఉంచండి.

• మర్నాడు పొద్దున, ఈ మిశ్రమాన్ని మధ్యస్థ మంటపై ఉడికించండి. ఆ ద్రవం మొత్తం నల్లగా మారి, జారుడుగా మారేవరకు దాదాపు రెండు గంటలు మరిగించండి.

• అయిపోయాక, వడగట్టి, ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి. మీ ఇంటి హెర్బల్ షాంపూ తయారు !

• ఈ షాంపూను మరీ ఎక్కువకాలం దాచి వాడకండి.

• ఎంత తాజాగా దీన్ని వాడితే, అంత ప్రభావంతో మీ జుట్టుపై పనిచేస్తుంది.

English summary

Natural Hair Shampoo | Making Hair Shampoo At Home | Recipe For Homemade Shampoo

Making shampoo at home is now very easy, which can be done in less than five ingredients.You can make this any time, preserve it and use to get good hair.An overnight preparation, this herbal homemade shampoo promises health and happiness to your hair.
Story first published:Tuesday, December 5, 2017, 12:55 [IST]
Desktop Bottom Promotion