For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సమస్యలకి జామ ఆకులను ఎలా వాడాలి?

By Deepti T S
|

అందాల ప్రపంచంలో జామ ఆకులు తాజా సెన్సేషన్ గా మారాయి. విటమిన్ బి మరియు సి లతో నిండి ఉండే ఈ ఆకులు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ఇవేకాక, వాటిల్లో మరిన్ని పోషకాలుండి మీ జుట్టు సమస్యలను తీర్చి, రూపాన్నే మార్చేస్తాయి.

ఈ ఆకులను తరచూ వాడుతూ ఉండటం వలన మీరు కలలుకన్న కేశాలను అలానే పొందుతారు.


మీరు ఇంకా ఈ అద్భుతమైన పదార్థాన్ని వాడకుండా ఉంటే,ఇది చదవండి. ఈరోజు, బోల్డ్ స్కైలో మీకు జామ ఆకులను వాడే ప్రభావంతమైన చిట్కాలు, మరియు వాటితో మీ జుట్టు సమస్యలన్నీ తొలగే మార్గాలు తెలుపుతున్నాం.

అతి సాధారణ జుట్టు సంబంధ సమస్యలు – చుండ్రు, ఎండిపోయిన జుట్టు, వెంట్రుకలు విరిగిపోవటం, జిడ్డు మరియు ఇలాంటివెన్నో. ఈ సహజమైన పదార్థాన్ని మీరు వీటన్నిటికీ వాడవచ్చు.


కానీ,మీరు ఈ చిట్కాలను వాడే విధానాన్ని బట్టి మొత్తం మీద ఫలితాలు ఆధారపడి వుంటాయి. అందుకని,జామ ఆకులను ఇతర ప్రభావవంతమైన పదార్థాలతో కలిపి వాడటం అత్యంత ముఖ్యం.

మీ జుట్టు సమస్యలకి ప్రత్యేకంగా జామ ఆకులను వాడే చిట్కాలను ఇక్కడ పొందుపరిచాం;

1.చుండ్రు కోసం జామ ఆకులను నిమ్మరసంతో కలపండి

1.చుండ్రు కోసం జామ ఆకులను నిమ్మరసంతో కలపండి

-చేతులలో పట్టిన జామఆకులను మిక్సీపట్టి పొడిచేయండి.

- ఈ పొడిని 2-3 చెంచాల నిమ్మరసంతో కలపండి.

-ఈ మిశ్రమాన్ని మీ కుదుళ్ళ వద్ద రాసి 20నిమిషాల తర్వాత కడిగేయండి.

-దీన్ని వారానికి ఒకసారి వాడి మీ చుండ్రును నియంత్రించుకోండి.

2. జామఆకులు కొబ్బరినూనెతో కలిపి చిక్కుజుట్టుకోసం

2. జామఆకులు కొబ్బరినూనెతో కలిపి చిక్కుజుట్టుకోసం

- రెండు చెంచాల జామ ఆకుల పొడిని 3 చెంచాల కొబ్బరినూనెతో కలపండి.

-దీన్ని మీ జుట్టుకి రాసి, 30 నిమిషాల తర్వాత కొంచెం తీవ్రత ఉన్న షాంపూతో కడిగేయండి.

- చిక్కులేని జుట్టుకోసం, జామ ఆకులను ఈ పద్ధతిలో వారానికోసారి వాడండి.

3. వేడివల్ల పాడైన జుట్టుకోసం జామ ఆకులను అవకాడోతో వాడండి.

3. వేడివల్ల పాడైన జుట్టుకోసం జామ ఆకులను అవకాడోతో వాడండి.

-చేతికి పట్టినంత జామ ఆకులను మరియు 2 కప్పుల నీరును ఒక పెనంలో వేయండి.

-10-15 నిమిషాలపాటు మరగనివ్వండి. స్టవ్ మీదనుంచి దించి చల్లబడనివ్వండి.

-పండిన అవకాడోను ముద్దచేసి తయారైన ద్రవంతో కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ళకి, పాయలకి పట్టించండి. దీన్ని 25-30 నిమిషాల పాటు ఉంచి చల్లనీరుతో కడిగేయండి.

-ఇలా వారానికి రెండుసార్లు చేసి వేడివల్ల పాడైన జుట్టుకి చికిత్స చేయండి.

4. జిడ్డు జుట్టు కోసం తెల్లసొనతో జామ ఆకులు

4. జిడ్డు జుట్టు కోసం తెల్లసొనతో జామ ఆకులు

-2-3చెంచాల జామ ఆకుల పొడిని తెల్లసొనతో కలపండి.

-దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 40 నిమిషాలు నాననివ్వండి.

- దీన్ని గోరువెచ్చని నీరుతో కడిగేసి మామూలు షాంపూ చేసుకోండి.

-వారానికోసారి ఇలా చేసి జిడ్డు లేని జుట్టును పొందండి.

5. జుట్టు ఊడిపోవటానికి ఉసిరినూనెతో జామ ఆకులు

5. జుట్టు ఊడిపోవటానికి ఉసిరినూనెతో జామ ఆకులు

-1చెంచా జామ ఆకులపొడిని 2చెంచాల ఉసిరినూనెతో కలపండి.

-జుట్టు మొదళ్ళలో మొత్తం మెల్లగా ఈ మిశ్రమాన్ని రాసి,30నిమిషాలు ఉండనివ్వండి.

-మీ మామూలు షాంపూతో దీన్ని కడిగేసి, కొంచెం కండీషనర్ ను రాయండి.

-వారానికోసారి ఇలా చేసి జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించండి.

6.ఎండిపోయిన జుట్టుకి ఆలివ్ నూనెతో జామ ఆకులు

6.ఎండిపోయిన జుట్టుకి ఆలివ్ నూనెతో జామ ఆకులు

-5-6 జామ ఆకులను మరుగుతున్న నీటిలో వేయండి.10 నిమిషాల పాటు మరగనివ్వండి.

-తర్వాత ఈ మరిగిన నీటిని చల్లార్చి దీన్ని 2 చెంచాల ఆలివ్ నూనెతో కలపండి.

-మీ జుట్టును ఈ ఇంట్లోచేసిన మిశ్రమంతో రుద్ది, 30నిమిషాల పాటు అలానే ఉంచండి.

-తర్వాత మీ జుట్టును షాంపూతో కడిగేయండి.

-మీ ఎండిపోయిన జుట్టును వారానికోసారి ఈ చిట్కాను పాటించి అందంగా మార్చుకోండి.

7. నిగారింపు లేని జుట్టుకి ఆపిల్ సిడర్ వెనిగర్ తో జామ ఆకులు

7. నిగారింపు లేని జుట్టుకి ఆపిల్ సిడర్ వెనిగర్ తో జామ ఆకులు

-1చెంచా జామ ఆకుల పొడిని ½ చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ మరియు 3 చెంచాల రోజ్ వాటర్ తో కలపండి.

-దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి, పాయల చివర్ల పట్టించండి.

-దీన్ని 30 నిమిషాలపాటు అలానే వదిలేసి షాంపూతో కడిగేయండి.

-వారానికి రెండుసార్లు ఇలా చేసి మీ జుట్టు నిగారింపును తిరిగి పొందండి.

8. నెరిసిన జుట్టుకి కరివేపాకులతో జామ ఆకులు

8. నెరిసిన జుట్టుకి కరివేపాకులతో జామ ఆకులు

-4-5 జామ ఆకులను, చేతులలో పట్టిన కరివేపాకులను మరుగుతున్న నీటిలో వేయండి.

-10-15 నిమిషాలు మరగనిచ్చి, స్టవ్ పై నుండి దించండి.

-దాన్ని చల్లబడనివ్వండి.

-మీ జుట్టును గోరువెచ్చని నీరుతో కడిగి తర్వాత ఈ మిశ్రమాన్ని పట్టించండి.

-5నిమిషాల పాటు అలానే ఉంచి చల్లనీరుతో కడిగేయండి.

-నెరిసిన జుట్టుకి ఇలా జామ ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో వాడండి.

English summary

Benefits of guava leaves for hair | how to use guava leaves to treat hair problems

Benefits of guava leaves for hair | how to use guava leaves to treat hair problems ,Here’s how you should use guava leaves for different hair problems, take a look.
Desktop Bottom Promotion