For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి నూనె + కరివేపాకు వేడి చేసి తలకు అప్లై చేస్తే: అద్భత లాభాలు

|

కొబ్బరి నూనె, కరివేపాకు కాంబినేషన్ అద్భుతమైన లాభాలిస్తుందన్న విషయం మీకు తెలుసా? పొడవైన, అందమైన మెరిసే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే పొడవైన జుట్టును కాపాడుకోవడం ఆడవాళ్లకు సవాల్ గా మారింది. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యల నుండి బయట పడటం చాలా కష్టంగా మారింది. జుట్టు రాలే సమస్య 10 లో 8 మందికి తప్పకుండా ఉంటుంది. కాకపోతే కొందరికి తక్కువగా రాలుతుంది... ఇంకొందరికి భయపెట్టించేంత రాలుతుంది.

అందుకే జుట్టుని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి శిరోజాలను కాపాడుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చాలా సందర్భాల్లో వారికి నిరాశే మిగులుతుంది. ఆరోగ్యమైన, బలమైన జుట్టును పొందడానికి న్యాచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే టిప్స్ పాటిస్తే కేవలం ఒక నెల రోజుల్లో మీ జుట్టు రాలడం ఆగిపోయి.. మృదువుగా, బలంగా, పొడవుగా మారడాన్ని గమనిస్తారు. జుట్టు సమస్యల పరిష్కారానికి కరివేపాకు బాగా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె, కరివేపాకు

కరివేపాకులో బీటా - కెరోటిన్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉండడం వల్ల తలపై చర్మానికి కావల్సిన తేమను అందించి చుండ్రు నుంచి విముక్తి కలిగిస్తాయి. కరివేపాకుతో కొబ్బరి నూనె కలిస్తే జుట్టు పెరుగుదలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

కావల్సినవి:

కావల్సినవి:

కొబ్బరి నూనె: 100గ్రాములు

కరివేపాకు : 1 కప్పు

ఇలా చేయాలి:-

ఇలా చేయాలి:-

1. ఒక గిన్నెలో కరివేపాకు, కొబ్బరి నూనె వేయాలి. కరివేపాకు నల్లగా అయ్యేవరకు మరిగించాలి.

ఎలా అప్లై చేయాలి

ఎలా అప్లై చేయాలి

2. ఈ మిశ్రమాన్ని స్టౌ మీద నుంచి దించి చల్లారాక లేదా గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి గాడతలేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఒక నెల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఈ మిశ్రమంతో వెంట్రుకలు పెరగడమే కాకుండా చిన్న వయసులో జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

కరివేపాకుతో మరికొన్ని హెయిర్ మాస్క్ లు:

కరివేపాకుతో మరికొన్ని హెయిర్ మాస్క్ లు:

కొన్ని తాజా కరివేపాకు ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి పెరుగుతో కలిపి పేస్ట్ గా మార్చి తలపై చర్మానికి నేరుగా అప్లయ్ చేయండి. ఇలా 30నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో కడిగేయండి. ఈ మాస్క్ ను ప్రతివారం ఒకసారి వాడడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడడమే కాకుండా వెంట్రుకలు కాంతివంతంగా, మృదువుగా వస్తాయి.

కరివేపాకుతో మరికొన్ని హెయిర్ మాస్క్ లు:

కరివేపాకుతో మరికొన్ని హెయిర్ మాస్క్ లు:

కొబ్బరి నూనె, ఆముదం ఒక్కొక్కటి ఒక కప్పు తీసుకుని అందులో అర కప్పు కరివేపాకు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే కరివేపాకు గలగలలాడే వరకు మరిగించి దించిన తర్వాత రెండు - మూడు కర్పూరం ముక్కలు వేసి చల్లారిన తర్వాత వడపోయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పూట తలకు పట్టించి మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే కుదుళ్లు గట్టిపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. నూనె మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిలవ చేసుకుని వాడుకోవచ్చు.

జుట్టు ఊడిపోకుండా కొబ్బరి నూనెతో హెడ్ మసాజ్

జుట్టు ఊడిపోకుండా కొబ్బరి నూనెతో హెడ్ మసాజ్

జుట్టు ఎక్కువగా ఊడిపోయే వారు ఇలా చేస్తే మంచిది. 3-4 చెంచాల కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి బాగా వేడి చేస్తే సరిపోతుంది. కొన్ని నిమిషాల తరువాత నూనెను తలకు మెల్లగా మర్దన చేయాలి. అలా చేసిన 20 నిమిషాల తరువాత తలను శుభ్రంగా గోరువెచ్చ నీటితో కడిగితే సరిపోతుంది. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.

మృదువైన జుట్టుకు: మెంతులు, కరివేపాకు

మృదువైన జుట్టుకు: మెంతులు, కరివేపాకు

జుట్టు పొడిబారిన వారు ఇలా చేయాలి. మెంతులను మెత్తగా పేస్టులా చేసి దాంట్లోనే కరివేపాకు ఆకుల పేస్టును కలపాలి. ఈ మొత్తం మిశ్రమన్ని తలకు పట్టించి ఒక గంట తరువాత కడిగితే వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి.

జుట్టు పెరగాలంటే కరివేపాకు, మెంతి ఆకులు

జుట్టు పెరగాలంటే కరివేపాకు, మెంతి ఆకులు

జుట్టు పొడవుగా పెరగాలంటే ముందుగా నాలుగు చెంచాల కొబ్బరి నూనె వేడి చేసి దాంట్లో కరివేపాకు ఆకులను, మెంతికూర ఆకులను కలపాలి. ఈ మొత్తం నూనె తలకు బాగా మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు చేస్తే చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే వేడి నీటితో తల స్నానం చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది.

చుండ్రు నివారణకు జోజోబ ఆయిల్

చుండ్రు నివారణకు జోజోబ ఆయిల్

చుండ్రు ఎక్కువగా ఉన్న వారు ఇలా చేయటం చాలా ఉత్తమం. ముందుగా కరివేపాకు ఆకులను మెత్తగా పేస్టులా చేసుకుని దాంట్లో కొద్దిగా జోజోబా నూనె కలిపి తలకు బాగా మర్దన చేయాలి. ఇలా చేసినా 30 నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే చుండ్రు నుంచి తొందరగా విముక్తి పొందుతారు.

డ్యామేజ్ హెయిర్ నివారిస్తుంది

డ్యామేజ్ హెయిర్ నివారిస్తుంది

దెబ్బతిన్న రూట్స్ కు మరమ్మతు కెమికల్ ప్రొడక్ట్స్, కాలుష్యం మొదలైనవి జుట్టు పెరుగుదలను ఆపివేసి జుట్టు మూలాలను నాశనం చేస్తాయి. జుట్టు కోసం మంచి పోషకాలు కలిగిన కరివేపాకును ఉపయోగిస్తే దెబ్బతిన్న మూలాలను రిపేరు చేస్తుంది. కరివేపాకు పేస్ట్ ను తలకు రాస్తే మూలాలను రిపేరు చేయవచ్చు. జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది. మీకు చేదు రుచి ఇష్టం ఉంటే ఈ కరివేపాకు ఆకులను నేరుగా తినవచ్చు. కరివేపాకు మీ డ్యామేజ్ అయినా జుట్టుకు ప్రథమ చికిత్స కోసం బాగా పనిచేస్తుంది.

English summary

How to use Coconut Oil and Curry Leave for Hair Growth in Telugu

The curry tree’s leaves are used in many Indian dishes. However, they are mostly used in curries. That is why they are termed as curry leaves. They are also known as “sweet neem leaves”. This is one of the highly used herbs in India.
Story first published: Saturday, June 17, 2017, 16:04 [IST]
Desktop Bottom Promotion