For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎర్రమందారం..ముద్దమందారంతో అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్..!!

జుట్టు పెరుగుదలకోసం పురాతన కాలం నుండే మందారంను ఉపయోగిస్తున్నారు . ఇది జుట్టు రాలడం నివారించి, జుట్టు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంది.

|

ఎర్రమందారం..ముద్దమందారం ఎంతదంగా ముదురాకుపచ్చని రెమ్మల మధ్య దాగిఉంటుంది. మందారంలో ఎన్నో రంగులు, సొబగులు, రాకాలు ఉన్నా ముద్దమందారం అందం, రంగు ముందు మరే పువ్వు సాటిరాదు. అటువంటి మందారంను సహజ సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. మందార ఆకులు, ఎండిన పువ్వులు రెండూ ఎంతో ఉపయోగం. సౌందర్య పోషణలో మందార ఆకులు, పూలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మందారాలతో మెత్తటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు.

How To Use Hibiscus Oil For Hair

జుట్టు పెరుగుదలకోసం పురాతన కాలం నుండే మందారంను ఉపయోగిస్తున్నారు . ఇది జుట్టు రాలడం నివారించి, జుట్టు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంది, ఇది తలలోని తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ను నివారిస్తుంది. ఫ్రీరాడియల్స్ నుండి చర్మ రంద్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది, తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది, ఇది హెయిర్ ఫాలిసెల్స్ ను రీజనరేట్ చేస్తుంది.

ఇంకా మందారంలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి . ఇవన్నీ జుట్టును ఒత్తుగా, స్మూత్ గా మరియు బౌన్సీగా పెరిగేలా చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు మందారంను ఎలా ఉయోగించాలో తెలుసుకుందాం...

 తలలో దురద వంటి సమస్యలను నివారిస్తుంది

తలలో దురద వంటి సమస్యలను నివారిస్తుంది

మందారం నూనెను, కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. జుట్టు పెరగడానికి, నల్లబడేందుకు దీని పువ్వుల రసం కొబ్బరినూనెతో సమపాళ్లలో కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎండిన మందారాలను కొబ్బరి నూనెలో వేసి మరగకాచి తరచూ తలకు పెట్టుకొంటుంటే జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. అలాగే తలలో దురదను నివారిస్తుంది.

ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ నివారిస్తుంది:

ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ నివారిస్తుంది:

హార్మోనుల ప్రభావం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంటుంది. ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ నివారించడంలో మందారం గొప్పగా సహాయపడుతుంది. అందుకు కొన్ని మందారం ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా మందారం నూనె పెరుగు మిక్స్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

హెయిర్ ఫాల్ తగ్గించడంలో మరో టెస్టెడ్ హోం రెమెడీ మందారం షాంపు. మందారంలో జారుడు గుణం ఉంటుంది , ఇది జుట్టుకు ఎటువంటి హాని కలిగించకుండా తలను శుభ్రం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది: 5 మందారపువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని, పెరుగును మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకుఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. జుట్టు ఆయిలీగా ఉంటే, ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయండి. ఆకులు మెత్తగా పేస్ట్ చేసి, కుంకుడు రసంలో కలిపి తలంటుస్నానానికి వాడతారు. దాంతో జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది.

యాంటీ డ్యాండ్రఫ్ మాస్క్ :

యాంటీ డ్యాండ్రఫ్ మాస్క్ :

ఈ హెయిర్ మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, తలలో ఆయిల్ ప్రొడక్షన్ ను నివారిస్తుంది, దాంతో తలలో చుండ్రు నివారించబడుతుంది. మందార పూలను మెత్తగా మిక్సీ పట్టాలి. దీన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే జుట్టు రాలడం, చుండ్రు బాధా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది. అంతేకాదు..మాడుకు చల్లదనాన్ని ఇచ్చి, కుదుళ్లను గట్టిపరుస్తుంది.

ఎలా పనిచేస్తుంది: మెంతులను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం దీన్ని పేస్ట్ చేసిపెట్టుకోవాలి. అలాగే మందారం పువ్వులను కూడా పేస్ట్ చేసియాలి. ఈ రెండు పేస్ట్ లను ఒకటిగా కలుపుకుని, తలకు పూర్తిగా పట్టించాలి. ఒకగంట తర్వాత షాంపుతో తలస్నాం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల మొదటసారికే మంచి ఫలితాలను చూపుతుంది.

జుట్టును స్ట్రాంగ్ గా మార్చడానికి హైబిస్కస్ మాస్క్ :

జుట్టును స్ట్రాంగ్ గా మార్చడానికి హైబిస్కస్ మాస్క్ :

ఈ హెయిర్ మాస్క్ వల్ల నిర్జీవంగా మారిన జుట్టు, చిట్లిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుంది. బలాన్నిస్తుంది. ఈ మాస్క్ తయారికి కావల్సిన పదార్థాలు: మందారం పౌడర్ 3 టేబుల్ స్పూన్లు తేనె: 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్ 1 టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్లు

ఎలా పనిచేస్తుంది: అన్ని పదార్థాలను ఒక బౌల్లో మిక్స్ చేయాలి. ఇవన్నీ స్మూత్ గా తయారయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ హోం మేడ్ హైబిస్కస్ మాస్ జుట్టు పెరుగుదలను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు చిక్కుబడటం నివారిస్తుంది:

జుట్టు చిక్కుబడటం నివారిస్తుంది:

తరచూ జుట్టు చిక్కుబడటం సహజం, అలా జరగకుండా ఉండాలంటే ఒక సింపుల్ రెమెడీ ఉంది. మందారం ఆకులను నేచురల్ గా హెయిర్ కండీషనర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కు పడకుండా నివారిస్తుంది. కొద్దిగా మందారం నూనె తీసుకుని, వేడి చేయాలి. ఇప్పుడు అందులో శెనగపిండి, మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఒత్తైన జుట్టు:

ఒత్తైన జుట్టు:

మందార పూల గుజ్జు, కలబంద గుజ్జును సమపాళ్లలో తీసుకొని కలిపి దాన్ని తలకు రాసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తబడడమే కాదు, జుట్టు ఒత్తుగా, సాప్ట్ గా ఉంటుంది. అలాగే మందారం నూనెలో కొద్దిగా కరివేపాకు మిక్స్ చేసి బాయిల్ చేయాలి, తర్వాత దీన్ని తలకు అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది,

నల్లగా నిగనిగలాడేలా:

నల్లగా నిగనిగలాడేలా:

వివిధ కారణాల వల్ల కొందరి జుట్టు చిన్న వయసులోనే నెరిసిపోతుంది. ఇలాంటివారికి చక్కని పరిష్కారం మందారంతో లభిస్తుంది. ముందురోజు రాత్రి పెరగులో నాలు చెంచాల మందారపొడి, సరపడేంత గోరింట పొడులను నానబెట్టాలి. ఉదయాన్నే కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఇన్ స్టంట్ కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో రోజులకోసారి చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

English summary

How To Use Hibiscus Oil For Hair

You must have heard of hibiscus oil. This oil has many benefits for the hair. Keep reading to find out what they are in this article.
Story first published: Saturday, February 11, 2017, 15:07 [IST]
Desktop Bottom Promotion