For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు

జుట్టు రాలడం నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు

|

ప్రస్తుత రోజుల్లో 40 ఏళ్లు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తోంది. దీనికి కారణం ఒత్తిడి. ఒత్తిడిని సహజమైన ఔషధమూలికలు తప్ప వేరేవీ తగ్గించలేవు. అదికూడా ఏ మాత్రం అధిక వ్యయం లేకుండానే తగ్గిస్తాయి. వాటిలో ఒకటి మెంతులు. మెంతులు లేని వంటిల్లు ఉండదేమో. పచ్చళ్లూ, రసాలూ, కూరల తయారీలో వాడే మెంతులు జుట్టుకూ చక్కని పోషణ ఇస్తాయి. ఎలాగంటారా?

మెంతులు తలపై భాగాన వేడిని తగ్గిస్తాయి. చుండ్రు నివారిస్తాయి, వెంట్రుకలను బిరుసుగా వుంచుతాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టును సున్నితంగా, మెత్తగా ఉంచుతాయి. కళ్ళకు, మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తాయి. అనేక హెయిర్ ప్రాబ్లెన్స్ ను నివారిస్తాయి. మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరగి పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి.

మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలుమెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు

మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ ఉపయోగించి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు . మెంతులతో హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసేటప్పుడు మెంతులతో పాటు చాలా చౌకగా, విరివిగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మెంతులను ఏ రకంగా ఉపయోగించాలో, వాటి ప్రయోజనాలేమిటో చూద్దాం!

జుట్టుకు మంచి పోషణనిస్తుంది

జుట్టుకు మంచి పోషణనిస్తుంది

మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం బాగా మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల కేశాలకు మంచి మెరుపు, బలం చేకూరుతుంది. చుండ్రును మాయం చేస్తుంది. జుట్టు బ్రేక్ కాకుండా ఎనర్జీ అందిస్తుంది.

హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

మెంతులను నీళ్ళలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తలకు పోసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన శక్తిని అందించి, డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

ఒత్తైన, పొడవైన జుట్టు కోసం మెంతి , కరివేపాకు ఉపయోగించే సింపుల్ టిప్స్..!ఒత్తైన, పొడవైన జుట్టు కోసం మెంతి , కరివేపాకు ఉపయోగించే సింపుల్ టిప్స్..!

డ్రై హెయిర్ నివారిస్తుంది

డ్రై హెయిర్ నివారిస్తుంది

మెంతులను మెత్తగా పౌడర్ చేసి, ఈ పొడిని కొబ్బరినూనెలో మిక్స్ చేసి తలకు మాస్క్ లా వేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో దురద మరియు పొడి బారడాన్ని అరికడుతుంది. మరియు ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ లాస్ ను నివారిస్తుంది.

జుట్టు సాప్ట్ గా పెరుగుతుంది

జుట్టు సాప్ట్ గా పెరుగుతుంది

నీళ్ళలో మెంతి ఆకులను వేసి బాగా ఉడికించాలి. ఈ ఆకులను నీటినుండి వేరుచేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు కలిపి. తలకు జుట్టుకు బాగా అప్లై చేయాలి. చేసిన తర్వాత 45నిముషాలు అలాగే ఉంచాలి . తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించడం కోసం ఈ మెంతి హెయిర్ మాస్క్ చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో పెరుగు మరియు మెంతి పొడి మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి.

హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది

హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది

మెంతులను మెత్తగా పొడి చేసుకొని, పాలతో కలపి పేస్ట్ లా తయారు చేసి, తలకు హెయిర్ మాస్క్ లా అప్లై చేయాలి. ఇది హెయిర్ కండీషన్ గా పనిచేసి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఉసిరి కాయలను పచ్చివి లేదా ఎండినవి ఏవైనా ఉపయోగించవచ్చు. మెంతులను మరియు ఉసిరిని కలపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, పెరుగు పట్టించి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి . అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల జుట్టు నివారిస్తుంది

తెల్ల జుట్టు నివారిస్తుంది

మెంతుల్లోని మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడాన్ని నిరోధిస్తుంది.

రోజూ పరగడుపున మేథి వాటర్ ఒక నెలరోజులు తాగితే అద్భుత ప్రయోజనాలు..!! రోజూ పరగడుపున మేథి వాటర్ ఒక నెలరోజులు తాగితే అద్భుత ప్రయోజనాలు..!!

జుట్టు పట్టులా మెరుస్తుంది

జుట్టు పట్టులా మెరుస్తుంది

పావు కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్‌ నూనెలో అరచెంచా మెంతులు వేసి కొన్ని గంటల పాటూ నానబెట్టాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి

జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో ఉపకరిస్తాయి. రెండు చెంచాల నానబెట్టిన మెంతులూ, గుప్పెడు తాజా కరివేపాకును ముద్దలా చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.

English summary

Methi Seeds For Hair Growth

There are many solutions for hair loss; from chemical based hair products to the home remedies. There are numerous ways to deal with hair loss but nothing work wonders. The hair problem still persists. So, instead of using chemicals on hair, you can try some home remedies to treat hair loss.
Desktop Bottom Promotion