For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలహీనమైన జుట్టును స్ట్రాంగ్ గా మార్చి, జుట్టు రాలడం తగ్గించే న్యాచురల్ రెమెడీస్!

అనుకోకుండా , బలహీనపడిన హెయిర్ రూట్స్ కు తిరిగి పోషణ అందివ్వడం పెద్ద కష్టమైన పనే, అయినా ఇంట్లో కొన్ని సులభ పద్దతులను అనుసరించడం వల్ల హెయిర్ రూట్స్ ను తిరిగి బలపడేలా చేయవచ్చు.

By Mallikarjuna
|

జుట్టు మూలాలు(హెయిర్ రూట్స్)బలహీనంగా మారినప్పుడు, జుట్టు రాలడం,జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయం దాదాపు అందరు మహిళలకు తెలిసిన విషయమే. అయితే మనలో చాలా తక్కువ మంది మాత్రమే వారి యొక్క జుట్టు మూలాలు (హెయిర్ రూట్స్ )గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

అనుకోకుండా , బలహీనపడిన హెయిర్ రూట్స్ కు తిరిగి పోషణ అందివ్వడం పెద్ద కష్టమైన పనే, అయినా ఇంట్లో కొన్ని సులభ పద్దతులను అనుసరించడం వల్ల హెయిర్ రూట్స్ ను తిరిగి బలపడేలా చేయవచ్చు. బలహీన పడి, జుట్టు సమస్యలకు కారణమయ్యే హెయిర్ రూట్స్ కోసం న్యాచురల్ గా ఇంట్లోనే కొన్ని సులభమైన హోం రెమెడీస్ తో పోషణను అందించి, తిరిగిపునరిత్తేజంపబడటానికి సహాయపడే చిట్కాలను ఈ రోజు బోల్డ్ స్కై మీకు అందిస్తోంది.

ఈ క్రింద సూచించిన హోం రెమెడీస్ అన్ని జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. హెయిర్ రూట్స్ తో సహా, ఇతర సమస్యలను నివారిస్తుంది. అందుకోసం కమర్షియల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే ఈ రెమెడీస్ ఖరీదు తక్కువ సురక్షితమైనవి.

ఈ హోం రెమెడీస్ లో వివిధ రకాల విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి మీ హెయిర్ రూట్స్ ను తిరిగి కళగా, వాల్యూమనస్ గా మరియు షైనీగా మార్చుతాయి. మరి హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చే ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

1. ఆలివ్ ఆయిల్

1. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో హెయిర్ బెనిఫిటింగ్ న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి హెయిర్ రూట్స్ ను ఎఫెక్టివ్ గా స్ట్రాంగ్ గా మార్చుతాయి. అలాగే అందమైన జుట్టును అందివ్వడం కోసం సహాయపడుతాయి.

ఎలా ఉపయోగించాలి:

సింపుల్ గా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని, రాత్రి నిద్రించడానికి ముందు తలకుఅప్లై చేసి మసాజ్ చేయాలి. ఉదయం మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.

2. అవొకాడో

2. అవొకాడో

అవొకాడోలో ఉండే అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ హెయిర్ రూట్స్ కు మంచి పోషణను అందిస్తుంది, జుట్టు మూలాలను బలంగా మార్చుతుంది,

ఎలా ఉపయోగించాలి:

అవొకాడోను మెత్తగా చేసి, హెయిర్ రూట్స్ కు పూర్తిగా పట్టించాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు జుట్టుకు పూర్తిగా పట్టించి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. విటమిన్ ఇ ఆయిల్

3. విటమిన్ ఇ ఆయిల్

విటమిన్ ఇ ఆయిల్ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది వీక్ గా ఉన్న హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చి, జుట్టు తెగిపోకుండా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

విటమిన్ ఇ క్యాప్స్యూల్ తీసుకుని, లోపల ఉన్న ఆయిల్ ను జుట్టు మొదల్లో అప్లై చేయాలి. ఒక గంట అలాగే ఉండనిచ్చి తర్వాత తేలికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఒక వారంలో 2,3 సార్లు అప్లై చేస్తే చాలు జుట్టు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుంది.

4. తేనె

4. తేనె

తేనెలో యాంటీబ్యాక్టిరియల్ గుణాలున్నాయి. ఇది తలకు పూర్తి పోషణను అందించి, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు నిమ్మరసం తీసుకుని, జుట్టుకు మొత్తానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో వాష్ చేయాలి. నెలలో రెండు సార్లు దీన్ని అప్లై చేసతే మంచి ఫలితం ఉంటుంది.

5. అరటి

5. అరటి

అరటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతాయి. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

బాగా పండిన అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి, హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ రెమెడీని వారంకు ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది.

6. కోకనట్ క్రీమ్ :

6. కోకనట్ క్రీమ్ :

మరో ట్రెడిషినల్ రెమెడీ కోకనట్ క్రీమ్, ఇది జుట్టు మొదళ్లకు బాగా పనిచేసి, జుట్టును తిరిగి పునరుద్దరిస్తుంది. జుట్టు మూలాకలు పోషణను అందిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

జుట్టు మొదళ్లలో కోకనట్ క్రీమ్ అప్లై చేసి, 20 నుండి 25 నిముషాలు అలాగే వదలాలి, తర్వాత ట్యాప్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ స్పెసిఫిక్ రెమెడీని నెలలో రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. బాదం ఆయిల్ :

7. బాదం ఆయిల్ :

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాట యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా హెయిర్ న్యూరిషింగ్ కాంపౌండ్స్ ఉండటం వల్ల జుట్టును స్ట్రాంగ్, గా హెల్తీగా మార్చడంలో బాదం ఆయిల్ గ్రేట్ రెమెడీ.

ఎలా ఉపయోగించాలి:

బాదం ఆయిల్ ను రాత్రి నిద్రించడానికి ముందు తలకు అప్లై చేయాలి. ఉదయం మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ రెమెడిని వారంకు ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. గుడ్డులోని పచ్చసొన

8. గుడ్డులోని పచ్చసొన

గుడ్డులో హెయిర్ న్యూరిషింగ్ ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఈ అద్భుతమైన రెమెడీతో జుట్టు స్ట్రాంగ్ గా హెల్తీగా మరియు సిల్కీగా మారుతాయి.

ఎలా ఉపయోగించాలి:

గుడ్డు పచ్చసొనలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Natural Remedies To Nourish Your Hair Roots

Nourishing weak hair roots is an achievable task that can be easily done at home. In this article, we'll be letting you know about certain incredible home remedies that can nourish and rejuvenate your hair roots naturally.
Story first published:Tuesday, December 12, 2017, 11:20 [IST]
Desktop Bottom Promotion