For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దృఢమైన మరియు నిగనిగలాడే పొడవాటి జుట్టు కోసం సులభమైన అరటి హెయిర్ పాక్స్!

By Ashwini Pappireddy
|

జుట్టు సంరక్షణ ప్రయోజనాల కోసం తరచూ ఉపయోగించే అరుదైన పండ్లలో అరటి కూడా ఒకటి. ఇది వెంట్రుకలకి అవసరమైన లాభదాయక విటమిన్లు, పోషకాలు మరియు ఆమ్లాలతో నిండివుండటం వలన ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ లక్షణాలు అన్ని అరటిలో ఉన్నందున వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలకి చికిత్స కోసం అరటిని ఒక అద్భుతమైన ఔషధంగా వాడుతారు. ప్రత్యేకంగా మీ జుట్టు విచ్ఛిన్నం అవడం మరియు జీవం లేని పొడిబారిపోయిన జుట్టుకి చికిత్స చేయడం లో అరటి ప్రత్యేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Super Easy DIY Banana Packs For Shiny And Strong Hair

మనలో చాలామంది అన్ని సమయాల్లో నిగనిగలాడే బలమైన జుట్టును పొందడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, బయట అందుబాటులో వున్న రసాయనిక ఉత్పత్తులకు అధిక మొత్తంలో సొమ్ముని వెచ్చించి వృధా ప్రయాసని పొందడానికి బదులుగా, మీరు ఈ అద్భుతమైన పండును వుపయోగించి మీ జుట్టు ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా నిగనిగలాడే ,దృఢమైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు.

మెరిసే మరియు బలమైన జుట్టు కోసం సూపర్ DIY అరటి పాక్స్ గురించి మరింత తెలుసుకుందాం.


ఇవాళ్టి పోస్ట్ లో, మేము మీకు బలమైన మరియు మెరిసే జుట్టుని పొందడానికి సహాయపడే కొన్ని సూపర్ సులభమైన మరియు చాలా ప్రభావవంతమైన DIY అరటితో తయారుచేసే జుట్టు ప్యాక్ల గురించి తెలియజేయాలనుకుంటున్నాము మరి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా వున్నారా?

అరటిపండు, కొబ్బరినూనె మిశ్రమం.. జుట్టుకి చేసే అద్భుతం..!!అరటిపండు, కొబ్బరినూనె మిశ్రమం.. జుట్టుకి చేసే అద్భుతం..!!

మీ సొమ్ముని జుట్టు పెరగడం కోసం ఉపయోగించే రసాయనిక ఉత్పత్తుల ఫై వృధాగా వ్యర్థం చేయడం కంటే

ఈ క్రింద పేర్కొన్న విధంగా పాక్స్ ని ఉపయోగించడం వలన జుట్టుకి ఎలాంటి హానికలగకుండా సహజమైన నిగనిగలాడే జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు.


అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం...

1. అరటి + నిమ్మ రసం

1. అరటి + నిమ్మ రసం

- పూర్తిగా మాష్ చేసిన ఒక అరటి పండులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ని జతచేసి బాగా కలపాలి.

- మీ తల మొత్తం బాగా పట్టించి మరియు సుమారు ఒక గంట పాటు అక్కడ వదిలివేయండి.

- గోరువెచ్చని నీటితో మొత్తం ఒకసారి కడిగిన తర్వాత మరియు షాంపూని ఉపయోగించండి.

- బలమైన, నిగనిగలాడే వెంట్రుకల కోసం వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ని

ఉపయోగించవచ్చు.

2. అరటి + ఎగ్ వైట్

2. అరటి + ఎగ్ వైట్

- ఒక అరటి పండుని బాగా మాష్ చేసి అందులో ఒక గుడ్డు సొన ని కలపాలి.

- ఈ ప్యాక్ తో మీ జుట్టు వున్న ప్రాంతంలో రాసి మరియు అది 40-45 నిమిషాలు వదిలేసి ఆరనివ్వండి.

- ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో మరియు తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.

- కావలసిన ఫలితాలను పొందడానికి వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ని ఉపయోగించవచ్చు.

3. అరటి + ఆలివ్ ఆయిల్

3. అరటి + ఆలివ్ ఆయిల్

- ఒక అరటి పండుని బాగా మాష్ చేసి దీనికి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె ని జోడించండి.

- ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న ఈ ప్యాక్ ని మీ జుట్టుకి రాసి కాస్సేపు మసాజ్ చేసి మరియు 30-35 నిమిషాలు వదిలేయండి.

- తరువాత, మీ తల ని శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి షాంపూ మరియు గోరువెచ్చని నీటిని

ఉపయోగించండి.

- పొడవైన కుదుళ్ళని మీ సొంతం చేసుకోవడానికి నెలకి రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగించండి.

సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం బనానా కాంబినేషన్ హెయిర్ ప్యాక్స్...! సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం బనానా కాంబినేషన్ హెయిర్ ప్యాక్స్...!

4. అరటి + అలో వేరా జెల్

4. అరటి + అలో వేరా జెల్

- ఒక గిన్నె లో, 2 టీస్పూన్ల కలబంద గుజ్జుకి మాష్ చేసిన ఒక అరటిపండుని జతచేసి రెండిటిని బాగా కలపండి.

- మీ జుట్టు వున్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాయండి .ఇది బాగా ఆరడానికి ఒక గంట పాటు

వదిలేయండి.

- తరువాత, ఒక తేలికపాటి షాంపూ మరియు వెచ్చని నీటితో మీ తల ని శుభ్రం చేసుకోండి.

- పొడవైన, బలమైన మరియు నిగనిగలాడే జుట్టు సాధించడానికి వారానికి ఒకసారి దీనిని వాడండి.

5. అరటి + ఆమ్లా ఆయిల్

5. అరటి + ఆమ్లా ఆయిల్

- ఒక చిన్న గాజు గిన్నె తీసుకోండి, అందులో కొద్దిగా ఆమ్లా నూనె ని పోయండి మరియు 3-4 టేబుల్ స్పూన్ల అరటి గుజ్జు ని కలపండి. ఈ మిశ్రమాలను బాగా కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ జుట్టుమొత్తానికి మరియు కుదుళ్ళకి అప్లై చేసి ఒక గంటసేపు రానివ్వండి. తరువాత ఒక తేలికపాటి షాంపూ తో శుభ్రంచేసుకోండి.

- ఈ DIY ప్యాక్ ని నెలంతా ఉపయోగించడం వలన మీ జుట్టు బలంగా మారి మరియు నిగనిగ మెరుస్తూ ఉండటంలో సహాయపడుతుంది.

6. అరటి + తేనె మరియు ఆపిల్ పళ్లరసం వినెగర్

6. అరటి + తేనె మరియు ఆపిల్ పళ్లరసం వినెగర్

- 2 టీస్పూన్ల తేనె మరియు ½ టీస్పూన్ ఆపిల్ పళ్లరసం వెనీగర్ ని తో 3-4 టేబుల్ స్పూన్ల అరటి గుజ్జులో జత చేసి బాగా బ్లెండ్ చేయాలి.

- నెమ్మదిగా మీ జుట్టు మొత్తం రాయండి. మీ జుట్టుపై ఎలాంటి దుమ్ము పడకుండా

నివారించడానికి పొడి షవర్ క్యాప్తో మీ తలని కప్పి ఉంచండి.

- ఒక గంట తరువాత, మోస్తరు నీటితో మరియు తేలికపాటి షాంపూతో మీ తల ని కడగాలి.

- అందమైన జుట్టు సాధించడానికి ఈ సహజమైన జుట్టు ప్యాక్ ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి.

7. అరటి + అవోకాడో మరియు రోజ్ వాటర్

7. అరటి + అవోకాడో మరియు రోజ్ వాటర్

- మొదటగా బాగా పండిన బాగా మాష్ చేసిన ఒక అరటిపండు,ఒక అవోకాడో ని తీసుకొని మరియు 3-4 టేబుల్ స్పూన్ల గులాబీ నీటితో ఈ పేస్ట్ ను కలపండి.

- మీ తలపై దీనిని రాసి అద్భుతమైన ఫలితాలని పొందడానికి ఒక గంట సేపు ఉంచి తర్వాత, మీకు

ఇష్టమైన షాంపూతో మీ తల కడగాలి.

- గమనించదగ్గ ఫలితాల కోసం నెలకు ఒకసారి దీనిని ఉపయోగించవచ్చు.

8.అరటి + కొబ్బరి నూనె

8.అరటి + కొబ్బరి నూనె

-కొబ్బరి నూనె ని 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మైక్రోవేవ్ లో వేడి చేసి బాగా మాష్ చేసిన ఒక అరటి

పండుతో కలపాలి.

-దీనిని మీ జుట్టుకు పట్టించి మరియు 40-45 నిముషాల పాటు వదిలివేయండి. తరువాత, ఒక

తేలికపాటి షాంపూతో కడగాలి.

-వేగవంతమైన ఫలితాల కోసం ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు ప్రయత్నించండి.

English summary

Super Easy DIY Banana Packs For Shiny And Strong Hair

Super Easy DIY Banana Packs For Shiny And Strong Hair,Here are the easy DIY banana packs for shiny and strong hair.
Story first published:Monday, November 27, 2017, 16:53 [IST]
Desktop Bottom Promotion