Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెరుగుతో జుట్టుకు మెరుపులు...వలపులు...!!
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరీకి తెలసినద, పెరుగు ప్రతి ఇంట్లో ఉండే చల్లని ఆహారపదార్థం.మజ్జిగ కూడా ఆరోగ్యకరమైన డ్రింక్. పాలు, పెరుగు, మజ్జిగలో క్యాల్షియం, విటమిన్స్ , ప్రోటీన్స్ ఎక్కువగా
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరీకి తెలసినద, పెరుగు ప్రతి ఇంట్లో ఉండే చల్లని ఆహారపదార్థం.మజ్జిగ కూడా ఆరోగ్యకరమైన డ్రింక్. పాలు, పెరుగు, మజ్జిగలో క్యాల్షియం, విటమిన్స్ , ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ ఆరోగ్యపరంగా జీర్ణ శక్తిని పెంచుతాయి. అదే విధంగా అందానికి కూడా గొప్పగా ఉపయోగపడుతాయి. పెరుగును ప్రతి ఒక్కరూ తింటారు. పెరుగును ఆహారంగా మరియు వంటలకు మాత్రమే కాకుండా చర్మ, కేశ సౌందర్యానికి కూడా బహు విధాలుగా ఉపయోగిస్తుంటారు.
పెరుగును చర్మ , కేశ సౌందర్యానికి ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం...

డీప్ గా మాయిశ్చరైజర్ చేస్తుంది:
చర్మానికి డీప్ గా మాయిశ్చరైజర్ లక్షణాలను అందిస్తుంది. ఇది చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. 4 చెంచాల పెరుగులో ఒక చెంచా తేనె, ఒక చెంచా కోకపౌడర్ మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటిలో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి హైడ్రేషన్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ఇదిస్కిన్ స్ట్రక్చర్ ను కూడా మెరుగుపరుస్తుంది.

యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్:
పెరుగులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలో ముడుతలు, చారాలను పోగొడుతుంది. వయస్సు తెలియనివ్వకుండా సహాయపడుతుంది. 4 చెంచాలా పెరుగులో కొద్దిగా ఓట్స్ పొడి మిక్స్ చేయాలి. అందులోనే నిమ్మరసం, తేనె మిక్స్ చేసి అన్ని చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖం మెడకు అప్లై చేసి, స్క్కబ్ చేయాలి. ఈ మిశ్రమంలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, మంచి ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ డల్ స్కిన్ తొలగించి యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

హైపిగ్మెంటేషన్ నివారిస్తుంది:
మొటిమలు, మచ్చలు కనబడితే మనలో హైపర్ టెన్షన్ పెరిగిపోతుంది. అలా జరగకూదనుకుంటే, పెరుగును మీ బ్యూటి కిట్ లో చేర్చుకోవాల్సింది, చర్మంలో తెల్లగా, నల్లగా ఏర్పడిన మచ్చలను, డార్క్ ప్యాచ్ లను నివారించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఒక స్పూన్ పెరుగులో అరస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ముఖం , మెడకు , మచ్చలు ఏర్పడ్డ ప్రదేశంలో అప్లై చేయాలి. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. చర్మంలో కొత్తదనంను తీసుకొస్తుంది. కొత్త చర్మకణాలను ప్రోత్సహిస్తుంది. ముఖంలో డార్క్ స్పాట్స్ నివారిస్తుంది.

ఎక్సలెంట్ కండీషనర్ :
హెయిర్ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కండీషనర్ అప్లై చేయాలి. కెమికల్ కండీషనర్ కు బదులు, పెరగుు అప్లై చేస్తే, అద్భుతమైన మార్పు వస్తుంది. జుట్టు సిల్కీగా , హైనీగా మారుతుంది. 6 చెంచాలా పెరుగులో కొద్దిగా కొబ్బరి నూనె, అలోవెర జెల్ మిక్స్ చేయాలి. మూడూ బాగా మిక్స్ చేసి, రిఫ్రిజరేటర్ లో కొద్దిసేపు పెట్టి, తర్వాత దీన్ని తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:
పెరుగు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైయ్యే పోషకాలను న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. హెయిర్ ఫోలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది. పెరుగులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, అరకప్పు పెరుగులో 3 చెంచాలా మెంతి పౌడర్ మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు సమస్యలను నివారించడంలో ఈ హోం రెమెడీ గ్రేట్ అని చెప్పొచ్చు..



Click it and Unblock the Notifications