For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడ్డం తెల్లగా కనబడుతుంటే ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్ ఫాలో అవ్వండి!

మీ గెడ్డం తెల్లబడిందా? గెడ్డంలో తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నారా? గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనబడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీకోసమే ఇక్కడ కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి గడ్డంలో

By Mallikarjuna
|

మీ గెడ్డం తెల్లబడిందా? గెడ్డంలో తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నారా? గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనబడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీకోసమే ఇక్కడ కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి గడ్డంలో తెల్ల వెంట్రుకలు కనబడనివ్వకుండా చేస్తాయి.

తలలో కానీ, గడ్డంలో కాని తెల్లజుట్టు కనిపించదంటే చాలు ఎక్కువగా బాధపడుతంటారు. అలా రావడానికి కారణం హెయిర్ ఫోలిసెల్స్ లోని మెలనిన్ కారణం, ఒక్కసారిగా ఇలా వచ్చిపడుతుంది.

herbal remedies for grey beard

హెయిర్ ఫాలిసెల్స్ లో మెలనిన్ తగ్గడం వల్ల అలా తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. మెలనిన్ కంటెంట్ తగ్గడం వల్ల, కాపర్ మరియు ఐరన్ లోపం వల్ల , హెరిడిటి, స్మోకింగ్, స్ట్రెస్, అనీమియా వంటి మరికొన్ని కారణాలు వల్ల తలలో మరియు గడ్డంలో తెల్ల వెంట్రుకలు వస్తాయి.

అందుకు మీరు ఏం చేయాలి? మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ప్రోటీన్ మరియు ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, స్మోకింగ్ వదిలిపెట్టాలి, రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలి.

గడ్డం తెల్ల బడకుండా న్యాచురల్ కలర్ తో ఉండేందుకు కొన్ని హోం మేడ్ మాస్క్ లు ఇక్కడ మీకోసం అందిస్తున్నాము.

నోట్ : ఈ క్రింది సూచించిన ఏలాంటి న్యాచురల్ పదార్థాలైనా గడ్డంలో తెల్ల వెంట్రుకలను నివారిస్తుంది. అయితే వీటిని వాడటానికి ముందు ప్యాచ్ టెస్ట్ ను ట్రై చేసి, ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ లేకుంటే తర్వాత నేరుగా అప్లై చేసుకోవచ్చు.!

ఆమ్లా మరియు కొబ్బరి నూనె:

ఆమ్లా మరియు కొబ్బరి నూనె:

ఆమ్లా (ఉసిరికాయ)లో విటమిన్ సి ఎక్కువ, ఇది ఏజింగ్ లక్షనాలు ఒకటైన తెల్ల జుట్టును నివారిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా జ్యూస్ లో ఒక కప్పు కొబ్బరి నూనె కలపాలి

ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

రాత్రి తలకు అప్లై చేసి, తర్వాత రోజు ఉదయం తలస్నానం చేయాలి

ఇలా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకులో విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ లున్నాయి. కరివేపాకు జుట్టు యొక్క న్యాచురల్ పిగ్మెంటేషన్ ను రీస్టోర్ చేస్తుంది.

ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుని, ఎండలో ఎండబెట్టాలి

ఎండలో బాగా ఎండిన తర్వాత , మెత్తగా పౌడర్ చేయాలిజ.

ఈ పౌడర్ ను వంటల్లో ఉపయోగించుకోవడం, నీళ్ళలో కలుపుకుని తాగడం చేయాలి.

ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే , కొన్ని నెలల్లోని మార్పు కనిపిస్తుంది.

బ్లాక్ టీ లీవ్స్

బ్లాక్ టీ లీవ్స్

బ్లాక్ టీ లీవ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి,. ఇవి మెలనిన్ మరియు కెరోటిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఒక కప్పు నీళ్ళు బాగా మరిగించి, అందులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ టీ ఆకుల పౌడర్ ను కలపాలి

5 నిముషాలు బాగా మరిగించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

ఈ ద్రవం కూల్ గా మారిన తర్వాత వడగట్టి, స్ప్రే బాటిల్లోకి మార్చుకోవాలి.

ఈ మిశ్రమాన్ని గడ్డంకు అప్లై చేయడం లేదా అప్పుడప్పుడు స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది

15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి.

కవ్ బటర్

కవ్ బటర్

వెన్నలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇవి తెల్లగా మారిన వెంట్రుకలను నల్లగా మార్చుతాయి. అలాగే సాప్ట్ గా కనబడేలా చేస్తాయి.

ఒక టీస్పూన్ బటర్ తీసుకోవాలి

గడ్డంకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి.

5 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత కడిగేయాలి

మంచి ఫలితాల కోసం ఈ హెర్బల్ రెమెడీని రోజూ వాడాలి

అలోవెర

అలోవెర

కలబందలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తాయి.

అరటీస్పూన్ వెన్నలో అరటీస్పూన్ అలోవెర జెల్ కలిపి తలకు అప్లై చేయాలి.

10నిముషాలు మసాజ్ చేయాలి

15 నిముషాల తర్వాత చన్నీటితో కడిగేయాలి.

షేవింగ్

షేవింగ్

ఎప్పుడూ షేవింగ్ చేసుకోవడం లేదా సాధ్యమైనంత వరకూ ట్రిమ్మింగ్ చేసుకోవడం మంచిది. గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి, గడ్డం తెల్లగా ఉన్నవారు ఎప్పుడు క్లీన్ అండ్ షార్ట్ , షార్ప్ బ్రీడ్ స్టైల్ ను ఎప్పుడు మెయింటైన్ చేయండి.

బంగాళదుంప తొక్క:

బంగాళదుంప తొక్క:

బంగాళదుంపలో గంజి ఎక్కువగా ఉంటుంది, ఇది న్యాచురల్ డైగా పనిచేస్తుంది తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుతుంది. తాత్కలికంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

6 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకోవాలి.

తొక్కను ఒక బౌల్లోకి తీసుకోవాలి.

అందులో రెండు కప్పులు నీళ్ళు పోసి బాగా ఉడికించాలి, తర్వాత హీట్ తగ్గించాలి. 5 నిముషాలు సిమ్ లో ఉంచి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారిని తర్వాత వడపోసుకోవాలి.

ఈ వైట్ లిక్విడ్ లో కాటన్ డిప్ చేసి గడ్డంకు అప్లై చేయాలి.

10 నిముషాల తర్వాత తడి టవల్ తో తుడిచేసుకోవాలి. .

మజ్జిగ

మజ్జిగ

మరో ఫర్ఫెక్ట్ హోం మేడ్ బ్రీడ్ ఫేస్ మాస్క్

ఒక టేబుల్ స్పూన్ మజ్జిగను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఆకులను వేయాలి.

30 నిముషాలు మైక్రోవోవెన్ లో పెట్టి వేడి చేయాలి. తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకూ చల్లారనివ్వాలి.

తర్వాత గడ్డంకు అప్లై చేసి మసాజ్ చేయాలి

20 నిముసాల తర్వాత కడిగేయాలి.

ఈ హోం రెమెడీని రోజూ ప్రయత్నించవచ్చు

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది, పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటిని రిస్టోర్ చేస్తుంది, అందువల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది. కొబ్బరి నూనెను గడ్డంకు అప్లై చేసి మసాజ్ చేయాలి.రోజూ రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి

రోజూ గుడ్డు, చీజ్, ఫిష్, సార్డిన్, వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. విటమిన్ బి 12 , అధికంగా ఉండే ఈ ఆహారాలన్నీ తెల్ల జుట్టును నివారిస్తాయి, తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఒక అద్భుతమైన రెమెడీ.

హెచ్చరిక:

హెచ్చరిక:

పైన సూచించిన బ్రీడ్ హెర్బల్ రెమెడీస్ ప్రయత్నించిన వెంటనే ఫలితాలు కనబడువు, అందుకు కొంత సమయం పడుతుంది, క్రమం తప్పకుండా ప్రయత్నిస్తుంటే, ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది.

English summary

Herbal Remedies For Grey Beard | Homemade Mask For White Beard | How To Treat Grey Beard Naturally

Suffering from premature grey hair on beard? Nothing you do is making any difference? Then here are some herbal remedies for grey beard that can be answer to your problems. White hair, be it on scalp or beard, happens when melanin, a compound responsible to impart colour to your hair follicles overtime breaks down.
Story first published:Friday, December 15, 2017, 16:41 [IST]
Desktop Bottom Promotion