For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోయింగ్ అండ్ సిల్కీ హెయిర్ పొందడానికి టమోటో హెయిర్ ప్యాక్..!!

టమోటో మనందరికి అత్యంత పరిచయం అయిన వంటింటి వస్తువు. వంటలకి అద్భుత రుచిని అందిస్తుంది. అంతే కాదు, ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరి వంటగదిలోనూ తప్పని సరిగా నిల్వ ఉంటుంది. ఈ

|

టమోటో మనందరికి అత్యంత పరిచయం అయిన వంటింటి వస్తువు. వంటలకి అద్భుత రుచిని అందిస్తుంది. అంతే కాదు, ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరి వంటగదిలోనూ తప్పని సరిగా నిల్వ ఉంటుంది. ఈ రెడ్ జ్యూసీ టమోటోను వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. చాలా మందికి ఈ జ్యూసీ రెడ్ టమోట ఇంటర్నల్ గా హెల్త్ కు సంబంధించిన ప్రయోజనాలు మాత్రమే కాదు, ఎక్స్ టర్నల్ గా బాడీ కేర్ అద్భుతంగా సహాయపడే లక్షణాలు తెలుసుకుంటే, ఆశ్చర్యం కలగకుండా ఉండదు.

టమోటలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు అన్ని రెడ్ ఫ్రూట్స్ లోలాగే ఈ రెడ్ కలర్ టమోటోలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణం చేతనే ఈ టమోటోను బ్యూటీ ట్రీట్మెంట్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు .

Tomato Hair Pack to Get Glowing Hair and Itchy Scalp..!

టమోటోల్లోని అసిడిక్ యాసిడ్ చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది మరియు చర్మంలోని అదనపు నూనెను నివారిస్తుంది. టమోటలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

టమోటోలో ఆరోగ్యనికి ఉపయోగపడే లాభాలు మాత్రమే కాదు, చర్మ, జుట్టుకు సహాయపడే బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖంలోనే కాదు.. తల్లో మురికీ, చెమటా చేరడం వల్ల జుట్టు దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యను నివారించాలంటే టమోటో హెయిర్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. కేశ సౌందర్యంలో టమోటోలను ఎలా ఉపయోగించాలి. టమోటో హెయిర్ ప్యాక్ వల్ల జుట్టుకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం...

దుర్వాసనని దూరం చేస్తాయి:

దుర్వాసనని దూరం చేస్తాయి:

టొమాటో రసంలో ఉండే ఆమ్లాలు దుర్వాసనని దూరం చేస్తాయి. టొమాటో గుజ్జును మాడుకు పట్టించి పావు గంట తర్వాత కడిగేయాలి. టీ ట్రీ నూనెలో బ్యాక్టీరియాను దూరం చేసే గుణం ఉంది. ఇది చుండ్రునీ తగ్గిస్తుంది. చెంచా టీ ట్రీ నూనెని పావుకప్పు నీళ్లలో వేసి మాడుకు పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చాలు.

గ్లాసీ హెయిర్

గ్లాసీ హెయిర్

టమోటోల్లో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఇది మీ జుట్టు గ్లాసీగా మరియు స్ట్రాంగ్ గా ఉంచుతుంది

చుండ్రును నివారిస్తుంది:

చుండ్రును నివారిస్తుంది:

టమోటోలను స్కిన్ కేర్ కు మాత్రమే కాదు ఇది హెయిర్ కేర్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. టమోటో రసాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల తలలో దురద మరియు చిక్కు నివారిస్తుంది మరియు చుండ్రును పూర్తిగా తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు:

ఆరోగ్యకరమైన జుట్టుకు:

నాణ్యమైన మరియు షైనీ హెయిర్ పొండం కోసం వివిధ రకాల షాంపులు, మరియు హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటం కంటే, టమోటోలను జుట్టు సంరక్షణలో ఒక బాగంగా చేర్చుకుంటే, జుట్టును ఆరోగ్యంగా ఉంచతుంది. టమోటో మీ జుట్టు యొక్క పిహెజ్ స్థాయిలను పెంచుతుంది మరియు ఇది జుట్టుకు సహజ రంగును తీసుకొస్తుంది.

సన్ టాన్ నివారిస్తుంది

సన్ టాన్ నివారిస్తుంది

టమోటోను రెండు బాగాలుగా కట్ చేసి ఎండ వేడివల్ల కమిలిన చర్మం మీద మర్దన చేస్తే సన్ టాన్ నుండి విముక్తి పొందవచ్చు.ఎండలో తిరిగినప్పుడే, చర్మం నల్లగా మారడం, మంట మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవడానికి టమోటో రసం చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ మరియు దురద పెట్టే చర్మాన్ని నివారిస్తుంది.

సన్ స్క్రీన్ :

సన్ స్క్రీన్ :

టమోటోల్లో లికోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఒక సన్ స్ర్కీన్ లా పనిచేస్తుంది. బాడీకేర్ విషయంలో టమోటో ఆహార రూపంలో తీసుకోవడం లేదా టమోటో రసాన్నిచర్మానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

యాంటీఏజింగ్:

యాంటీఏజింగ్:

టమోటోలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్ తో పోరాడుతుంది. శరీరంలోని ప్రీరాడికల్స్ ను నివారించడంతో చిన్న వయస్సులోనే ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. ఇది ఒక అద్భుతమైన కారణం చేత టమోటోలను బ్యూటీ వస్తువుగా ఉపయోగించుకోవచ్చు.

చర్మరంధ్రాలు కుచించుకుపోయేలా చేస్తుంది:

చర్మరంధ్రాలు కుచించుకుపోయేలా చేస్తుంది:

శరీరానికి టమోటలను ఉపయోగించడానికి మరో కారణం. చర్మరంధ్రాలను నివారించడానికి టమోటో జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం చేర్చి, రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ రంధ్రాలను నివారించుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ :

ఆయిల్ స్కిన్ :

సాధారణంగా మనలో చాలా మందికి ఆయిల్ స్కిన్ కలిగి ఉంటుంది. అందువల్ల ఆయిల్ స్కిన్ నివారించడం కోసం రసాయనాలతో తయారుచేసిన కాస్మొటిక్స్ ను అప్లై చేయవల్సిన అవసరం లేదు. టమోటో రసాన్ని రెగ్యులర్ గా ఆయిల్ స్కిన్ మీద అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. టమోటోలను ఉపయోగించడానికి బాడీకేర్ లో ఇది మరో టెక్నిక్.

మొటిమలతో పోరాడుతుంది

మొటిమలతో పోరాడుతుంది

స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు టమోటోల్లో మెండుగా ఉన్నాయి . మొటిమలు మరియు వాటి మచ్చలు తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ గా టమోటో బాగా సహాయపడుతుంది.

English summary

Tomato Hair Pack to Get Glowing Hair and Itchy Scalp..!

When the climate shifts from extreme hot to rainy, then our body conditions may get confused and shows some symptoms of it. On body we may feel itching and some boils shows up. On scalp hot boils comes up. Scalp becomes itchy and we tends to scratch on it which causes injury to the scalp.
Desktop Bottom Promotion