For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలోవెర(కలబంద)తో జుట్టు సాప్ట్ గా ..షైనీగా..నిగనిగలాడుతుంది..!

ఎన్నిరకాలుగా ప్రయత్నించినా జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసుకోవడం కన్నా కలబందను ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.

|

ఎన్నిరకాలుగా ప్రయత్నించినా జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసుకోవడం కన్నా కలబందను ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.

Use Of Aloe Vera For Hair Car

చాలామందికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలడం. దీన్ని నివారించాలంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె, టేబుల్‌స్పూను తేనె వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లనుంచీ చివర్లవరకూ పట్టించుకోవాలి. అరగంట తరవాత చల్లనినీళ్లతో తలస్నానం చేసుకోవాలి. తలస్నానం అయ్యాక జుట్టంతా కొద్దిగా కండిషనర్‌ పట్టించి రెండుమూడు నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే రాలే సమస్య తగ్గడమే కాదు, జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

Use Of Aloe Vera For Hair Car
తలకు రకరకాల క్రీంలు వాడటం, కర్లింగ్‌ చేయించుకోవడం వంటి కారణాలతో జుట్టు ఎండుగడ్డిలా మారిపోతుంటుంది కొందరికి. అలాంటప్పుడు ఈ పూత వేసుకుని చూడండి. రెండు కప్పుల తాజా గోరింటాకూ లేదా కప్పు గోరింటాకుపొడీ, తాజా కలబంద గుజ్జూ, పెరుగూ రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, కొబ్బరినూనె టేబుల్‌స్పూను తీసుకోవాలి. గోరింటాకును ముద్దలా చేసుకుని అందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలపాలి. ముందు తలకు కాస్త కొబ్బరినూనె రాసుకుని రెండు భాగాల్లా విడదీసుకోవాలి. ఈ పూతను జుట్టంతా పట్టించుకుని గంట తరవాత తలస్నానం చేయాలి. కలబంద, గోరింటాకు కండిషనర్‌లా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తాయి. జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. కలబందలోని సహజనూనె లు జుట్టును ఎండిపోకుండా చేస్తాయి..
Use Of Aloe Vera For Hair Car

రోజు విడిచి రోజూ తలస్నానం చేస్తున్నా కూడా కొందరి జుట్టు జిడ్డుగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కలబంద గుజ్జూ, గుడ్డు పచ్చసొన పూత తలకు వేసుకుని చూడండి. ఏం చేయాలంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జులో మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె, రెండు పచ్చసొనలు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఏదయినా బ్రష్‌తో తలంతా పట్టించుకుని గంటా, గంటన్నర తరవాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండుమూడుసార్లు ఈ పూత వేసుకుంటే గనుక జిడ్డు వదిలిపోయి, నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఒత్తుగానూ పెరుగుతుంది.

Use Of Aloe Vera For Hair Car

చుండ్రూ, తల్లో దురద.. లాంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయా.. ముప్పావుకప్పు కలబంద గుజ్జులో రెండు విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ నూనె, చెంచా చొప్పున కొబ్బరినూనె, నిమ్మరసం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని కుదుళ్లకే కాదు.. జుట్టంతా పట్టించి గంటన్నర తరవాత తలస్నానం చేయాలి. తలస్నానం చేస్తున్నప్పుడల్లా ఈ పూత వేసుకుంటే గనుక చుండ్రూ.. దానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

Use Of Aloe Vera For Hair Car

చిన్నవయసులో తలలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తుంటాయి కొందరికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. గుప్పెడు చొప్పున వేపాకులూ, మందార ఆకులు తీసుకోవాలి. ఈ రెండింటినీ ముద్దలా చేసి, అరకప్పు కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకుని అరగంట తరవాత కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు నెరవడం తగ్గుతుంది.

English summary

Use Of Aloe Vera For Hair Car

Use Of Aloe Vera For Hair Car,Aloe vera has many hair benefits. It fights hair fall, increases hair growth and also softens it. So, if you want to try the wonder plant aloe vera to utilise its beauty and hair benefits, here are few ways to use it. Check out few amazing ways to use aloe vera gel for hair care.
Story first published: Saturday, February 4, 2017, 17:18 [IST]
Desktop Bottom Promotion