For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం ఆయిల్ తో జుట్టు సిల్కీగా...షైనీగా...పొడవుగా పెరుగుతుంది..!!

బాదం ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..

|

డ్రై నట్స్ లో బాదం అన్నా..బాదం ఆయిలన్నా తెలియని వారంటూ ఉండరు. బాదం పూర్తి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా బాదం నూనె ఓవరాల్ బ్యూటీని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా స్కిన్, హెయిర్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి.

బాదం పప్పు నుండి బాదం నూనెను తయారుచేస్తారు. బాదం ఆయిల్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది. ఒకటి బిట్టర్ ఆల్మడ్ ఆయిల్ , మరొకటి, స్వీట్ ఆల్మడ్ ఆయిల్. స్వీట్ ఆల్మడ్ ఆయిల్ ను నేరుగా ఉపయోగించుకోవచ్చు. అయితే బిట్టర్ ఆల్మడ్ ఆయిల్ ను అలా కాదు.

స్వీట్ ఆల్మడ్ ఆయిల్లో అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా. చర్మానికి ,జీర్ణవ్యవస్థకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్, చర్మానికి మరియు జుట్టుకు గ్రేట్ గా సమాయపడుతుంది. పోషణను అందిస్తుంది.

బాదం ఆయిల్లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మరియు జుట్టుకు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మానికి, జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.చర్మంను హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

అంతే కాదు, జుట్టుకు అమేజింగ్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. బాదం ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

బాదం ఆయిల్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. బాదం ఆయిల్ ను తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, పెస్కీ ఫ్లాక్స్ తొలగిపోతాయి.

హెయిర్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది:

హెయిర్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది:

బాదం ఆయిల్లో ఉండే మెగ్నీషియం జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. బాదంను వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ లోఉపయోగిస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

జుట్టును షైనింగ్ గా మార్చుతుంది:

జుట్టును షైనింగ్ గా మార్చుతుంది:

బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల , ఇది జుట్టుకు సెరమ్ లా పనిచేస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.తలస్నానం చేసిన తర్వాత కూడా రెండు మూడు చుక్కల బాదం ఆయిల్ ను జుట్టు పొడవునా అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా..షైనీగా కనబడుతుంది.

.డ్యామేజైన హెయిర్ ను రిపేర్ చేస్తుంది:

.డ్యామేజైన హెయిర్ ను రిపేర్ చేస్తుంది:

తలకు బాదం ఆయిల్ పట్టించి, మసాజ్ చేయాలి. వారంలో రెండు సార్లు బాదం ఆయిల్ తో హెయిర్ మసాజ్ చేయడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

కొంత మంది తరచూ జుట్టు చిట్లడాన్ని గమనిస్తుంటారు. జుట్టును ఎన్ని సార్లు కట్ చేసినా, తిరిగి అదే సమస్య. ఈ సమస్యను నివారించుకోవడానికి ఆలివ్ ఆయిల్ ను , బాదం ఆయిల్ తో మిక్స్ చేసి, జుట్టుపొడవును అప్లై చేయాలి. ముఖ్యంగా జుట్టు చివర్లకు ఎక్కువగా అప్లై చేయాలి.

పొడి జుట్టును నివారిస్తుంది:

పొడి జుట్టును నివారిస్తుంది:

పొడి జుట్టుతో బాధపడుతుంటే, బాదం ఆయిల్ బెస్ట్ ట్రీట్మెంట్ . బాదం ఆయిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. రెగ్యులర్ గా బాదం ఆయిల్ ను అప్లై చేయడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రయోజనాలన్ని అందుతాయి. మీ జుట్టు చూడటానికి అందంగా కనబడుతుంది.

English summary

You'd Want To Use Almond Oil For Hair Once You Know Of These Benefits

Almond oil is rich in many nutrients, which is why it is extremely beneficial for hair. Here's how you can use it on your hair.
Desktop Bottom Promotion