For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి మరియు చిట్లిన జుట్టుకు 10 కారణాలు

|

ఎండిపోయిన తెగిపోయిన జుట్టుతో వేగడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఇది పాడైనట్టు కన్పించడమే కాక, ఇలాంటి జుట్టుతో హెయిర్ స్టైల్స్ కూడా కష్టమే.

స్ట్రెయిట్ లేదా రింగులు ఏదైనా మీ వెంట్రుకలు పొడిగా ఉంటే మొత్తం మీ జుట్టు అందాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తూ ఈ కాలంలో యువతులకు ఇలాంటి జుట్టు ఎక్కువగా ఉంటోంది.

reasons for dry hair | reasons for brittle hair | top 10 reasons for dry and brittle hair

మీ జుట్టు కూడా ఎండిపోయినట్టు, తేమ లేకుండా, పగిలిపోయి ఉంటే, ఈ సమస్యకి కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.మీ జుట్టు పొడిగా ఎందుకు మారిందో కారణం తెలుసుకుంటే, మీరు దాన్ని మెరుగ్గా బాగుచేయగలరు.

అందుకని ఈ రోజు బోల్డ్ స్కైలో ఎండిపోయి, పగిలిపోయే జుట్టుకు 10 కారణాలు వివరించాం. మీ కారణం ఏంటో కనుక్కుని మళ్ళీ మీ జుట్టును ఆరోగ్యంగా, మెత్తగా, మృదువుగా మార్చుకోండి.

ఆ కారణాలేంటో కింద చదవండిః

1.ఆరోగ్యపరమైన సమస్యలు

1.ఆరోగ్యపరమైన సమస్యలు

మీ జుట్టు స్థితి మీలో అనారోగ్యాన్ని సూచిస్తుండవచ్చు. నిపుణులు కొన్ని ఈటింగ్ డిజార్డర్స్ తో బాధపడేవాళ్ళు మరియు ఇతర సమస్యలైన హైపోథైరాయిడిజమ్ వంటి వాటితో బాధపడేవారు పొడి లేదా పగిలిన జుట్టు బారిన పడతారు.

2.వేడితో స్టైల్ చేసే పరికరాల అధిక వాడకం

2.వేడితో స్టైల్ చేసే పరికరాల అధిక వాడకం

వేడితొ స్టైల్ చేసే పరికరాలు అనగా స్టెయిట్నర్స్ ,కర్లింగ్ ఐరన్స్ మొదలైనవి క్రమం తప్పకుండా వాడటం వలన మీ జుట్టులో తేమను హరించి పొడి మరియు పగిలిపోయేలా చేస్తాయి. వీటి వాడకం తగ్గించండి లేదా హీట్ ప్రొటెక్టంట్ స్ప్రే వాడి జుట్టును డ్యామేజీ నుండి కాపాడుకోండి.

3.రసాయనాలు కలసిన ఉత్పత్తుల వాడకం

3.రసాయనాలు కలసిన ఉత్పత్తుల వాడకం

రసాయనాలు కలిసున్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడటం వలన కూడా ఆరోగ్యం మరియు జుట్టు కన్పించే తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అవి మీ జుట్టుపాయలను ఎండిపోయినట్టుగా, పగిలినట్టుగా మాత్రమే కాదు, జుట్టు ఊడిపోయే ప్రమాదానికి కూడా దారితీస్తుంది.

4.నూనె రాసుకోకపోవటం

4.నూనె రాసుకోకపోవటం

మీ జుట్టుకి నూనె రాసుకోవటం ముఖ్యం. నూనె రాసుకోకపోవటం ఎండిపోయిన, పగిలిపోయే జుట్టు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. సహజ నూనెలైన కొబ్బరినూనె మరియు ఆలివ్ నూనెలో అనేక పోషకాలు, విటమిన్లుండి మీ జుట్టును ఆరోగ్యంగా, తేమగా, మెత్తగా ఉంచుతాయి.

5.వాతావరణ కారణాలు

5.వాతావరణ కారణాలు

కొన్ని పర్యావరణ కారణాలు కూడా మీ జుట్టు కుదుళ్ళను పాడుచేసి , వెంట్రుకలను పొడిగా పగిలిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా కఠినమైన సూర్యకిరణాలు, కలుషితమైన గాలి మొదలైనవి పొడి మరియు పగిలిపోయిన జుట్టును అనారోగ్యంగా కన్పించేలా చేసే కారణాలు.

6.చెడు స్నానపు అలవాట్లు

6.చెడు స్నానపు అలవాట్లు

ఇది మరొక పొడి మరియు పగిలిపోయిన జుట్టుకు కారణం. మీ జుట్టును వేడినీరుతో కడగటం లేదా షాంపూను అలా తలపై ఎక్కువసేపు వదిలేయటం మీ జుట్టును పొడిగా, పగిలిపోయేలా చేస్తుంది. అందుకే మీ జుట్టును గోరువెచ్చని నీరుతో కడిగి షాంపూను ఎక్కువసేపు ఉంచుకోకండి.

7.రసాయన ట్రీట్మెంట్లు

7.రసాయన ట్రీట్మెంట్లు

క్రమం తప్పకుండా జుట్టుకి రంగులు వాడటం జుట్టును పాడుచేస్తుంది.దీనివల్ల మీ జుట్టు పొడిగా, పగిలిపోయినట్లుగా కన్పించేలా చేస్తుంది.ఈ రసాయన ట్రీట్మెంట్లు చూడటానికి అసహ్యంగా ఉండేట్లు జుట్టును మార్చేస్తాయి.

8.ఎక్కువ లేదా తక్కువ కడగటం

8.ఎక్కువ లేదా తక్కువ కడగటం

ఎక్కువ లేదా తక్కువ తలను కడగటం పొడి మరియు పగిలిపోయే జుట్టుకు మరో కారణం. ఎక్కువగా కడగటం వలన సహజమైన నూనెలు మరియు తేమ పోతాయి. మరోవైపు తక్కువ కడగటం వలన మీ జుట్టులో కలుషితాలు,మురికి పెరిగిపోయి మీ జుట్టును పొడిగా పగిలిపోయేట్టు చేస్తుంది.

9.తడి జుట్టుతో పొరపాట్లు

9.తడి జుట్టుతో పొరపాట్లు

స్నానం చేసాక తలతో ఏం చేస్తారన్నదానిపై మీ జుట్టు స్థితి ఆధారపడి వుంటుంది. తడిజుట్టును ముడి ఏదా అదేపనిగా దువ్వటం వలన మీ జుట్టు కుదుళ్ళు పాడయి, తేమ పోయి ఎండిపోయి,పగిలిపోయినట్లుగా కన్పిస్తుంది.

10 జుట్టును అదేపనిగా దువ్వటం

10 జుట్టును అదేపనిగా దువ్వటం

ముందు చెప్పిన కారణాలలాగానే, అధికంగా దువ్వటం వలన సహజమైన తేమ పోయి చాలా పొడిగా, పగిలిపోయినట్లు అయిపోతుంది. అదేకాక, జుట్టు ఊడిపోవటం పెరిగి, సన్నబడిపోతుంది. అందుకే రోజుకి రెండుసార్ల కన్నా దువ్వటం మంచిది కాదు.

Read more about: hair care dry hair remedies
English summary

reasons for dry hair | reasons for brittle hair | top 10 reasons for dry and brittle hair

Once you've figured out the reason why your hair is dry, you'll be able to treat it better. It is no secret that dry and brittle hair is a pain to deal with. Not only does it look unappealing and damaged but it can also be quite difficult to style this type of hair.
Desktop Bottom Promotion