For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలబంద గుజ్జు వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు

కలబంద గుజ్జు వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు

|

ఎన్నిసార్లు మీ పత్రికల ముఖచిత్రాలపై అలల వంటి కురులను కలిగిన వనితలను చూసి ఈర్ష్య పడ్డారో?ఎన్నిసార్లు వాతావరణం, కేశాలంకరణ ఉపకరణాలు మరియు ఉత్పత్తుల వలన పగిలి, చిట్లి, విరిగి, అందాన్ని కోల్పోతున్న మీ కురులను చూసి బాధపడ్డారో? ఆరోగ్యవంతమైన శిరోజాలు పొందలేకపోతున్నందుకు ఎన్నిసార్లు మీలో అసహనం కలిగిందో?

అయితే ఆ రోజులన్నింటిని గతంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే, మీ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి మీకు అవసరమైన ఏకైక పదార్ధం కలబంద గుజ్జు. అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన కలబంద గుజ్జు, మీరెంతగానో ఎదురుచూసే ఒత్తైన, నల్లని, పొడవైన, మెరిసే కురులను మీకు అందిస్తుంది.

Benefits Of Aloe Vera For Hair

కలబంద గుజ్జు అనేక కూడా సమస్యలతో పోరాడుతుంది, అది కూడా పెద్ద ఖర్చు లేకుండానే!కలబంద వలన డెబ్భై ఐదు రకాల పోషకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినప్పటికి, దానిలో వందకు పైగా పోషకాలు నిజానికి ఉంటాయంటారు.

అసలు కలబంద ఏ విధంగా మీ కేశ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందో మీకు తెలుసా?మేమైతే మీ కురులపై కలబంద తన మాయాజాలాన్ని చూపెడుతుందని చెప్తాము. మీకది అతిశయోక్తిగా అనిపించినప్పటికి, ముమ్మాటికీ నిజం.

1. కలబందలోని ప్రోటీయోలైటిక్ ఎంజైములు, మాడుపై నష్టపోయిన కణాలను పునరుజ్జీవింప చేస్తాయి. దేరని వలన, వెంట్రుకలు ఆరోగ్యంగా, త్వరగా పెరుగుతాయి.

2. కలబంద గుజ్జును రాసుకుంటే, జుట్టు మెత్తగా, మెరిసేటట్టు మారుతుంది. ఈ విధమైన జుట్టును ఏ విధంగా అయిన అలంకరించుకోవచ్చు లేదా వదులుగా వదిలేయవచ్చు.

3. కలబంద గుజ్జు జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది కనుక మీ జుట్టు దట్టంగా, ఎక్కువ పరిమాణం ఉన్నట్లు కనిపిస్తుంది.

4. కలబందలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ తత్వాలు, మాడుపై దురద మరియు మంట తగ్గించి చల్లబరుస్తుంది.

5. కలబందలోని యాంటీఫంగల్ గుణాల వలన, మాడు మీద చుండ్రు మరియు చర్మం పొలుసులుగా రాలడం ఆగుతుంది.

6. ప్రోటీయోలైటిక్ ఎంజైములతో పాటుగా, కలబందలో ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన, వెంట్రుకలకు పోషణ మెండుగా లభిస్తుంది.

7. కలబంద జుట్టును కండిషన్ చేసి, పోషకాలను కురులలో దాచిపెట్టి, తేమను పెంచుతాయి.

కలబందకు సంబంధించిన మరొక మంచి విషయం ఏమిటంటే, దీనిని మీ పెరట్లో సులువుగా పెంచుకోవచ్చు కనుక దానిలో రసాయనాలు ఉన్నాయనే భయం ఉండదు.దీనిలోని సుగుణాలన్ని మీ జుట్టు యొక్క సమస్యలన్నింటిని పూర్తిగా పారద్రోలుతాయి.

దీనిలోని ఏ, ఏ సుగుణాలున్నాయో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీ దైనందిన జీవితంలో దీనిని ఎలా వాడవచ్చో తెలుసుకుందాం.

అద్భుతమైన హెయిర్ ప్యాక్:

కొబ్బరినూనె మరియు కలబంద గుజ్జులను సమపాళ్లలో కలిపి జుట్టుకు క్రమం తప్పకుండా రాసుకుంటే, బలంగా, మృదువుగా, ఒత్తుగా మారుతుంది. వారానికి రెండు సార్లు దీనిని జుట్టుకు రాసుకుని, వీలైనంత సేపు ఉంచుకోవాలి.

ముందుగా ఈ మిశ్రమంతో మాడుకు మర్దన చేసుకుని, మెల్లగా జుట్టు చిగుళ్ల వరకు రాసుకుంటూ రావాలి. ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉన్నందున, చిగుళ్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. జుట్టంతటికి పట్టించిన తరువాత, షవర్ క్యాప్ పెట్టుకుని గంటసేపు వదిలేయాలి.తరువాత శుభ్రంగా కడిగేయండి.

ఈ అద్భుతమైన కండీషనర్ మీ జుట్టుకు, మాడుకు కావలసినంత తేమను సమకూర్చుతుంది. దీనివలన జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ మాస్కు జుట్టు అందాన్ని ఇనుమడింపచేస్తుంది కనుక, మీరు పదేపదే జుట్టును కత్తిరించనవసరం లేదు.

చాలామంది సూర్యుని ప్రతాపం వలన కమిలిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కలబంద వాడతారు. కానీ ఈ రోజు బోల్డ్ స్కై ద్వారా, కలబందను జట్టుపై పరీక్ష చేయగా కలిగిన మంచి ఫలితాలను మీతో పంచుకున్నాము.

రసాయనాలు వాడకుండా ఆరోగ్యవంతమైన మాడుతో పాటుగా అందమైన జుట్టు కావాలని ఎవరు మాత్రం ఆశించారు? దీనికి మేమిచ్చే రెండు అద్భుతమైన సమాధానాలు కలబంద గుజ్జు మరియు కొబ్బరినూనె.

English summary

Benefits Of Aloe Vera For Hair

Benefits Of Aloe Vera For Hair,What does Aloe Vera exactly do for your hair, you ask? We say it’s one of the most magical ingredients you could put on your hair. It might sound exaggerating, but these facts cannot be disputed. Take a look!
Desktop Bottom Promotion