For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తైన జుట్టు కోసం మేటి సుగంధ ద్రవ్య నూనెల మిశ్రమాలు

జుట్టును స్టైల్ చేసే పరికరాలను ఎక్కువ వాడటం వలన మీ జుట్టు పల్చగా, విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలాంటి జుట్టు అనారోగ్యంగా, చూడటానికి కూడా అంత బాగోదు.ఈ జుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. ఈ

|

జుట్టును స్టైల్ చేసే పరికరాలను ఎక్కువ వాడటం వలన మీ జుట్టు పల్చగా, విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలాంటి జుట్టు అనారోగ్యంగా, చూడటానికి కూడా అంత బాగోదు.

ఈ జుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. ఈ సమస్యను ఎదుర్కోటానికి, కొన్ని వస్తువులు మాత్రమే అద్భుతమైన ప్రభావం చూపిస్తాయి. అందులో సుగంధ ద్రవ్య నూనెలు ఉన్నాయి.ఇవి జుట్టును వత్తుగా మారుస్తాయి.

essential oil blends for hair thickness

అందాల ప్రపంచంలో జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో సుగంధ నూనెలు ఈ మధ్య బాగా హల్ చల్ చేస్తున్నాయి. జుట్టుకి లాభాన్నిచ్చే పోషకాలతో పాటు, కొన్ని సుగంధ నూనెలైతే జుట్టును వత్తుగా కూడా మారుస్తాయి.

నిజానికి, ఇలాంటి సుగంధ నూనెలను ఇతర వస్తువులతో కలిపి వాడినప్పుడు వాటి ప్రభావం మరింత పెరుగుతుంది. అందుకని ఈ రోజు బోల్డ్ స్కైలో అలాంటి సుగంధ నూనెల మిశ్రమాలను మీ వత్తైన ,కాంతివంతమైన జుట్టుకోసం మేం తీసుకొచ్చాం. చదవండి.

పల్చని జుట్టుకి టాటా చెప్పటానికి ఉపయోగపడే రెసిపిలు ఇవిగో ;

రెసిపి#1

రెసిపి#1

మీకు కావలసినవి ;

4-5 చుక్కల లావెండర్ సుగంధ నూనె

1 చెంచా ఆముదపు నూనె

ఎలా వాడాలిః

జుట్టుకి పోషణనిచ్చే ఈ మిశ్రమం తయారీకి,ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన రెండు వస్తువులను వేయండి. బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేయండి.దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 15నిమిషాలు ఉండనివ్వండి. గోరువెచ్చని నీరుతో,మామూలు షాంపూతో తలస్నానం చేయండి. వారానికి ఒకసారి ఇలా చేసి జుట్టు వత్తులో తేడాలు మీరే చూడండి.

రెసిపి#2

రెసిపి#2

మీకు కావాల్సినవి;

4-5చుక్కల జొజుబా సుగంధ నూనె

1చెంచా ఆలివ్ నూనె

ఎలా వాడాలిః

ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన రెండు వస్తువులను వేయండి. బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేయండి.దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 15నిమిషాలు ఉండనివ్వండి. గోరువెచ్చని నీరుతో తలస్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేసి జుట్టు వత్తులో తేడాలు మీరే చూడండి.

రెసిపి#3

రెసిపి#3

మీకు కావాలసినవి;

5-6చుక్కల కేదార్ వుడ్ సుగంధ నూనె

1చెంచా కొబ్బరినూనె

ఎలా వాడాలిః

సింపుల్ గా రెండు వస్తువులను నురగ వచ్చేలాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించండి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి మామూలు షాంపూతో తలస్నానం చేయండి. దీన్ని వారానికి రెండుసార్లు పాటించి వత్తైన కాంతివంతమైన జుట్టును పొందండి.

రెసిపి#4

రెసిపి#4

మీకు కావాల్సినవి;

3-4 చుక్కల పెప్పర్ మింట్ సుగంధ నూనె

2 చెంచాల బాదం నూనె

ఎలా వాడాలిః

ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన వస్తువులను వేయండి. బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేయండి.దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 10-15నిమిషాలు ఉండనివ్వండి. గోరువెచ్చని నీరుతో తలస్నానం చేయండి. నెలకి మూడుసార్లు ఇలా చేసి జుట్టు వత్తులో తేడాలు మీరే చూడండి.

రెసిపి#5

రెసిపి#5

మీకు కావాలసినవిః

6-7చుక్కల టీ ట్రీ సుగంధ నూనె

2-3 చెంచాల ఆలోవెరా జెల్

1చెంచా రోజ్ వాటర్

ఎలా వాడాలిః

పైన చెప్పిన వస్తువులను కలిపి ఆ మిశ్రమాన్ని తయారుచేసి జుట్టుకి పట్టించండి. 15-20నిమిషాలు అలానే ఎండనిచ్చి గోరువెచ్చని నీరుతో ,షాంపూతో తలస్నానం చేయండి. ఇది నెలకి రెండుసార్లు పాటించి మీ జుట్టుకోసం మంచి ఫలితాలను పొందండి.

రెసిపి#6

రెసిపి#6

మీకు కావాల్సినవిః

5చుక్కల థైమ్ సుగంధ నూనె

1చెంచా విటమిన్ ఇ నూనె

ఎలా వాడాలిః

పైన చెప్పిన వస్తువులను కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి. 15-20నిమిషాలు అలానే ఎండనిచ్చి గోరువెచ్చని నీరుతో తలస్నానం చేయండి. ఇది నెలకి ఒకసారి పాటించి మీ జుట్టుకోసం మంచి ఫలితాలను పొందండి.

రెసిపి#7

రెసిపి#7

మీకు కావాల్సినవిః

5చుక్కల రోస్ మేరీ సుగంధ నూనె

1 తెల్లసొన

1చెంచా నిమ్మరసం

ఎలా వాడాలిః

పైన చెప్పిన వస్తువులను కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి. 15-20నిమిషాలు అలానే ఉంచి తలస్నానం చేయండి. ఇది నెలకి రెండుసార్లు పాటించి వత్తైన జుట్టు పొందండి.

English summary

Best Essential Oil Blends For Hair Thickness

Essential oils have become the latest hair care ingredient to take the beauty world by storm. Packed with hair-benefiting compounds, there are certain essential oils that can help you achieve voluminous hair.
Story first published:Thursday, January 11, 2018, 19:11 [IST]
Desktop Bottom Promotion