For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి జుట్టు అయినా ఈ ఉత్తమమైన హెయిర్ ఆయిల్ పూసుకుంటే నిగనిగలాడి ఒత్తుగా మారుతుంది

By Deepthi
|

ఆలోవెరా (కలబంద) చేసే లాభాలు ఉపయోగాల గురించి మనం చాలానే వినివుంటాం. ఈ లాభాలు కేవలం చర్మంపై వచ్చే సమస్యలకే కాకుండా, జుట్టు సంబంధ సమస్యలకి కూడా మంచి పరిష్కారాలుగా ఉపయోగపడతాయి. ఇందులో వుండే ప్రోటియోలైటిక్ ఎంజైములు తల మాడుపై పాడైన కణాలను బాగుచేసి, ఉపశమనం ఇచ్చి జుట్టు రాలటాన్ని అరికడతాయి, అలా వత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. ఆలోవెరా రసంలో 96% నీరు ఉంటుంది, ఈ ఎక్కువ తేమ ఉండే కారణంగా ఆలోవెరా మీ జుట్టును బాగా కండీషన్ చేసి తన సహజమైన పోషకాలు, హైడ్రేషన్ ను జుట్టుకి పట్టివుంచుతుంది.

కలబంద కొబ్బరినూనె

కానీ, ఈ మ్యాజికల్ ఆలోవెరా కొబ్బరినూనెలోని గొప్పదనంతో కలిస్తే ఏమవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే, ఇదిగో మేము చెప్తున్నాం, అదొక శక్తివంతమైన మిశ్రమం అవుతుంది. ప్రాచీన కాలం నుంచి అనేక తరాలు జుట్టు ఊడిపోవటం, వెంట్రుకలు బలపడటం, జుట్టుపోషణ, సమయానికి ముందే నెరవడాన్ని నివారించడం, బట్టతల మొదలైనవాటికోసం కొబ్బరినూనె మీదే ఆధారపడేవి. అలాంటిది మరి ఈ రెండింటినీ కలిపినప్పుడు ఆలోవెరా సహజమైన క్లెన్సర్,హీలర్ గా పనిచేస్తే, కొబ్బరినూనె జుట్టును బాగుచేయటంతో పాటు మంచి తేమకారిగా పనిచేస్తుంది.

పారాచూట్ వారి అడ్వాన్స్ డ్ ఆలోవెరా ఎన్ రిచ్డ్ కొబ్బరినూనె

ఈ మ్యాజికల్ మిశ్రమం ఇప్పుడు ఒకే సీసాలో లభించనుంది. జుట్టుకి అద్భుతమైన కాంబినేషన్ గా మన ముందుకి రానుంది. పారాచూట్ అడ్వాన్స్ డ్ ఆలోవెరా ఎన్ రిచ్డ్ కొబ్బరినూనెగా వచ్చింది. ఈ రెండు అద్భుతమైన సహజ పదార్థాలతో నిండిన పారాచూట్ అడ్వాన్స్ డ్ వారి సరికొత్త అవతారం ఆలోవెరా మేటి గుణాలను, కొబ్బరినూనె శక్తులను కలిగివుండి, మీ రోజువారి జుట్టు సంరక్షణ అవసరాలను మొత్తంగా తీరుస్తుంది.

మృదుత్వాన్ని, కాంతిని జుట్టుకి అందిస్తుంది

ఇది మీ జుట్టును హానికర రసాయనాలకి దూరంగా ఉంచుతూ మీరెంతకాలం నుంచో ఎదురుచూస్తున్న మృదుత్వాన్ని, కాంతిని జుట్టుకి అందిస్తుంది. ఆ కారణం చేతనే పారాచూట్ అడ్వాన్స్ డ్ వారు కొబ్బరినూనెలో ఆలోవెరా టచ్ ఇచ్చి సృష్టించిన ఈ ఆధునిక ఉత్పత్తి ప్రస్తుతం మార్కెట్లో వారిని జుట్టుకి మేటి నూనెగా నిలిపింది. మీకింకా మరో మంచి విషయం తెలుసా? ఈ నూనె రాసుకున్నప్పుడు బరువుగా లేదా జుట్టుకి అతుక్కుపోయి జిడ్డుగా కూడా అన్పించదు. మీరు రాసుకున్న వెంటనే జుట్టు స్ట్రెయిట్ గా, మృదువుగా అయిపోతుంది. అదనంగా కొబ్బరినూనె వాసన కొంచెంగా తెలుస్తూ మీకు ఆనందంగా అన్పిస్తుంది.

అట్టలు కట్టడమో, చిక్కుపడటమో జరగదు

సెన్సిటివ్ ముక్కులున్న వారికి మంచివార్త ఇందులో చిరాగ్గా అన్పించే ఏ హెర్బల్ వాసన ఉండబోదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మీ జుట్టును మృదువుగా,మెత్తగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. రసాయనాలతో ట్రీట్ చేసిన జుట్టుకు కూడా, పారాచూట్ అడ్వాన్స్ డ్ వారి ఈ ఉత్పత్తి వాడాక జుట్టు అట్టలు కట్టడమో, చిక్కుపడటమో జరగదు; కేవలం సహజంగా గాలికి హాయిగా ఎగురుతూ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా అవసరమైన నూనెను అరచేతుల్లో తీసుకుని మాడుకి,జుట్టుకి రాసుకోండి. వరుసగా రోజూ వాడుతుంటేనే జుట్టు ఊడటం కొంతవరకూ తగ్గుతుంది. మీరు కూడా జుట్టుకి నూనె రాయడం ఇష్టంలేని వారిలో ఒకరైతే, మీరు కేవలం పాడైన కొసలకి మాత్రం నూనె రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేయవచ్చు; మీ జుట్టు ఆరోగ్యవంతంగా, స్పష్టమైన మార్పుతో నిగనిగలాడటాన్ని మీరే చూస్తారు.

మేము మీకు హామీ ఇస్తున్నాం

మన దేశంలో, జుట్టు సంరక్షణకి ముఖ్యంగా పారాచూట్ అడ్వాన్స్ డ్ ఎంతోకాలంగా నమ్మదగిన, రెప్యూటడ్ బ్రాండ్లలో ఒకటిగా ఉంటూ వస్తోంది.ఈ పారాచూట్ అడ్వాన్స్డ్ ఆలోవెరా ఎన్ రిచ్డ్ కొబ్బరి నూనె ఒక సంపూర్ణమైన పరిష్కారం. కొబ్బరినూనె,ఆలోవెరాల మేటి గుణాలు కలిసిన- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది నమ్మకముంచే బ్రాండ్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఉత్పత్తి.
అయితే మీరింకా "ఏంటి? ఆలోవెరాతో కొబ్బరినూనా?" అని ఆశ్చర్యపోతున్నారా? బోల్డ్ స్కైలో మేము మీకు హామీ ఇస్తున్నాం మీ జుట్టును సంరక్షించుకోటానికి, ప్రేమగా చూసుకోవటానికి మీకు దొరికేవాటిల్లో ఇది తప్పకుండా ఒక అద్భుతమైన ఉత్పత్తి.

English summary

Best Hair Oil For Different Hair Types

Best Hair Oil For Different Hair Types