For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆముదం నూనెను వాడితే జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు

అద్భుతమైన ఆముదం నూనె వాడుతూ జుట్టు ఊడిపోవటాన్ని నివారించండి

|

ఆముదం నూనెను రిసినస్ కమ్యూనిస్ అని కూడా అంటారు, ఇది ప్రాచీన కాలం నుండి మొటిమలు, జుట్టు ఊడిపోవటం, ర్యాష్ లవంటివి తగ్గించటం కోసం వాడతారు. ఆముదం నూనెలో బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలుండి, విటమిన్ ఇ, ఖనిజలవణాలు, ఒమేగా 6 ఇంకా 9 ఫ్యాటీయాసిడ్లు, ప్రొటీన్ల వంటివి ఉండి జుట్టు పెరగటానికి సాయపడతాయి.

అదేకాదు, చుండ్రుతో, కుదుళ్ల ఇన్ఫెక్షన్ తో పోరాడతాయి, జుట్టు మొదళ్ళలో వచ్చే సహజ నూనెలను తిరిగి పట్టేలా చేసి, రసాయనాల వలన పాడైన జుట్టును బాగుచేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టులోని కెరాటిన్ కి సపోర్ట్ గా ఉండి జుట్టును బలంగా, మృదువుగా మారుస్తుంది.

home remedies for hair loss

మార్కెట్లో చాలా ఉత్పత్తులు మీ జుట్టుని కాంతివంతంగా, మృదువుగా మార్చేలా చేస్తామని వస్తాయి. కానీ వాటిల్లోని అపాయకర రసాయనాలు జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. అందుకని మీరు ఆముదం నూనె కొనాలనుకుంటే మీరు కోల్డ్ ప్రెస్డ్ హెక్సాన్ లేని ఆముదం నూనెనే ఎంచుకోండి. ఇది ఎందుకంటే అందులో చాలామటుకు పోషకాలుండి మీ జుట్టును పెరిగేలా చేసి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తుంది.

అయితే ఈరోజు మేము మీ కోసం 7 ఆముదం నూనె సంబంధ చిట్కాలను తీసుకువచ్చాం. ఇవి మీ జుట్టు పెరిగేలా చేయటమేకాదు, జుట్టు సమస్యలను కూడా తీరుస్తుంది. అవేమిటో చూద్దాం.

1.కేవలం ఆముదం నూనె

1.కేవలం ఆముదం నూనె

ఆముదం నూనెను జుట్టు పెరగటానికి వాడటానికి ఇది మంచి పద్ధతి. ఆముదం నూనెను నేరుగా జుట్టుపై రాసేసి, మసాజ్ చేయండి. ఆముదం నూనెతో మర్దన చేయటం వలన రక్తప్రసరణ మెరుగయ్యి, మీ జుట్టు అందం కూడా పెరుగుతుంది. ఈ నూనె తల కుదుళ్ళలోకి బాగా ఇంకి, జుట్టు మూలం వరకు వెళ్ళి జుట్టు వేగంగా పెరిగేలా, ఊడిపోకుండా చేస్తుంది.

గమనిక ; కేవలం ఆముదం నూనె మాత్రమే వాడటం వలన వచ్చే ఒకే ఒక్క సమస్య ఏంటంటే దాన్ని వదిలించుకోవటం. నూనె జిడ్డు వదలటానికి చాలాసార్లు తలస్నానం చేయాల్సి వస్తుంది.

పద్దతి;

• కొంచెం ఆముదం నూనె తీసుకుని మీ తల మొత్తం నేరుగా రాసుకోండి.

• మీ తలను 10-15 నిమిషాలపాటు మర్దన చేయండి.

• 4-6 గంటలు కానీ రాత్రంతా కానీ మీ జుట్టును అలా వదిలేయండి.

• మైల్డ్ షాంపూతో తలను కడిగేసి, తర్వాత మామూలు నీరుతో కడిగేయండి.

• వారానికి రెండుసార్లు ఆముదం నూనెను రాసుకుంటే జుట్టు వేగంగా పెరగటం మీరే చూస్తారు.

2.ఆముదం నూనె, కొబ్బరినూనె

2.ఆముదం నూనె, కొబ్బరినూనె

ఆముదం నూనె మందంగా ఉంటుంది, ఇతర నూనెలతో కలిసినప్పుడు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు, కొబ్బరినూనె ఆముదం నూనె వాసనను తగ్గించి రాకుండా చేస్తుంది. ఎందుకంటే ఆముదం వాసన అంత బాగోదు. జుట్టు ఊడిపోయే సమస్యకి ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమం చాలా మంచిది. వీటిల్లో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాలు తల మాడుపై వచ్చిన ఇన్ఫెక్షన్ ను నయం చేసి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తాయి.

ఒక బౌల్ లో ఒక చెంచా ఆముదం నూనె, ఒక చెంచా కొబ్బరినూనెను వేయండి.

• బాగా కలిపి మీ జుట్టుకు మసాజ్ చేయండి.

• ఈ మిశ్రమాన్ని జుట్టుకి రాసి 2-3 గంటలు అలానే వదిలేయండి. షవర్ క్యాప్ వేసుకోండి.

• మైల్డ్ షాంపూతో జుట్టును కడిగేయండి.

• వారానికి రెండుసార్లు ఈ మిశ్రమంతో తలని మసాజ్ చేస్తే జుట్టు ఊడటం తగ్గిపోతుంది.

3.ఆముదం నూనె, ఆవనూనె;

3.ఆముదం నూనె, ఆవనూనె;

ఆవనూనెలో ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ జుట్టు ఎదుగుదలను వేగవంతం చేసి, పోషణనిస్తాయి. ఆవనూనెలో ఉండే బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించి జుట్టు పెరిగేలా చేస్తాయి.

పద్ధతి ;

• ఆముదం నూనె, ఆవనూనెను సమానభాగాలలో ఒక గిన్నెలో కలపండి.

• ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మొత్తానికి పట్టించి 5-10 నిమిషాలపాటు మసాజ్ చేయండి.

• 1 గంటపాటు నూనెను జుట్టుపై వదిలేయండి. వెచ్చని తువ్వాలుతో తలను కప్పండి.

• మామూలు నీరుతో తలని కడిగేసాక మైల్డ్ షాంపూ ఉపయోగించండి.

• ఈ పద్ధతిని ప్రతివారం పాటించి ఆరోగ్యవంతమైన వెంట్రుకలను, జుట్టు పెరగటాన్ని చూడండి.

4.ఆముదం నూనె, బాదం నూనె;

4.ఆముదం నూనె, బాదం నూనె;

బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఉంటాయి, ఇవన్నీ జుట్టు పెరగటానికి ఉపయోగపడతాయి. ఆముదం నూనెను బాదం నూనెతో కలపటం వలన పాడైన జుట్టు చక్కగా బాగయ్యి, జుట్టు వేగంగా కూడా పెరుగుతుంది.

పద్ధతి ;

• ఒక చెంచా బాదం నూనెను ఒక చెంచా ఆముదం నూనెను ఒక బౌల్ లో కలపండి.

• దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 5-10నిమిషాల పాటు మసాజ్ చేయండి.

• గంటపాటు అలా వదిలేయండి.

• తర్వాత మైల్డ్ షాంపూతో తలను కడిగేయండి.

• ఇలా వారంలో రెండుసార్లు చేసి జుట్టు చక్కగా పెరగటాన్ని చూడండి.

English summary

Amazing Use Of Castor Oil To Prevent Hair Loss And Accelerate Hair Growth

Dealing with hair loss problems can be quite frustrating. There are some simple and easy castor oil hacks that will keep you away from hair loss for a long time. Castor oil mixed with coconut water, olive oil or mustard oil could be some of the interesting hacks you might want to try.Castor oil works best for your hair,
Story first published:Tuesday, April 10, 2018, 12:29 [IST]
Desktop Bottom Promotion