For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాండ్రఫ్ ని నివారించేందుకు నువ్వుల నూనె ఏ విధంగా తోడ్పడుతుంది?

డాండ్రఫ్ ని నివారించేందుకు నువ్వుల నూనె ఏ విధంగా తోడ్పడుతుంది?

|

జుట్టు పలచబడటంతో మగువలకు దిగులు మరింత పెరుగుతుంది. అయితే, మగువలారా చింతించకండి. ఈ సమస్యకు ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం నువ్వుల నూనె పరిష్కారంగా పనిచేస్తుంది. నువ్వుల నూనె అనబడే ఎసెన్షియల్ ఆయిల్ ను నువ్వుల పొద నుంచి సేకరిస్తారు. నువ్వుల నూనెను షాంపూ మరియు కండిషనర్స్ వంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తయారీలో ఎక్కువగా వాడతారు. అలాగే యాక్నేతో పాటు డాండ్రఫ్ ని నివారించేందుకు తయారుచేసే ప్రోడక్ట్స్ లో కూడా నువ్వుల నూనెకు ప్రత్యేక స్థానం ఉంది.

నువ్వుల నూనె బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించి తద్వారా వెంట్రుకల మొదళ్ళలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటికి పెంపించేందుకు తోడ్పడుతుంది. నువ్వుల నూనెలో ఉన్న యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు శిరోజాలు ఆరోగ్యంగా అలాగే శుభ్రంగా ఉండేందుకు తోడ్పడతాయి.

Does Sesame Oil Help In Treating Dandruff?

నువ్వుల నూనె శిరోజాలను దృఢంగా చేస్తుంది. అలాగే డాండ్రఫ్, లూజ్ ఎండ్స్, స్ప్లిట్ ఎండ్స్ మరియు ఫ్రిజ్జీ హెయిర్ సమస్యను అరికడుతుంది. నువ్వుల నూనె వలన స్కాల్ప్ పై దురద, డాండ్రఫ్ అలాగే పొడిబారుట వంటి సమస్యలు తగ్గిపోతాయి. డ్రై అలాగే ఆయిలీ స్కాల్ప్ సమస్యను తగ్గిస్తుంది. స్కాల్ప్ లో పీహెచ్ లెవల్ ను రీస్టోర్ చేస్తుంది.

నువ్వుల నూనె రెమెడీస్ ద్వారా హెయిర్ రీ గ్రోత్ ను పెంపొందించుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

డాండ్రఫ్ ను తొలగిస్తుంది:

డాండ్రఫ్ ను తొలగిస్తుంది:

స్కాల్ప్ ను డ్రై చేసే కారకాలను తొలగించి స్కాల్ప్ ఫ్లేకీనెస్ ను తగ్గిస్తుంది. ఆ విధంగా స్కాల్ప్ లో డాండ్రఫ్ ద్వారా కలిగే దురద తగ్గుతుంది.

నువ్వుల నూనెతో స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. కొన్ని చుక్కల నువ్వుల నూనెను షాంపూకు జోడించాలి. ఈ రెండిటినీ బాగా కలిపి తలకు అప్లై చేయాలి. అయిదు నుంచి ఏడు నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయాలి.

నువ్వుల నూనెను నేరుగా లేదా కొన్ని పదార్థాలతో కలపి వాడటం వలన శిరోజాలకు కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పేను బెడద తగ్గుతుంది

పేను బెడద తగ్గుతుంది

పెను బెడద ఉందంటే స్కాల్ప్ ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం. పేను బాధ పెరిగే ప్రమాదం కూడా ఉంది. నువ్వుల నూనెలో ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీలు కలవు. ఇవి, తల్లో పేలని తొలగిస్తాయి. ఐదు నుంచి ఏడు చుక్కల నువ్వుల నూనెను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఏదైనా వెజిటబుల్ ఆయిల్ ను జోడించండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేయండి. ఆ తరువాత డ్రై షవర్ క్యాప్ ను ధరించండి. రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి ఉదయాన్నే ఏదైనా హెర్బల్ షాంపూతో వాష్ చేయండి.

ఒత్తైన శిరోజాలకై:

ఒత్తైన శిరోజాలకై:

నువ్వుల నూనెను వాడటం వలన శిరోజాలు పొడవుగా, ఒత్తుగా అలాగే అందంగా తయారవుతాయి. హెయిర్ కు డీప్ ట్రీట్మెంట్ ను చేయడానికి ఈ ఆయిల్ ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చుక్కల వెచ్చటి క్యారియర్ ఆయిల్ ను జోడించి స్కాల్ప్ పై మసాజ్ చేయండి. ఆ తరువాత హెయిర్ ను వెచ్చటి టవల్ తో కప్పండి. ముప్పై నిమిషాల వరకు ఈ ఆయిల్ ట్రీట్మెంట్ ను కొనసాగించండి.

ఈ ప్రాసెస్ ను వారానికి రెండు సార్లు పాటిస్తే వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

హెయిర్ లాస్ ను అరికడుతుంది:

హెయిర్ లాస్ ను అరికడుతుంది:

హెయిర్ లాస్ ప్రాబ్లెమ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. నువ్వుల నూనె మరియు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్ హెయిర్ లాస్ ను అరికట్టేందుకు తోడ్పడుతుంది. ఒకటి లేదా రెండు ఎగ్స్ ను తీసుకుని వాటిలో ఎగ్ వైట్ నుంచి ఎగ్ యోల్క్ ను సెపరేట్ చేయండి.

ఎగ్ వైట్ ను తీసుకుని అందులో ఐదు చుక్కల నువ్వుల నూనెను జోడించండి. ఈ మిశ్రమంతో స్కాల్ప్ ను ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయండి. ముప్పై నుంచి నలభై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ను వారానికి రెండు సార్లు పాటించాలి.

హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ :

హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ :

ఈ ట్రీట్మెంట్ కోసం ఆలివ్, జొజోబా, క్యాస్టర్, సెసేమ్, కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ ను ఎంచుకోవాలి. ఒక అర కప్పుడు క్యారియర్ ఆయిల్ కు ఒకటి లేదా రెండు చుక్కల నువ్వుల నూనెను జోడించాలి.

ఈ మిశ్రమాన్ని హీట్ చేయడానికి ఒక పాత్రని వినియోగించాలి. ఒక పాత్రలో ప్లెయిన్ వాటర్ ను తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ పాత్రను స్టవ్ పై వేడి చేయాలి. ఈ ఆయిల్ ను ఒక అప్లికేటర్ బ్రష్ ను లేదా బాటిల్ ను ఉపయోగించి హెయిర్ పై అప్లై చేయాలి. చేతులతో కూడా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్ పై సున్నితంగా మసాజ్ చేయాలి. హెయిర్ మొత్తానికి ఈ మిశ్రమం తగిలేలా మసాజ్ చేయాలి. ఆ తరువాత ఒక ప్లాస్టిక్ షవర్ క్యాప్ ను ధరించి హెయిర్ ను కవర్ చేయండి. హెయిర్ ను కనీసం ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత షాంపూ మరియు కండిషనర్ ను ఉపయోగించి హెయిర్ కు కేర్ ను అందించాలి.

హెయిర్ గ్రోత్ కోసం

హెయిర్ గ్రోత్ కోసం

నువ్వుల నూనె మరియు ఆలివ్ ఆయిల్

లైట్ వెయిట్ తో పాటు హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన ఆలివ్ ఆయిల్ ను అనేక రెమెడీస్ లో ఉపయోగిస్తారు. హెయిర్ టైప్ తో సంబంధం లేకుండా దీని నుండి ప్రయోజనాలను పొందవచ్చు. ఇది హెయిర్ కు సాఫ్ట్ మరియు సిల్కీనెస్ ను అందిస్తుంది. హెయిర్ ను మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది.

నువ్వుల నూనెను అలాగే ఆలివ్ ఆయిల్ ను సమాన మొత్తంలో తీసుకోవాలి. వీటిని హెయిర్ పై అప్లై చేయాలి. గంటపాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో హెయిర్ ను వాష్ చేయాలి.

నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె

నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె

కొబ్బరి నూనె అనేది హెయిర్ లోని ప్రోటీన్ లాస్ ను అరికడుతుంది. తద్వారా, శిరోజాలను ఆరోగ్యంగా అలాగే దృఢంగా ఉంచుతుంది. నువ్వుల నూనెతో వాడినప్పుడు శిరోజాలకు పోషణ అందుతుంది. స్కాల్ప్ ఆరోగ్యం మెరుగవుతుంది. హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది.

కొబ్బరి నూనెను అప్లై చేసిన తరువాత హెయిర్ ను సరిగ్గా వాష్ చేయకపోతే హెయిర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆయిలీ హెయిర్ వారు కొబ్బరి నూనెను అప్లై చేయకూడదు. నార్మల్ నుంచి డ్రై హెయిర్ రేంజ్ కలిగిన వారు దీనిని వాడవచ్చు.

నువ్వుల నూనె మరియు అలోవెరా:

నువ్వుల నూనె మరియు అలోవెరా:

ఈ హెయిర్ మాస్క్ అన్ని రకాల హెయిర్ టైప్స్ కు సూట్ అవుతుంది. ఇది స్కాల్ప్ ను శుభ్రపరచి హెయిర్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ మాస్క్ తయారీకి మీకు నాలుగు లేదా ఐదు చుక్కల నువ్వుల నూనె మరియు అరకప్పు అలోవెరా జెల్ అవసరం.

ఈ పదార్థాలను పాత్రలోకి తీసుకుని మెత్తగా కలుపుకోవాలి. దీనిని హెయిర్ పై అప్లై చేయాలి. హెయిర్ మొదళ్ళ నుంచి కుదుళ్ళ వరకు అప్లై చేయాలి. షాంపూతో రిన్స్ చేయాలి.

English summary

Does Sesame Oil Help In Treating Dandruff?

Sesame oil strengthens your hair and prevents damage from frizz, dandruff, loose ends and split ends. It is an effective cure for dandruff and lice. Sesame oil makes dealing with itchiness, dandruff and dry scalp easy. It treats dry and oily scalps and restores the pH level of your scalp.Does Sesame Oil Help In Treating Dandruff?
Story first published:Wednesday, May 23, 2018, 15:27 [IST]
Desktop Bottom Promotion