For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు ఊడిపోవడానికి హార్డ్-వాటర్ కారణమా ?

మీ జుట్టు ఊడిపోవడానికి హార్డ్-వాటర్ కారణమా ?

|

మీరు సరైన డైట్ను పాటించకపోవటం, రసాయనాలతో నిండిన షాంపులను ఉపయోగించడం, పర్యావరణ కాలుష్యం, తగినంత నిద్ర లేకపోవటం వంటి మొదలైన కారణాలతో మీరు మీ జుట్టును నష్టపోతున్నారు. అయితే, మీరు మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీరు సరైన నాణ్యతను కలిగి ఉందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ?

అలా మీరు ఆలోచించకపోతే, మీరు ఈ సమయం నుంచే దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ జుట్టు ఊడిపోవడానికి ఈ హార్డ్ వాటర్ ప్రధాన కారణంగా ఉంది. మీరు హార్డ్ వాటర్ సరఫరా చేయబడే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే ఆ నీరు కాపర్, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలను అధిక నిష్పత్తిలో కలిగి ఉంటాయి. ఈ నీటినే మీ జుట్టును శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించినప్పుడు అందులో ఉన్న ఖనిజాలు మీ జుట్టుకి హాని కలిగించి, మీ జుట్టు పతనానికి దారితీయవచ్చు.

ఈ హార్డ్ వాటర్ మీ జుట్టు పతనానికి ఏవిధంగా కారణమవుతుంది ?

ఈ హార్డ్ వాటర్ మీ జుట్టు పతనానికి ఏవిధంగా కారణమవుతుంది ?

అందుకు గల శాస్త్రీయ కారణం ఏమిటంటే, ఈ నీటిలో ఖనిజాలు ధనాత్మక ఆవేశమును కలిగి ఉంటాయి. అయితే మన జుట్టు దానికి వ్యతిరేకమైన రుణాత్మక ఆవేశమును కలిగి ఉంటుంది. కాబట్టి మీరు మీ జుట్టును శుభ్రపరుచుకోవడానికి ఈ హార్డ్ వాటర్ను ఉపయోగించినప్పుడు అవి జుట్టు తంతువులకు కొంత దీర్ఘకాలంపాటు ధనాత్మక ఆవేశమును కలిగించడంవల్ల మీ జుట్టు మూలాలను & కుదుళ్లను మరింతగా బలహీనపరుస్తుంది. దీనివల్ల హైయిర్ ఆయిల్ & హైయిర్ కండిషనర్ వంటివి మీ జుట్టుకు అప్లై చేసినప్పుడు అవి మీ జుట్టును పూర్తిగా చేరుకోవడానికి మరింత కష్టతరం అవుతుంది.

అయితే ఒక్కసారిగా మీరు హార్డ్ వాటర్ను ఉపయోగించడం మానేసి మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెడితే, పరిస్థితి తలక్రిందులుగా మారుతుంది.

హార్డ్ వాటర్ మీ జుట్టును ఈ క్రింది విధాలుగా నష్టపరుస్తుంది :-

హార్డ్ వాటర్ మీ జుట్టును ఈ క్రింది విధాలుగా నష్టపరుస్తుంది :-

* అకాలంగా మీ జుట్టు రంగు నెరసిపోవటం

* జుట్టు సన్నబడటం

* జుట్టు ఊడిపోవడం

* జుట్టు చివర పగుళ్లు

* మీరు కండిషన్ను ఉపయోగించేటప్పుడు మీ జుట్టు మరింత నిస్సారంగా, పొడిగా ఉండటం

* మీ జుట్టు చుండ్రుకు, ఎగ్జిమాకు దారితీయడం

* మీ చుట్టూ తంతువులను బలహీనం చేసి, విచ్ఛిన్నం చేయడం

ఈ హార్డ్ వాటర్ వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని నివారించడం ఎలా ?

ఈ హార్డ్ వాటర్ వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని నివారించడం ఎలా ?

మీరు మొదటిగా మీ జుట్టును శుభ్రం చేయడం కోసం వాడే నీటి కాఠిన్యతను గూర్చి తెలుసుకోవాలి. అందుకోసం ఒక కప్పు నీటిని సేకరించి అందులో సబ్బును ఉంచినట్లయితే, ఆ నీరు నురగలు నురగలుగా ఏర్పడినప్పుడు, అది మంచి నీరుగా భావించవచ్చు, అలాకాకపోతే ఆ నీటిని మీరు స్నానం చేయడానికి ఉపయోగించకూడదు.

ఒకవేళ మీకు అలాంటి అవకాశం గాని లేకపోతే, మీరు ఉపయోగించే ఈ హార్డ్ వాటర్తో ఈ క్రింద తెలిపిన కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు.

1. నీటి మృదుత్వము :

1. నీటి మృదుత్వము :

అందుకోసం మీరు వాటర్స్ సాఫ్టర్ మెషిన్ను ఉపయోగించండి. ఇది మార్కెట్లో చాలా సులభంగా లభిస్తుంది. దీన్ని వాడటం వల్ల నీటి కాఠిన్యతను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. కొద్ది మోతాదులో పటికను జోడించండి :

2. కొద్ది మోతాదులో పటికను జోడించండి :

మీరు ఉపయోగించే నీరు కాఠిన్యతను కలిగివున్నట్లయితే, కిరణా షాపుల్లో సులభంగా లభించే పటికను నీటిలోకి కొద్ది మోతాదులో కలపండి. ఈ పటిక నీటిలో గల ముఖ్యమైన ఖనిజాలను ఆ నీటి అడుగు భాగానికి చేరేలా చేయటంలో సహాయపడుతుంది. తద్వారా నీటి ఆక్సీకరణను నివారించి, మీ జుట్టుకు నష్టపరిచే సమస్యను దూరం చేస్తుంది.

3. నిమ్మరసం (లేదా) వైట్ వెనిగర్ :

3. నిమ్మరసం (లేదా) వైట్ వెనిగర్ :

మీ జుట్టును శుభ్రం చేసేందుకు ఉపయోగించే వెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టేబుల్స్పూన్ల నిమ్మరసం (లేదా) వైట్ వెనిగర్ను కలపాలి. దీనివల్ల షాంపూ మీ జుట్టును చాలా సులభంగా శుభ్రపరుస్తుంది.

4. ఆలివ్ & అర్గన్ ఆయిల్ను ఉపయోగించండి :

4. ఆలివ్ & అర్గన్ ఆయిల్ను ఉపయోగించండి :

నీటి కాఠిన్యత ద్వారా మీ చుట్టూ నష్టపోకుండా రక్షించడానికి హెయిర్ కండిషనర్ను తప్పక ఉపయోగించాలి. ఆలివ్ & అర్గన్ ఆయిల్స్ అనేవి మీ జుట్టుకు లోతైన కండీషనర్లాగా చాలా బాగా ఉపయోగపడతాయి. తలస్నానానికి ముందు, మీ జుట్టు పై పడే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ రెండు నూనెలను ఉపయోగించండి. ఇది మీ జుట్టుకు రక్షణాత్మక పొరను ఏర్పరచి, నీటిలో ఉండే ఖనిజ మూలకాల వ్యాప్తిని తగ్గిస్తుంది.

5. ఆపిల్ సైడర్ వెనిగర్తో మీ జుట్టును శుభ్రపరుచుకోండి :

5. ఆపిల్ సైడర్ వెనిగర్తో మీ జుట్టును శుభ్రపరుచుకోండి :

ఆపిల్ సైడర్ వెనిగర్ మీ జుట్టును నష్టపరిచే ఖనిజాలను తీసివేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇది మీ జుట్టు సహజమైన pH సమతుల్య సామర్థ్యాన్ని కాపాడుతూ, మీ జుట్టును మెరిసేలా -ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఈ రకమైన ఫలితాలను పొందడానికి మీరు ఉపయోగించే నీటిలో కొద్ది మొత్తంలో ఆపిల్ సైడర్ వెనిగర్ను కలపాలి (లేదా) మీ మాడుపై నేరుగా ఈ సమ్మేళనాన్ని స్ప్రే గా ఉపయోగించవచ్చు. ఇలా స్ప్రే గా ఉపయోగించిన తర్వాత మీ జుట్టు మాడును నమ్మదుగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల పాటు అలా వదిలి వేసిన తరువాత చల్లని నీటితో మీ జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

6. బేకింగ్ సోడాను ఉపయోగించండి :

6. బేకింగ్ సోడాను ఉపయోగించండి :

బేకింగ్ సోడా, మీ జుట్టు (లేదా) మాడుపై ఏర్పడిన అనిశ్చియమైన నిర్మాణాలను నిర్మూలించడంలో సహాయపడుతుంది. ఇది సహజసిద్ధమైన క్లారిఫై ఏజెంట్గా పనిచేస్తుంది. ఒకవేళ మీరు హార్డ్ వాటర్ సరఫరా చేయబడే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 15 రోజులకు ఒకసారి బేకింగ్ సోడాను కలిపిన నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోవడం మంచిది. అందుకోసం మీరు నీటితో కలిపిన బేకింగ్ సోడా వేసి జుట్టుకి అప్లై చేసి, రుద్దుతూ ఉండాలి. 3 - 5 నిమిషాలపాటు మీ జుట్టును అలాగే వదిలి వేసిన తరువాత, చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరచుకోవాలి.

7. గుడ్డును ఉపయోగించడం :

7. గుడ్డును ఉపయోగించడం :

గుడ్డులో ప్రొటీన్లు, పొటాషియం, విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు పతనాన్ని నిరోధించి, మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీరు ఒక గుడ్డును తీసుకుని దానికి నిమ్మరసంను జోడించి బాగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని, దానిని మీ జుట్టుకు హెయిర్ ప్యాక్లా అప్లై చేయండి. అప్లై చేసిన 15 నిముషాల వరకు దాన్ని అలాగే వదిలివేస్తే ఆ తర్వాత చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరచుకోవాలి. ఇది మీ జుట్టును మరింత దృఢంగా చేసి, హెయిర్ ఫాల్ నుంచి కాపాడుతుంది. అలాగే మీ జుట్టుని మరింత కాంతివంతంగా తయారు చేస్తుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం రెండు వారాలకు ఒకసారి ఈ ప్యాక్ను ఉపయోగించండి.

గమనిక

గమనిక

1. నిమ్మరసం & వెనిగర్ అనే ఈ రెండు పదార్థాలను తరచుగా ఉపయోగించరాదు. ఎందుకంటే ఇవి మీ జుట్టు పొడిగా ఉండేలా ప్రేరేపిస్తాయి కాబట్టి, 15రోజులకు ఒకసారి మాత్రమే వీటిని వాడండి.

2. జుట్టును కడగడానికి వీలైనంతవరకు ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించండి.

English summary

Does Using Hard Water Cause Hair Fall?

We generally associate hair loss with a lot of factors such as poor diet, harsh chemicals in shampoos, environmental pollution, insufficient sleep, etc. But, have you ever given a serious thought about the quality of water you use to wash your hair? If not, it is time you take that into consideration too, as hard water is a major reason for hair loss. If you live in an area that supplies hard water, minerals such as copper, calcium, manganese and iron are present in a high ratio in hard water. When you use that water for washing your hair, the minerals can damage your hair, leading to hair fall.
Story first published:Monday, June 18, 2018, 9:27 [IST]
Desktop Bottom Promotion