For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రిజ్జీ మరియు డల్ హెయిర్ ను ట్రీట్ చేసేందుకు ఎగ్ మాస్క్స్

ఫ్రిజ్జీ మరియు డల్ హెయిర్ ను ట్రీట్ చేసేందుకు ఎగ్ మాస్క్స్

|

సిల్కీ స్మూత్ లాంగ్ హెయిర్ ను కోరుకొని వారెవరైనా ఉంటారా? అనేక ఫ్యాక్టర్స్ వలన శిరోజాల అందం పాడవుతోంది. లైఫ్ స్టైల్, పొల్యూషన్ వంటి కొన్ని కారణాలు శిరోజాల అందంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. హెయిర్ అనేది డల్ గా, ఫ్రిజ్జీగా అలాగే డేమేజ్డ్ గా మారుతోంది. పోషకాల లోపం వలన కూడా హెయిర్ దెబ్బతింటోంది. హెయిర్ గ్రోత్ అనేది అరికట్టబడుతోంది.

ఎగ్స్ నుంచి లభించే ప్రోటీన్స్ అనేవి ఈ సమస్యకు నేచురల్ రెమెడీగా తోడ్పడతాయి. ఎగ్స్ లో ఎసెన్షియల్ ప్రోటీన్స్ లభిస్తాయి. ఇవి వెంట్రుకలను దృఢపరచి హెయిర్ గ్రోత్ ను పెంపొందిస్తాయి. అలాగే, ఎగ్స్ లో సహజసిద్ధమైన నేచురల్ ఆయిల్స్ లభిస్తాయి. ఇవి, హెయిర్ కు అత్యంత పోషణను అందించి హెయిర్ యొక్క స్మూత్ టెక్స్చర్ ను మెయింటైన్ చేయడానికి తోడ్పడతాయి.

ఈ మ్యాజికల్ ఇంగ్రిడియెంట్ ను ఉపయోగించి ఇంట్లోనే సంపూర్ణ హెయిర్ కేర్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ను చేసుకోవచ్చు. సెలూన్ లో లభించే ట్రీట్మెంట్ కంటే ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. ఫ్రిజ్జీ హెయిర్ ను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఎగ్ మాస్క్స్ గురించి ఈ ఆర్టికల్ లో వివరించాము. వీటి గురించి తెలుసుకుని మీ శిరోజాలకు మరింత శ్రద్ధను అందించండి మరి!

Egg Masks To Treat Frizzy And Dull Hair

ఎగ్ మరియు హనీ మాస్క్:

తేనెలో వెంట్రుకలను దృఢపరిచే సామర్థ్యం కలదు. ఇది హెయిర్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. ఈ రెమెడీని వారానికి ఒకసారి ప్రయత్నించడం మంచిది. అలా కొన్ని వారాల పాటు ఈ రెమెడీని పాటిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది.

కావలసిన పదార్థాలు:

ఒక ఎగ్

రెండు టేబుల్ స్పూన్ల తేనె

ఎలా చేయాలి:

ఒక పాత్రలో ఒక ఎగ్ యోల్క్ ను అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనెను తీసుకోవాలి. వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ పై మాస్క్ లా అప్లై చేసుకోవాలి. షవర్ క్యాప్ తో కవర్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో హెయిర్ ను శుభ్రపరచుకోవాలి.

Egg Masks To Treat Frizzy And Dull Hair

యోగర్ట్ మరియు ఎగ్ మాస్క్:

కావలసిన పదార్థాలు

1 ఎగ్

1/4th కప్పుడు యోగర్ట్

ఎలా చేయాలి:

పావు కప్పుడు ప్లెయిన్ యోగర్ట్ లో ఒక ఎగ్ ను కలపాలి. వీటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. మొదటగా షాంపూ చేసుకోవాలి. ఆ తరువాత ఈ మాస్క్ ను అప్లై చేసుకోవాలి. అయిదు నిమిషాల తరువాత రిన్స్ చేసుకోవాలి. రెగ్యులర్ షాంపూ చేసుకున్న ప్రతీ సారి ఈ పద్దతిని పాటించవచ్చు.

ఎగ్ మరియు కొబ్బరి నూనె మాస్క్:

కావలసిన పదార్థాలు:

ఒక ఎగ్

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

ఎలా చేయాలి:

ఒక పాత్రలో ఒక ఎగ్ యోల్క్ ను తీసుకుని బాగా విస్క్ చేయాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను జోడించాలి. ఈ రెండిటినీ బాగా కలపాలి. ఇప్పుడు, ఒక వేళ మీరు కావాలనుకుంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కూడా జోడించాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేసుకోవాలి. హెయిర్ ను అలాగే స్కాల్ప్ ను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలపాటు హెయిర్ పై ఉంచాలి. ఆ తరువాత రిన్స్ చేయాలి. హెయిర్ అనేది మరీ ఆయిలీగా ఉందంటే షాంపూ చేసుకోవాలి. లేదంటే షాంపూ అవసరం లేదు.

Egg Masks To Treat Frizzy And Dull Hair

వినేగార్ మరియు ఎగ్ మాస్క్స్:

కావలసిన పదార్థాలు:

2 ఎగ్ యోల్క్స్

4 టేబుల్ స్పూన్ల వినేగార్

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్


ఎలా చేయాలి:

రెండు ఎగ్ యోల్క్స్ ను ఒక పాత్రలోకి తీసుకుని విస్క్ చేయండి. అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వినేగార్, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను జోడించండి. ఈ పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసేముందు హెయిర్ ను సెక్షన్స్ గా విడదీయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటిస్తే మృదువైన సిల్కీ స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.


ఎగ్ యోల్క్ మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్:

ఎగ్ మరియు ఆలివ్ ఆయిల్ అనేవి హెయిర్ ను హైడ్రేట్ చేయడానికి తోడ్పడతాయి. తద్వారా, స్మూత్ మరియు మేనేజబుల్ హెయిర్ మీ సొంతమవుతుంది.


కావలసిన పదార్థాలు:

2 ఎగ్ యోల్క్స్

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్


ఎలా చేయాలి:

రెండు ఎగ్ యోల్క్స్ ను ఒక పాత్రలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను జోడించండి. బాగా కలపండి. అవసరమైతే కొంత నీటిని కూడా కలపండి. అప్పుడు, మిశ్రమాన్ని సులభంగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ను సెక్షన్స్ గా డివైడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో అప్లై చేసుకోండి. గంట లేదా రెండు గంటల తరువాత ఈ మిశ్రమాన్ని చల్లటి నీటితో తొలగించండి. తేలికపాటి షాంపూను వాడవచ్చు. ఈ మాస్క్ ను వారానికి ఒకసారి వాడండి.

మయోన్నైజ్ మరియు ఎగ్ మాస్క్:

మయోన్నైజ్ లో హెయిర్ ను కండిషన్ చేసే ఏజెంట్స్ కలవు.

కావలసిన పదార్థాలు:

2 ఎగ్స్

4 టేబుల్ స్పూన్ల మయోన్నైజ్


ఎలా చేయాలి:

రెండు హోల్ ఎగ్స్ ను తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మయోన్నైజ్ ను జోడించండి. స్మూత్ మిక్శ్చర్ ఫార్మ్ అయ్యే వరకు బాగా కలపండి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను జోడిస్తే ఫైన్ మిక్శ్చర్ ఏర్పడుతుంది. ముప్పై నిమిషాల తరువాత చల్లటి నీటితో అలాగే సల్ఫేట్ ఫ్రీ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి. ఈ మాస్క్ ని వారానికి ఒకసారి వాడవచ్చు.

English summary

Egg Masks To Treat Frizzy And Dull Hair

Who wouldn't love to have those silky smooth long tresses? But several reasons like lifestyle, pollution, etc., have made our hair look frizzy, dull and damaged. Lack of protein leads to damaged hair and it will stop the hair from growing.
Desktop Bottom Promotion