Just In
- 2 hrs ago
మెరిసే మరియు బలమైన జుట్టు పొందడానికి ఈ ఫ్రూటీ హెయిర్ మాస్క్‌లను ఉపయోగించండి!
- 2 hrs ago
Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!
- 4 hrs ago
పేగు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయాన్నే ‘ఈ’ డ్రింక్స్ తాగాలి..!
- 6 hrs ago
World Aids Vaccine Day 2022 :హెచ్ఐవిని కంట్రోల్ చేయలేమా? వ్యాక్సిన్లు పని చేస్తున్నాయా?
Don't Miss
- Finance
HDFC Bank: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు: లెక్క చూసుకోండి మరి
- Technology
Realme Narzo 50 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- News
షీనా బోరా హత్య కేసు-తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు ఆరున్నరేళ్ల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: తులసిని చూసి షాకైన లాస్య.. ఆస్తి గొడవలతో నందూకు కొత్త కష్టం
- Sports
అందుకే ఓడాం: రోహిత్ శర్మ
- Automobiles
భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జుట్టు సంరక్షణకి కరివేపాకులతో ఐదు ఇంటి చిట్కాలు
ఆడవారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, ఏ సమస్యలేని అందమైన జుట్టు కోరుకుంటారు. ఆడవారి అందాలలో జాలువారే జుట్టు ముఖ్యమైనది. పొడవైన, పట్టులాంటి మృదువైన, చిక్కులేని, ఏ సమస్యా లేని వెంట్రుకలు అందాన్ని మరింత పెంచడమే కాదు, ఆడవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఈ
కాలంలో
జీవనశైలిలో
వచ్చిన
చాలా
మార్పుల
వలన
జుట్టు
కూడా
ప్రభావితమై,
ఊడిపోవటం,
సమయానికి
ముందే
నెరసిపోవడం,చుండ్రు
వంటి
సమస్యలు
వస్తాయి.
ఇవి
కాలుష్యం,
సరిగా
ఆహారం
తినకపోవటం
లేదా
డైట్,
విటమిన్ల
లోపం
వలన
జరగవచ్చు.
కానీ
ఈ
సమస్యలని
సహజంగా
పరిష్కరించుకోవచ్చు.
చాలామటుకు
జుట్టు
సమస్యలను
తగ్గించే
పదార్థాలలో
ఒకటి
కరివేపాకు
మేటిది.
వంటల్లో సాధారణంగా వాడే కరివేపాకుకి ఉండే ఆరోగ్యవిలువలు శతాబ్దాల నుంచి తెలిసినవే. కరివేపాకుని జుట్టు, చర్మ రక్షణకి వాడతారు. దీనిలో జుట్టు పెరగటానికి, జుట్టు సమస్యల నుంచి రక్షణకి తగినన్ని పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇంకా, కరివేపాకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అమినోయాసిడ్లు జుట్టు ఊడిపోవటాన్ని చాలామటుకు తగ్గిస్తాయి.
జుట్టు సంరక్షణకి సంబంధించి కరివేపాకు వలన వచ్చే సానుకూల ప్రభావాలేంటో కొన్ని చూద్దాం.

1.జుట్టు పెరిగేలా చేస్తుంది
కరివేపాకుల్లో సహజంగా వెంట్రుకలను పెంచే పోషకాలు ఉంటాయి కాబట్టి దీన్ని వాడితే మీ జుట్టు తప్పక పెరుగుతుంది.
మీకు కావాల్సిందల్లా కొన్ని కరివేపాకులు, పెరుగు. కొన్ని కరివేపాకులను తీసుకుని పెరుగుతో పేస్టులా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి కుదుళ్లనుంచి పట్టించండి. వేగంగా మార్పును చూడాలనుకుంటే, వారానికి రెండుసార్లు ఇలా చేయండి.

2. జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది
కరివేపాకులలోని గుణం జుట్టు సన్నబడటాన్ని నివారించి, అలా జుట్టు ఊడటాన్ని కూడా తగ్గిస్తుంది. కొన్ని కరివేపాకులను పాలతో కలిపి పేస్టు తయారుచేయండి. ఈ పేస్టును మీ జుట్టుకి పట్టించి గంట లేదా రెండు గంటలపాటు అలా వదిలేయండి. తర్వాత కడిగేయండి. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే జుట్టు ఊడటం చాలామటుకు తగ్గిపోతుంది.

3.సమయానికి ముందే నెరవటాన్ని తగ్గిస్తుంది
వైద్యపరంగా, జుట్టు సమయానికి ముందే నెరవడానికి చాలా కారణాలుంటాయి. రసాయనాలను జుట్టుపై ఎక్కువ వాడటం కావచ్చు, మానసిక వత్తిడి కావచ్చు ఇంకా వంశపారపర్యంగా కూడా కలగచ్చు. చిన్న వయస్సులోనే జుట్టు నెరవడం నుంచి కరివేపాకులు మిమ్మల్ని రక్షించగలవు. కొంచెం వర్జిన్ ఆలివ్ నూనెను వేడిచేసి అందులో కరివేపాకు వేయండి. నూనె ఆకుపచ్చ రంగులోకి మారాక, మీ జుట్టు కుదుళ్ళకి పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

4.రసాయనాలు వాడిన జుట్టు కోసం
రసాయనాలను వాడాక జుట్టుకి బలం తగ్గిపోతుంది. జుట్టు నిపుణులు తరచూ ఇదే చెప్తుంటారు ,రసాయనాలు వాడాక జుట్టుకి సరైన సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో , కరివేపాకు మీ జుట్టును ఇక్కడ ఇలా కాపాడగలదు. కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయండి. కరివేపాకులు మొత్తం నాననివ్వండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి కుదుళ్లకి పట్టించి, షాంపూతో తర్వాత తలంటుకోండి.

5.మీ ఆహారంలో భాగం చేసుకోండి
ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కేవలం బయటనుంచి శ్రద్ధ తీసుకుంటేనే రాదు. మీ శరీరానికి కూడా బయట నుంచి ఎంత సంరక్షణ అవసరమో లోపలినుంచి కూడా అంతే సంరక్షణ అవసరం. కరివేపాకుని పొడి రూపంలోనే, లేదా పచ్చిగానే మీ ఆహారంలో జతచేయండి. కరివేపాకుని నీళ్ళలో మరిగించి తీసుకుంటే మీ జుట్టుకి రక్షణనివ్వటమేకాక ఇతర ఆరోగ్య లాభాలను కూడా ఇస్తుంది. దీన్ని పుదీనా ఆకులతో కలిపి పచ్చిగానే తినేయవచ్చు.