For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ మరియు కేశ సంరక్షణ కొరకు కరివేపాకుతో గృహవైద్యం

చర్మ మరియు కేశ సంరక్షణ కొరకు కరివేపాకుతో గృహవైద్యం

|

ప్రతి స్త్రీ అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కలలు కంటుంది. పొడవైన,దట్టమైన, నల్లని, చిక్కులులేని పట్టుకుచ్చు లాంటి జుట్టు మరియు కాంతివంతంగా మెరిసే చర్మం మహిళల్లో అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

ఆధునిక జీవనశైలి జుట్టు రాలడం, చిన్నవయసులోనే జుట్టు నెరవడం, కాంతివిహీనమైన చర్మం వంటి అంతులేని సౌందర్య సమస్యలకు దారితీస్తుంది. కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ లోపాలు మొదలైన వాటి వలన ఇలా జరుగుతుంది.

సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించి ఈ సమస్యలను పరిష్కరించుకోవడం సర్వోత్తమం.అనేక రకాలైన శిరోజ మరియు చర్మ సమస్యల నివారణకు కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో దశాబ్దాలుగా కరివేపాకును ఆహార పదార్థాలను తయారిలో విరివిగా వాడుతున్నారు. చర్మ మరియు కేశ సంరక్షణ కొరకు ఇది బాగా పనిచేస్తుంది. దీనిలో జుట్టు ఎదుగుదలకు, చర్మ సంరక్షణకు అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు తగినంతగా ఉంటాయి. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని చాలా వరకు అరికడతాయి.

కనుక మనము అందాన్ని కాపాడుకునేందుకు కరివేపాకును ఏ విధంగా వాడవచ్చో తెలుసుకుందాం!

చర్మం కొరకు:

చర్మం కొరకు:

1. మెరిసే చర్మం కొరకు:

కరివేపాకును బ్లెండర్ లో వేసి మెత్తని పేస్టుగా చేయండి. దీనిలో చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. మొటిమల సమస్య బాగా ఉన్న చర్మం పై దీనిని ఒక రెండు రోజుల పాటు పూయండి. మెరిసే నునుపైన చర్మాన్ని సొంతం చేసుకోండి.

2. ముడుతలు లేని చర్మం కొరకు:

2. ముడుతలు లేని చర్మం కొరకు:

కొంత కరివేపాకు పొడిని తీసుకుని ముల్తానా మట్టిలో కలపండి. దీనికి కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలిపి పేస్టుగా చేయండి. దీనిని ముఖానికి, మెడకు పట్టించి బాగా ఆరాక కడిగేయండి. కరివేపాకు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది. ముల్తానా మట్టి అధికంగా ఉన్న జిడ్డు తొలగిస్తుంది.

3. మొటిమల యొక్క మచ్చలను తగ్గిస్తుంది:

3. మొటిమల యొక్క మచ్చలను తగ్గిస్తుంది:

మొటిమలు మిగిల్చిన మచ్చలు చాలా మొండిగా ఉండి ఒక పట్టాన సులువుగా వదలవు. వీటిని మీరు కరివేపాకుతో తగ్గించుకోవచ్చు. కరివేపాకులను ముద్దగా చేసి దానికి కొంత నిమ్మరసం కలిపి మచ్చలున్న చోట రాసుకోండి. పది పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. నిమ్మరసం సహజ యాస్ట్రిజంట్ గా పనిచేసి, కరివేపాకుతో కలిపి క్రమం తప్పకుండా వాడినప్పుడు, సమయం గడిచే కొద్దీ మంచి ఫలితమిస్తుంది.

జుట్టు కొరకు:

జుట్టు కొరకు:

కరివేపాకులో సహజంగా శిరోజాల ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు ఉన్నందున, దీనిని విరివిగా వాడితే మీ జుట్టు తప్పక పెరుగుతుంది.

మీకు కావలసినవల్లా కొన్ని కరివేపాకులు మరియు కొంత పెరుగు. కొన్ని కరివేపాకులలో పెరుగు కలిపి మెత్తని పేస్టుగా నూరండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టేటట్లు జుట్టుకు రాసుకోండి. ఫలితాలు త్వరగా రావాలంటే ఇలా వారానికి రెండు సార్లు చేయండి.

2. జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

2. జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

కరివేపాకుకు జుట్టు పలచబడటాన్ని తగ్గించి తద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టే గుణం ఉంది. కొన్ని కరివేపాకులను పాలతో కలిపి మెత్తని పేస్టుగా చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి గంట లేదా రెండు గంటల పాటు ఆరనివ్వండి.బాగా ఆరాక కడిగేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

3. చిన్నవయసులోనే జుట్టు నెరవడాన్ని అరికడుతుంది:

3. చిన్నవయసులోనే జుట్టు నెరవడాన్ని అరికడుతుంది:

వైద్యపరంగా జుట్టు నెరవడాన్ని అనేక కారణాలు ఉన్నాయి. ఇది అధికంగా రసాయనాలు వాడటం, ఒత్తిడికి లోనవ్వటం లేదా వారసత్వం వలన జరగవచ్చు. ఇటువంటి సమయంలో కరివేపాకు మీకు అక్కరకు వస్తుంది. వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి దానిలో కొన్ని కరివేపాకు ఆకులను వేయండి. అవి ఆకుపచ్చని రంగులోకి మారిన తరువాత మాడుకు బాగా పట్టించి 30 నిమిషాల తరువాత కడిగేయండి.

4. రసాయనాలతో చికిత్స చేసిన జుట్టు కొరకు:

4. రసాయనాలతో చికిత్స చేసిన జుట్టు కొరకు:

రసాయనాలతో చర్య చెందించినపుడు, జుట్టు పటుత్వాన్ని కోల్పోతుంది. కేశ నిపుణులు శిరోజాలకు రసాయన చికిత్స తీసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. ఇటువంటి సమయంలో మీరు కరివేపాకును ఉపయోగించవచ్చు. కొబ్బరినూనెను బాగా వేడిచేసి దానిలో కొన్ని కరివేపాకు ఆకులను వేయండి. కొంతసేపు వాటిని బాగా నాననివ్వండి. దీనిని మాడుకు బాగా పట్టించి షాంపూతో కడిగేయండి.

5. మీ ఆహారంలో భాగంగా మార్చుకోండి:

5. మీ ఆహారంలో భాగంగా మార్చుకోండి:

ఆరోగ్యకరమైన, దట్టమైన జుట్టు కోసం సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరమే! మీ శరీరానికి ఎలా అయితే బాహ్య పోషణ, అంతః పోషణ అవసరమవుతాయో, అదేవిధంగా జుట్టుకు కూడా అవసరమే! కరివేపాకును అదే విధంగా లేదా పొడి రూపంలో ఆహారంతో తీసుకుంటే చాలా సహాయ పడుతుంది. కరివేపాకు వేసి మరిగించిన నీళ్లను తాగడం వలన జుట్టును కాపాడటమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. పుదీనా ఆకులతో కలిపి పచ్చిగా కూడా తినవచ్చు.

English summary

Five Home Remedies Using Curry Leaves For Hair Care

Curry leaves have the required nutrients and vitamins in order to stimulate hair growth and protect our skin and hair from beauty-related issues. Moreover, curry leaves contain antioxidants and amino acids that help reduce hair fall. It also helps reduce premature greying and protects the natural colour of the hair.
Story first published:Thursday, March 29, 2018, 18:05 [IST]
Desktop Bottom Promotion