For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పొడిబారి పోయిన జుట్టు సంరక్షణకి చిట్కాలు

|

మళ్ళీ ఏడాదిలో ఆ సమయం వచ్చేసింది, చలికాలానికి స్వాగతం!! చలికాలం ఆహ్లాదకరంగా ఉన్నా సమస్యలు వచ్చే సమయం కూడా అదే. ఏడాది మొత్తంలో ఈ సమయంలోనే మీ చర్మం పొడిగా మారుతుంది, జుట్టు ఎండిపోతుంది , అందుకనే సంరక్షణ తప్పనిసరి అయిపోతుంది. చాలామంది చలికాలం అంటే భయపడతారు. మీరు కూడా శీతాకాలపు చల్లగాలులని ఎంజాయ్ చేస్తారు కానీ అది మీ జుట్టును పాడుచేస్తుందనే నిజాన్ని జీర్ణించుకోలేరు.

అయితే రండిక డిసెంబర్ వచ్చేసింది, మీ ఖరీదైన వార్డ్ రోబ్ లోంచి అన్ని ఊలుదుస్తులను మరియు మందపాటి స్కార్ఫ్ లను బయటకి తీసే సమయం వచ్చేసింది. ఇవన్నీ నిజమే అయినప్పుడు, చలికాలం మీ జుట్టును పొడిబారుస్తుండవచ్చు కూడా. చలికాలంలో ఉష్ణోగ్రతలు మారుతూ ఉండటం సహజమే , అందుకే మీ జుట్టు ప్రతిసారీ ఎండిపోయినట్టు అవుతుంది. రుతువులు ఎలా వేరువేరుగా ఉంటాయో, వాటి వలన ప్రభావాలు కూడా వేరుగానే ఉంటాయి. ప్రతి రుతువు మీ చర్మం మరియు జుట్టుపై చాలా ప్రభావం చూపిస్తుంది. చలికాలం కూడా మీ జుట్టు మరియు కుదుళ్ళ దగ్గర తేమ అంతా పోయి పొడిబారిపోతుంది. ఇలా జుట్టు మరియు కుదుళ్ళ వద్ద తక్కువగా తేమ ఉండటం వలన మీ జుట్టుకు అనేక సమస్యలు వస్తాయి. చలికాలంలో జుట్టును సంరక్షించుకోటానికి కొన్ని చిట్కాలు ఇవిగో.

ఎక్కువ శ్రమలేకుండా మెరిసే కాంతివంతమైన జుట్టును పొందటానికి ఇంకా చదవండి.

నూనెలతో సంరక్షించుకోండి

నూనెలతో సంరక్షించుకోండి

ఎండిపోయిన జుట్టు సంరక్షణకి సుగంధ ద్రవ్యనూనెలు ప్రాథమిక పదార్థాలు. చలికాలం మీ తల చర్మాన్ని, జుట్టును ఎండిపోయినట్లు చేయవచ్చు, కానీ కొన్ని ముఖ్య నూనెలైన కొబ్బరి లేదా బాదం నూనె రాసుకుని రాత్రంతా వదిలేస్తే చాలా మంచిది. ఇది మీ జుట్టుకి కావాల్సిన తేమను అందిస్తుంది.

ట్రిమ్ గా కత్తిరించుకోండి

ట్రిమ్ గా కత్తిరించుకోండి

చలికాలం వలన వెంట్రుకల చివర తెగిపోవచ్చు. చలికాలంలో మేటి జుట్టు సంరక్షణకి అవసరమైనది కొద్దిగా మీ జుట్టును ట్రిమ్ చేసుకోవడం. ఇది మీ జుట్టును మంచిగా మరియు ఆరోగ్యంగా కన్పడేలా చేస్తుంది. ఇది మరింత స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా నివారిస్తుంది.

వద్దని చెప్పండి

వద్దని చెప్పండి

రంగు వేసుకోడానికి, ఐరనింగ్ కి, స్ట్రీకింగ్ వంటి వాటన్నిటికీ వద్దు అని చెప్పడం కూడా చలికాలంలో ఎండిపోయిన జుట్టుకి సంరక్షణలో భాగమే. ఇవన్నీ చేయటం వలన మీ అందమైన జుట్టుకి పాడవటానికి రిస్క్ పెరుగుతుంది. అందుకని దూరంగా ఉండండి! చలికాలంలో జుట్టును సంరక్షించుకోవడం ముఖ్యం, అందుకని జాగ్రత్త.

మీ కిరీటం ధరించండి

మీ కిరీటం ధరించండి

చలికాలంలో మీ జుట్టును మూసివుంచడం తప్పనిసరి. మీ జుట్టును రక్షించడానికి స్కార్ఫ్ లు, ఊలుదుస్తులను ధరించండి. కానీ మీ స్కార్ఫ్ కూడా తలలో రక్తప్రసరణకి అడ్డుకాకుండా వేసుకోవడం నేర్చుకోండి. ఇదే చలికాలంలో మంచి ఎండిపోయిన జుట్టు సంరక్షణలో ముఖ్యభాగం.

షాంపూకి దూరంగా ఉండండి

షాంపూకి దూరంగా ఉండండి

మీకు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేసే అలవాటు ఉంటే, చలికాలంలో దానికి దూరంగా ఉండండి. మీ జుట్టుకి షాంపూ చేయటం వలన అది చలికాలంలో మరింత ఎండిపోతుంది. చలికాలంలో అప్పుడప్పుడూ షాంపూ చేయటమే జుట్టు సంరక్షణకి మంచిది.

కండీషనింగ్ – మంచి పద్ధతి

కండీషనింగ్ – మంచి పద్ధతి

చలికాలంలో ఎండిపోయిన జుట్టు సంరక్షణలో మంచి భాగం కండీషనింగ్. ఇదే చలికాలంలో మిమ్మల్ని రక్షించే డాలు. ప్రతిసారి తలస్నాం చేసినప్పుడల్లా జుట్టును కండీషన్ చేయటం మర్చిపోవద్దు. సహజమైన కండీషనర్ కోసం వెతుకుతుంటే కొబ్బరిపాలు ఆ పనిని చేసిపెడతాయి.

మీ తడి జుట్టును ముడివేయవద్దు

మీ తడి జుట్టును ముడివేయవద్దు

తలస్నానం చేసాక చలికాలంలో జుట్టు ఆరడం చాలా కష్టం. కొంచెమే కదా తడిగా ఉంది ముడి వేసేద్దాంలే అని మీరు అనుకుంటే, రెండుసార్లు ఆలోచించండి! ఇంకొంచెం సేపాగి జుట్టును ఆరబెట్టుకోండి. అదే చలికాలంలో జుట్టుకి మంచిది.

మీ జుట్టు మెరుపు మరియు బౌన్స్ ను తిరిగి తేవటం

మీ జుట్టు మెరుపు మరియు బౌన్స్ ను తిరిగి తేవటం

చలికాలంలో మీ జుట్టు కాంతి మరియు బౌన్స్ తగ్గిపోవటం సాధారణం. ఈ ఎండిపోయిన జుట్టుకి సంరక్షణ అవసరం మరియు అందులో మేటిది కొంచెం తేనె తీసుకుని కుదుళ్ళ నుంచి వెంట్రుకల చివర్ల వరకు రాసి కొన్ని నిమిషాలు వదిలేయండి.

మీ చుండ్రు సమస్యను పరిష్కరించుకోండి

మీ చుండ్రు సమస్యను పరిష్కరించుకోండి

చలికాలంలో చుండ్రు రావచ్చు మరియు ఎండిపోయే జుట్టుకి ముందే రావచ్చు. కొంచెం నిమ్మరసం మరియు ముఖ్యమైన నూనెలలో ఏదో ఒకటి మీకు సాయపడతాయి. వీటిని ప్రయత్నించి చుండ్రును దూరంగా ఉంచుకోండి.

చిక్కు చిక్కు

చిక్కు చిక్కు

చలికాలపు వాతావరణాన్ని ఎంజాయ్ చేసినా, ఆ వాతావరణం మీ జుట్టును చిక్కుపడేలా చేస్తుంది. ఎందుకంటే మీ జుట్టు ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయిన జుట్టును సంరక్షించే పనులు శ్రద్ధగా క్రమం తప్పకుండా చేయాలి మరియు మీ చిక్కుపడే జుట్టును తగ్గించడానికి మంచి హెయిర్ బ్రష్ వాడండి. పై చిట్కాలతో చలికాలంలో మీ జుట్టు చక్కగా సంరక్షించబడుతుందని ఆశిస్తున్నాం.

English summary

Dry Hair Winter | Winter Hair Care | Caring For Hair

It is that time of the year again, welcome winter!! Winter is a time which is pleasant and also a time of problems. It is that time of the year in which your skin becomes dry, hair becomes dry and hence care becomes imperative. There are many who dread winters. You may enjoy the cool breeze that sets in during winter, but you may never be able to tolerate the fact that it causes damage to your hair.
Story first published:Thursday, February 15, 2018, 18:12 [IST]
Desktop Bottom Promotion