For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో మీ కేశ సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

|

వేసవికాలం వచ్చిందంటే మీ జుట్టు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంతిహీనంగా, చిక్కులతో ఎండిపోయి ఉన్న జుట్టును ఏ మహిళ కోరుకోదు. మృదువైన, పెట్టులాంటి ఆరోగ్యకరమైన జుట్టు మీ అందాన్ని ఇనుమడింపజేస్తుంది.

రసాయన చికిత్సలు, కాలుష్యం, ఎండబారిన పడటం వలన జుట్టు పాడవుతుంది. ఈ సమస్య చాలామంది భారతీయ స్త్రీలు ఎదుర్కొంటున్నదే. కాశని సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం సులువుగా జరుగుతుంది అని చాలామంది మహిళలకు తెలియదు.

నిజానికి సూర్యుడు మీ జుట్టును నిర్జీవంగా మార్చలేడు కానీ ఎండబారిన పడటం వలన జట్టుపై ఉండే సన్నని రక్షణ పొర దెబ్బతింటుంది. తేమవలన కేశాలలోని హైడ్రోజన్ బంధాలు, లవణ బంధాలు కొంతవరకు దెబ్బతింటాయి.

Hair Care Tips To Follow This Summer

కనుక వేసవికాలం వచ్చిందంటే మీ జుట్టు పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు పొడిబారకుండా, రాలకుండా చూడవచ్చు. మండుటెండల్లో కేశ సంరక్షణకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


1. వేడినిచ్చే పరికరాలను వాడకండి: ఎండబారిన పడటం వలన అప్పటికే పాడైన జట్టుపైన వేడినిచ్చే పరికరాలైన డ్రైయ్యర్లు, కర్లర్లు వాడడం వలన జుట్టుకు మరీంత నష్టం వాటిల్లుతుంది.

తప్పనిసరయితే, జుట్టును ఆరబెట్టుకునేందుకు వేడి గాలికి బదులుగా చల్లని గాలినిచ్చే డ్రైయ్యర్లను వాడండి. షవర్ ను ఉపయోగించి తలకు స్నానం చేయాలనుకుంటే వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి. ఎందుకంటే వేడి నీటి వలన కూడా జుట్టుకు నష్టం వాటిల్లుతుంది.

2. జుట్టు చివర్లను క్రమం తప్పకుండా కత్తిరిస్తుండాలి: పగిలిన చివర్లు ఉంటే జుట్టు దెబ్బతిన్నట్లే! వేసవికాలంలో ఈ సమస్య మరీ అధికమవుతుంది. పగిలిన చివర్లు ఉంటే ఎంత అలంకరించినా జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. కనుక మీ జుట్టును ప్రతి 4-6 నెలలకు ఒకసారి చివర్లు కత్తిరిస్తుండాలి. మీ పగుళ్ల సమస్య అధికంగా ఉన్నట్లయితే,కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ పగుళ్లను తక్కువగా చూపిస్తాయి. కొన్ని రకాల షాంపూలు పగుళ్లను తగ్గించినా కూడా పూర్తి స్థాయిలో తొలగించాలంటే త్రిమ్మింగ్ చేసుకోవాలి.

3. మీ జుట్టుకు ఎండ తగలకుండా కప్పి ఉంచండి: ఎండాకాలంలో సూర్యతాపం వలన జుట్టు పొడిబారిపోతుంది. ఎల్లప్పుడూ ఇంటినుండి అడుగుబయట పెట్టేటప్పుడు వాతావరణ కాలుష్యం బారిన పడకుండా జుట్టును స్కార్ఫ్ లేదా క్యాప్ తో కప్పి ఉంచాలి.

4. ప్రతిరోజూ జుట్టును రుద్దుకోకండి: ప్రతిరోజూ తలరుద్దుకుంటే ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుందనుకోవడం అపోహ. రుద్దుకోవడం వలన జుట్టు శుభ్రపడుతుంది అని ప్రతిరోజు రుద్దుకోరాదు. నిజానికి ప్రతిరోజు తల రుద్దుకోవడం వలన మాడు మరీంత జిడ్డుగా మారుతుంది. కనుక వేసవిలో ప్రతిరోజు తల స్నానం చేయకుండా వారానికి మూడు సార్లు మాత్రమే రుద్దుకోవాలి.

5. నీరు ఎక్కువగా తాగాలి: మిమ్మల్ని వేసవి తాపం నుండి రక్షించడానికి నీరు అన్నింటి కన్నా బాగా పనికొస్తుంది. ఎండ వలన చర్మము డీహైడ్రేషన్ కు గురవుతుంది. కనుక ప్రతిదినము కనీసం 4లీటర్ల నీరు తాగాలి. ఎక్కువగా నీరు తాగితే మీ శరీరంతో పాటు మీ మాడు కూడా తేమను మరియు బలాన్ని పొంది శిరోజాలను కాపాడతుంది.

6. మంచి దువ్వెనను ఎంచుకోండి: ఫాన్సీ దువ్వెనలకు బదులుగా వెడల్పాటి పళ్లున్న దువ్వెనను వాడండి. వెడల్పాటి పళ్లున్న దువ్వెన మొండి చిక్కులను విడదీసి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. సున్నితమైన శిరోజాలను ఎండ నుండి కాపాడతాయి.

7. నూనెను రాసుకోండి: మీరు చదివింది నిజమే! మీ జుట్టుకు వేసవిలో కూడా తైలమర్దన అవసరం. నూనెతో మీ మాడును సున్నితంగా మీకిష్టమైన నూనెతో మర్దన చేసుకోవడం వలన తేమ స్థాయిలు పెరిగి జుట్టుకు పోషణ మరియు బలం చేకూరుతాయి. మర్దనకై కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, రోజ్ మేరీ ఆయిల్ మొదలైన ఏ నూనెనైనా వాడవచ్చు.

8. కండీషనర్ ను వాడండి: మీ శిరోజాలకు తగిన మంచి నాణ్యత కలిగిన కండీషనర్ ను వాడటం తప్పనిసరి. వేసవిలో స్విమ్మింగ్ కు వెళ్ళేటప్పుడుజుట్టుకు కండీషనర్ రాసుకుని క్యాప్ పెట్టుకోవాలి. ఇంట్లో సులభంగా తయారు చేసుకునే కండీషనర్ తయారీ విధానం మీ కోసం:

గుడ్డు పచ్చసొన మరియు ఆలివ్ ఆయిల్ కండీషనర్: గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్ మీ జుట్టుకు తేమను చేకూర్చి మృదువుగా చేస్తుంది. ఒక గిన్నెలో రెండు గుడ్ల పచ్చసొనలు మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలపండి. అవసరమనుకుంటే కొంచెం నీరు కూడా కలపండి. ఇలా చేస్తే సులువుగా జుట్టుకు రాసుకోవచ్చు. జుట్టు పాయలుగా విడదీసి బ్రష్ సహాయంతో రాసుకోండి. దీనిని గంట లేదా రెండు గంటల సేపు ఆరనిచ్చి షాంపూ మరియు కండీషనర్ తో చల్లని నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.

English summary

Hair Care Tips To Follow This Summer

Hair Care Tips To Follow This Summer ,Summer is here and so is the need to take care of your hair. Dull and frizzy hair is always a nightmare for all the ladies out there. After all, smooth, silky and healthier hair adds on to one's own personality along with enhancing the beauty.
Story first published:Monday, April 2, 2018, 7:48 [IST]
Desktop Bottom Promotion