For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిలీ హెయిర్ కి గుడ్ బై చెప్పేందుకు ఈ హోమ్ రెమెడీస్ తో పాటు ఈ టిప్స్ ను ప్రయత్నించండి

ఆయిలీ మరియు గ్రీజీ స్కాల్ప్ అనేది చాలా మంది మహిళలకు పీడకల వంటిది. స్మూత్, సిల్కీ అలాగే హెల్తీయర్ హెయిర్ అనేది మీ అపియరెన్స్ ను మరింత ప్లెజంట్ గా మారుస్తుంది. ఆయిలీ హెయిర్ వలన మీ అందం మొత్తం దెబ్బతింటు

|

ఆయిలీ మరియు గ్రీజీ స్కాల్ప్ అనేది చాలా మంది మహిళలకు పీడకల వంటిది. స్మూత్, సిల్కీ అలాగే హెల్తీయర్ హెయిర్ అనేది మీ అపియరెన్స్ ను మరింత ప్లెజంట్ గా మారుస్తుంది. ఆయిలీ హెయిర్ వలన మీ అందం మొత్తం దెబ్బతింటుంది.

స్కాల్ప్ లోని సెబాకియస్ గ్లాండ్స్ అతిగా పనిచేసినప్పుడు సెబమ్ ఎక్కువగా విడుదలవుతుంది. దీని వలన ఆయిలీ హెయిర్ సమస్య వేధిస్తుంది. కాస్తంత సెబమ్ విడుదలవడం నార్మల్. ఇది శిరోజాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే, ఎక్కువగా సెబమ్ విడుదలవడం వలన హెయిర్ అంతా ఆయిలీగా కనిపిస్తుంది. స్కాల్ప్ కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. చాలా మంది భారతీయ మహిళలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే, ఈ సమస్యను సులభంగా తొలగించుకోవచ్చన్న విషయం మనం గుర్తించం. సరైన పద్దతులను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Home Remedies And Tips To Get Rid Of Oily Hair

సరైన హెయిర్ కేర్ రొటీన్ ని పాటించడం ద్వారా హెయిర్ ను మృదువుగా, సిల్కీగా అలాగే అందంగా మార్చుకోవచ్చు. ఆయిలీ స్కిన్ సమస్యను తొలగించుకునేందుకు రెమెడీస్ మీ కిచెన్ లోనే ఉన్నాయి.

రెడీ మేడ్ ప్రోడక్ట్స్ పై అలాగే కెమికల్ ట్రీట్మెంట్స్ పై ఆధారపడితే డబ్బు ఖర్చవడంతో పాటు శిరోజాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి హానికరం అలాగే ఖరీదైనవి కూడా. ఆయిలీ హెయిర్ సమస్యను తొలగించుకునేందుకు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఆయిలీ హెయిర్ మరియు స్కాల్ప్ సమస్యను తొలగించుకునేందుకు మీకు కొన్ని హోమ్ రెమెడీస్ ను ఇక్కడ వివరించాము.

హోమ్ రెమెడీస్:

ఎగ్ యోల్క్ మాస్క్

ఎగ్ యోల్క్ మాస్క్

ఎగ్ యోల్క్ లో ప్రోటీన్ లభిస్తుంది. ఇది హెయిర్ ను బలపరుస్తుంది. హెయిర్ కు మెరుపును అందిస్తుంది. మృదువుగా మారుస్తుంది. అందువలన, హెయిర్ అనేది ఆయిలీగా కనిపించదు.

ఎలా వాడాలి:

ఎగ్ యోల్క్స్ ని బీట్ చేసి అందులో తేనె, టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ ను కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న హెయిర్ పై అప్లై చేయాలి. ఆ తరువాత 5 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత బాగా రిన్స్ చేయాలి. ఈ రెమెడీని వారానికి ఒకసారి వాడితే వేగవంతమైన ఫలితాలను పొందవచ్చు.

నిమ్మ:

నిమ్మ:

శిరోజాల అలాగే చర్మ సంరక్షణకి నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ కోసం రెమెడీగా వాడాలంటే, రెండు నిమ్మకాయల జ్యూస్ ను రెండు కప్పుల నీళ్లలో కలిపి స్టోర్ చేయండి. హెయిర్ వాష్ చేసాక హెయిర్ ను ఆరబెట్టిన ప్రతిసారి ఈ సొల్యూషన్ తో హెయిర్ ను అలాగే స్కాల్ప్ ను మసాజ్ చేయాలి. ఆ తరువాత ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయాలి.

బీర్

బీర్

కావలసిన పదార్థాలు:

ఒకటిన్నర కప్పుడు బీర్

ఒక కప్పుడు షాంపూ

ఎలా వాడాలి:

బీర్ ని ఒక పాట్ లో 15 నిమిషాల పాటు మరిగించాలి. బీర్ నార్మల్ టెంపరేచర్ కు చేరిన తరువాత దీనిలో ఒక కప్పుడు షాంపూను కలపాలి. ఈ షాంపూను మీరు రెగ్యులర్ గా వాడే షాంపూకి బదులుగా వాడండి. చల్లటి నీటితో రిన్స్ చేయండి. ఈ షాంపూ ని హెయిర్ వాష్ చేయాలనుకున్న ప్రతి సారి వాడండి.

టేబుల్ సాల్ట్:

టేబుల్ సాల్ట్:

డాండ్రఫ్ తో పాటు ఆయిలీ స్కాల్ప్ సమస్యను తొలగించేందుకు టేబుల్ సాల్ట్ ఉపయోగకరంగా ఉంటుంది. హెయిర్ ను వాష్ చేసేముందు మీ స్కాల్ప్ ని టేబుల్ సాల్ట్ తో మసాజ్ చేయాలి. 15-20 నిమిషాల తరువాత హెయిర్ ను నార్మల్ వాటర్ తో వాష్ చేయాలి. ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటిస్తే వేగవంతమైన ఫలితాలు లభిస్తాయి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

స్కాల్ప్ ని హైడ్రేటెడ్ గా ఉంచి అదనపు ఆయిల్ విడుదలవకుండా ఉంచేందుకు అలోవెరా తోడ్పడుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్ లో రెండు టేబుల్ స్పూన్ల రెగ్యులర్ షాంపూను కలపాలి. తాజాగా సేకరించబడిన అలోవెరా జెల్ ను వాడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఈ పదార్థాలని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అలాగే స్కాల్ప్ పై అప్లై చేయాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయాలి. ఈ రెమెడీని వారానికి రెండు మూడు సార్లు వాడితే ప్రయోజనం ఉంటుంది.

కొన్ని చిట్కాలు:

కొన్ని చిట్కాలు:

తరచూ షాంపూ చేసుకోండి:

సాధారణంగా హెయిర్ ను ఫ్రీక్వెంట్ గా వాష్ చేయడం మంచిది కాదు. అయితే, ఆయిలీ హెయిర్ కలిగిన వారు మాత్రం రోజు విడిచి రోజు హెయిర్ ను వాష్ చేసుకుంటే స్కాల్ప్ పై అదనపు ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది. అయితే, తేలికపాటి షాంపూలను వాడటం మంచిది. కఠినమైన షాంపూలను వాడితే హెయిర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

హెయిర్ ను బాగా వాష్ చేయండి

హెయిర్ ను బాగా వాష్ చేయండి

షాంపూ చేసుకుంటున్నప్పుడు హెయిర్ ను బాగా వాష్ చేసుకోండి. లేదంటే, స్కాల్ప్ పై ఉండే షాంపూ రెసిడ్యూల వలన ఆయిల్ ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది. అందువలన, మీ హెయిర్ మరింత గ్రీజీగా మారుతుంది. కాబట్టి, ఈ సారి షాంపూ చేసుకునేటప్పుడు షాంపూ మొత్తం తొలగిపోయేవరకు హెయిర్ ను వాష్ చేసుకోండి.

స్కాల్ప్ ని రబ్ చేయకండి:

స్కాల్ప్ ని రబ్ చేయకండి:

స్కాల్ప్ ని రబ్ చేయడం అలాగే స్క్రాచ్ చేయడాన్ని అవాయిడ్ చేయండి. దీని వలన ఆయిల్ గ్లాండ్స్ మరింత ఆయిల్ ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే, ఆయిలీ డాండ్రఫ్ ఫార్మ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, స్కాల్ప్ ని బాగా రుద్దడం మంచిది కాదు. ముఖ్యంగా, షవర్ తరువాత స్కాల్ప్ ని బాగా రుద్దకండి.

English summary

Home Remedies And Tips To Get Rid Of Oily Hair

Oily and greasy scalp is always a nightmare for all the ladies out there. Instead of spending on ready-made products or other chemical treatments which are both harmful and expensive, you can keep in mind a few tips to get rid of oily hair. Some of them are washing your hair frequently, reducing the use of hair conditioners, etc.
Story first published:Friday, April 27, 2018, 17:54 [IST]
Desktop Bottom Promotion