For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏళ్ల జుట్టును అరికట్టేందుకు తైలాలతో గృహవైద్యం

ఏళ్ల జుట్టును అరికట్టేందుకు తైలాలతో గృహవైద్యం

|

జుట్టు తెల్లబడటం అనేది ఈ రోజుల్లో అరుదైన సమస్య కాదు. చిన్న వయసులోనే చాలామందికి జుట్టు నెరవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. చిన్న వయసులోనే, వయసు మీద పడినట్టు కనపడేట్టు చేస్తుంది కనుక ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవలసిన అవసరం ఉంది.

ఈ రోజుల్లో- స్త్రీలు మరియు పురుషులలో కూడా సమానంగా ఉంది. ఒకప్పుడు జుట్టు నెరిసిందంటే ముసలివాళ్ళ కింద జమకట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. మొదటి తెల్ల వెంట్రుకను చూసినప్పుడు కూడా మనం అసలు పట్టించుకోము. కానీ ఈ సమస్యను గురించి కాస్త తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Homemade Oil Remedies For Gray Hair

మన శరీరం మెలనిన్ ఉత్పత్తి చేయడం ఆపేసినప్పుడు, జుట్టు తెల్లబడటం ఆరంభమవుతుంది. సమతులాహారం తీసుకోకపోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లోపించి ఇలా జరుగుతుంది.

ఈ క్రింద కొన్ని సహజమైన తైలాలను ఉపయోగించి ఇంట్లోనే తెల్ల జుట్టును ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. అవి ఏమిటో తెలుసుకుని వాటిని, ఆచరించి నల్లని జుట్టును సొంతం చేసుకుందాం.

1. కొబ్బరినూనె మరియు ఉసిరిక పొడి:

1. కొబ్బరినూనె మరియు ఉసిరిక పొడి:

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల ఉసిరిక పొడి

3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె

వాడే విధానం: కొబ్బరినూనె మరియు ఉసిరిక పొడిలను కలిపి వేడి చేయండి. ఉసిరిక పొడి నల్లగా మారేవరకు వేడి చేయండి. ఈ నూనెను మాడుకు మరియు జుట్టుకు రాసుకుని కనీసం గంటసేపు ఉంచుకోవాలి. వీలైతే రాత్రంతా అలానే ఉంచుకోండి. తరువాత చల్లని నీటిని ఉపయోగించి షాంపూ మరియు కండీషనర్ లతో శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు చేయాలి.

2. నిమ్మరసం మరియు కొబ్బరినూనె

2. నిమ్మరసం మరియు కొబ్బరినూనె

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె

వాడే విధానం: కొబ్బరినూనె గోరువెచ్చగా అయ్యేవరకు వేడి చేయండి. దీనిలో ఒక నిమ్మకాయను కట్ చేసి కొన్ని చుక్కలను కలపండి.

ఈ మిశ్రమాన్ని మృదువుగా మాడుపై వలయాకారంలో మర్దన చేసుకోండి. అరగంట తరువాత మృదువైన షాంపూ తో కడిగేయండి. ఇలా వారానికి రెండు దఫాలుగా చేయండి.

3. కరివేపాకు మరియు కొబ్బరినూనె

3. కరివేపాకు మరియు కొబ్బరినూనె

కావలసిన పదార్థాలు:

కరివేపాకు

3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె

వాడే విధానం: ఒక బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె తీసుకుని అందులో గుప్పెడు తాజా కరివేపాకు వేసి వేడి చేయండి. కరివేపాకు నల్లగా మారేవరకు వేడి చేయండి. ఈ నూనెను జుట్టుకు రాసుకుని కనీసం గంటసేపు ఉంచుకోవాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఆవనూనె మరియు ఆముదం:

4. ఆవనూనె మరియు ఆముదం:

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల ఆముదం

2 టేబుల్ స్పూన్ల ఆవనూనె

వాడే విధానం: ఈ రెండు పదార్థాలను కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ల నుండి చివర్ల వరకు మరియు మాడుకు రాసుకోండి. పావుగంట పాటు మర్దన చేసుకుని గంటసేపు ఇంకడానికి వీలుగా వదిలేయాలి. తరువాత సల్ఫేట్ లేని షాంపూ ఉపయోగించి శుభ్రపరచుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేయాలి.

5. ఆలివ్ ఆయిల్ మరియు బ్లాక్ సీడ్ ఆయిల్:

5. ఆలివ్ ఆయిల్ మరియు బ్లాక్ సీడ్ ఆయిల్:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్ ఆయిల్

వాడే విధానం: ఆలివ్ ఆయిల్ మరియు బ్లాక్ సీడ్ ఆయిల్ లను సమపాళ్లలో కలిపి మాడుకు రాసుకుని మృదువుగా మర్దన చేసుకోండి. గంట తరువాత మృదువైన షాంపూ మరియు కండీషనర్ లతో శుభ్రం చేసుకోండి. ఫలితాలు త్వరగా కనిపించాలంటే వారానికి ఒకసారి ఇలా చేయండి.

6. గోరింటాకు పొడి మరియు కొబ్బరినూనె:

6. గోరింటాకు పొడి మరియు కొబ్బరినూనె:

కావలసిన పదార్థాలు:

గోరింటాకు

3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె

వాడే విధానం: కొబ్బరినూనె వేడి చేయండి. అందులో గుప్పెడు తాజా గోరింటాకు వేసి నూనె ఎర్రగా మారేవరకు ఉంచండి. ఎర్రగా మారిన తరువాత గోరువెచ్చని నూనెను మాడుకు రాసుకుని మృదువుగా మర్దన చేసుకోండి. నలభై ఐదు నిమిషాల తరువాత తేడాను మొదటిసారే మీరు తేలికగా గమనించవచ్చు.

English summary

Homemade Oil Remedies For Gray Hair

Gray hair is not a rare issue anymore. When the body stops producing melanin, it leads to the development of gray hair. Lack of nourishment and proper diet can also lead to this. You can easily treat grey oil with homemade oil blends like olive oil, coconut oil, castor oil and other ingredients.DIY Remedies For Gray Hair
Story first published:Monday, May 21, 2018, 12:57 [IST]
Desktop Bottom Promotion