For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే హాట్ ఆయిల్ హెయిర్ మసాజ్ తో ఈ ప్రయోజనాలను పొందండి

ఇంట్లోనే హాట్ ఆయిల్ హెయిర్ మసాజ్ తో ఈ ప్రయోజనాలను పొందండి

|

శిరోజాలకు నూనె పట్టించడం పట్ల చాలా మంది ఆసక్తి కనబరచరు. చిన్నపటినుంచి శిరోజాలకు నూనె పట్టించడం పట్ల శ్రద్ధ కనబరచని వారు కూడా ఉంటారు. ఎందుకంటే, నూనె పట్టించడం వలన శిరోజాలు జిడ్డుగా మారతాయి.

అయితే, ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నూనె పట్టించడమనేది శిరోజాల సంరక్షణలో ముఖ్య అంశం. స్కాల్ప్ ఆరోగ్యకరంగా మారుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి హెయిర్ కు రక్షణ అందుతుంది. కాబట్టి, వారానికి ఒకసారి కేశాలకు హాట్ ఆయిల్ మసాజ్ ను అందించడం ద్వారా కేశాలు ఆరోగ్యంగా తయారవుతాయి. మీకు కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం అందుతుంది.

How To Do A Hot Oil Hair Massage At Home?

కేశాల తీరు ఏదైనా కూడా వేడి నూనె మసాజ్ వలన కేశాలకు పోషణ అందుతుంది. అయితే, ఎంత తరచుగా వేడి నూనెతో కేశాలకు మసాజ్ ఇవ్వాలో అనేది మాత్రం హెయిర్ టైప్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీ శిరోజాలు కర్లీగా అలాగే వేవీగా ఉంటే వారానికి రెండు లేదా మూడు సార్లు హాట్ ఆయిల్ మసాజ్ ని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే, కర్లీ హెయిర్ వలన స్కాల్ప్ నుంచి నేచురల్ ఆయిల్ అనేది హెయిర్ టిప్స్ వరకు చేరుకోవడం కష్టతరం. మరోవైపు స్ట్రెయిట్ హెయిర్ లో ఈ సమస్య ఉండదు. స్ట్రెయిట్ హెయిర్ కలిగిన వారికి వారానికి ఒకసారి హాట్ ఆయిల్ హెయిర్ ట్రీట్మెంట్ సరిపోతుంది.

ఇప్పుడు వేడి నూనెతో మసాజ్ ను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

మీరు ప్రిఫర్ చేసే ఏదైనా నూనె

నీళ్లు

బౌల్

సాస్ పాన్

వెడల్పాటి పళ్ళున్న హెయిర్ బ్రష్

షవర్ క్యాప్

ఎలా తయారుచేయాలి?

ఎలా తయారుచేయాలి?

1. మొదటగా కొన్ని చుక్కల నూనెను ఒక గ్లాస్ బౌల్ లోకి తీసుకోండి. మీ హెయిర్ లెంత్ ని బట్టి మీరు తీసుకోబోయే నూనె మోతాదు ఆధారపడి ఉంటుంది.

2. మీరు మీకు నచ్సిన నూనెతో హాట్ ఆయిల్ మసాజ్ ను చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, జొజోబా ఆయిల్ వంటి ఆయిల్స్ ను మీరు ప్రిఫర్ చేయవచ్చు.

3. సాస్ పాన్ లో కొంత నీటిని పోసి వేడి చేయండి.

4. ఇప్పుడు నూనె కలిగిన పాత్రను సాస్ పాన్ పై అమర్చండి. డబుల్ బాయిల్ చేయండి.

5. ఈ నూనె అతిగా వేడి లేకుండా చూసుకోండి. లేదంటే స్కాల్ప్ కాలిపోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఎలా అప్లై చేసుకోవాలి?

1. మొదటగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను తీసుకుని మీ హెయిర్ లోని చిక్కును తొలగించుకోండి.

2. ఇప్పుడు చేతులలోకి నూనెను తీసుకోండి.

3. నూనెను స్కాల్ప్ పై సర్క్యూలర్ మోషన్స్ లో అప్లై చేసుకోవడం ప్రారంభించండి.

4. స్కాల్ప్ కి అప్లై చేసిన తరువాత హెయిర్ పై నూనెను అప్లై చేయండి.

5. ఇందుకోసం హెయిర్ ను సెక్షన్స్ గా డివైడ్ చేసుకోండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు ఆయిల్ ను ప్రతి సెక్షన్ లో అప్లై చేసుకోండి.

6. నూనెను అప్లై చేసుకున్న తరువాత హెయిర్ ను బన్ లా ముడివేయండి.

7. హెయిర్ మొత్తాన్ని షవర్ క్యాప్ తో కవర్ చేయండి. హెయిర్ బయటికి కనిపించకూడదు.

8. గంటపాటు అలాగే వదిలేయండి.

9. ఇప్పుడు తేలికపాటి సల్ఫేట్ ఫ్రీ షాంపూ, నార్మల్ వాటర్ మరియు కండిషనర్ తో హెయిర్ ను వాష్ చేసుకోండి.

హాట్ ఆయిల్ మసాజ్ వలన కలిగే ప్రయోజనాలు

హాట్ ఆయిల్ మసాజ్ వలన కలిగే ప్రయోజనాలు

హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది

స్కాల్ప్ ను అలాగే హెయిర్ ను హాట్ ఆయిల్ తో మసాజ్ చేయడం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా, వెంట్రుకలు దృఢంగా మారతాయి. హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది.

డాండ్రఫ్ అరికట్టబడుతుంది:

డాండ్రఫ్ అరికట్టబడుతుంది:

చాలా మందికి డాండ్రఫ్ అనేది ఇబ్బందికర సమస్య. హాట్ ఆయిల్ మసాజ్ అనేది ఇందుకు ఉత్తమమైన పరిష్కారం. హాట్ ఆయిల్ మసాజ్ వలన స్కాల్ప్ హైడ్రేట్ అవుతుంది. మాయిశ్చర్ అందుతుంది. తద్వారా, డ్రై మరియు ఫ్లేకీ స్కాల్ప్ సమస్య వేధించదు.

హానికర సూర్యకిరణాల నుంచి రక్షణ అందుతుంది

హానికర సూర్యకిరణాల నుంచి రక్షణ అందుతుంది

సూర్యుని నుంచి విడుదలయ్యే హానికర యువీ రేస్ అనేవి కేశాలను అనేక విధాలుగా ఇబ్బంది పెడతాయి. హెయిర్ ఫాల్ నుంచి రఫ్ హెయిర్ అలాగే స్ప్లిట్ ఎండ్స్ సమస్య వేధిస్తుంది. హాట్ ఆయిల్ మసాజ్ అనేది హెయిర్ ను ఈ సమస్యల నుంచి రక్షిస్తుంది.

ఫ్రిజ్జీ హెయిర్ సమస్య తగ్గుతుంది:

ఫ్రిజ్జీ హెయిర్ సమస్య తగ్గుతుంది:

వేడికి గురయినప్పుడు అలాగే కెమికల్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కు లోనయినప్పుడు హెయిర్ అనేది ఫ్రిజ్జీగా మారుతుంది. హాట్ ఆయిల్ మసాజ్ అనేది హెయిర్ కు కాంతిని అందిస్తుంది. ఫ్రిజ్జీ మరియు డల్ హెయిర్ ను సమర్థవంతంగా అరికడుతుంది.


English summary

How To Do A Hot Oil Hair Massage At Home?

Oiling your hair would have been one of the least things we liked doing in our childhood. But little did we know the benefits of oiling the hair then. It helps us in maintaining a healthy scalp and hair. Giving your tresses a hot oil massage once in a week can not only give a healthy mane but also be a relaxing exercise for yourself.
Story first published:Tuesday, July 31, 2018, 17:56 [IST]
Desktop Bottom Promotion