For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, తిరిగి జుట్టు పెరుగుదలలో సహాయం చేసే గుడ్డు

|

దీర్ఘకాలం, ఆరోగ్యకరమైన మరియు నునుపుగా ఉండే జుట్టును కలిగి ఉండడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఆరోగ్యకరమైన మరియు దృఢమైన జుట్టు కలిగి ఉండే క్రమంలో, జుట్టు రాలడం మరియు చుండ్రు వంటి సమస్యలను నివారించడం అన్నిటికన్నా ముఖ్యం.

వాతావరణం మరియు నీటిలో మార్పులు(ముఖ్యంగా PH విలువలు,) రసాయనాల మితిమీరిన వాడుక, తాపన ఉత్పత్తులు, ఎండ ప్రభావం మరియు హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వలన హెయిర్ ఫాల్ సమస్యలు ఏర్పడుతాయి.

How To Use Egg To Prevent Hair Loss And Boost Hair Growth

చికిత్స కోసం, మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్నిరకాల ఉత్పత్తులతో ప్రయోగాలు చేసేస్తాము. క్రమంగా జుట్టు నష్టం మరింత పెరుగుతుంది.

ఈ వ్యాసంలో, జుట్టు నష్టం మరియు జుట్టు పెరుగుదల సమస్యలకై సమర్థవంతమైన నివారణల గురించి పొందుపరచడం జరిగినది. ఈ మిశ్రమాలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు, మరియు కృత్రిమ రసాయనాల కన్నా, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

ఈ నివారణలను ఎలా తయారు చేస్తారో, క్రమంగా వాటి ఫలితాల గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, తిరిగి జుట్టు పెరుగుదలలో సహాయం చేసే గుడ్డు:

1. అలోవెరా (కలబంద) మరియు గుడ్డు :

1. అలోవెరా (కలబంద) మరియు గుడ్డు :

అలోవేరాకు శోథ నిరోధక, క్రిమి నాశక తత్వాలతో పాటు మరియు తేమను పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.

కావలసిన పదార్ధాలు :

2 గుడ్ల తెల్ల సొన

2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

తయారు చేయు విధానం :

తయారు చేయు విధానం :

ఒక గిన్నెలో 2 గుడ్ల తెల్ల సొన మరియు తాజా కలబంద గుజ్జును 2 టేబుల్ స్పూన్లను జోడించండి. మృదువైన మిశ్రమం వచ్చే వరకు బాగా కలపండి. ఒక హెయిర్ బ్రష్ సహాయంతో మూలాల నుండి మీ జుట్టు మొత్తానికి దీనిని వర్తించండి. సుమారు 30 నిముషాల నుండి గంట వరకు, మొత్తం పొడిగా అయ్యే వరకు వదిలి వేయండి. తరువాత చల్లని లేదా సాధారణ నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేయండి. లేదా, రసాయనాలు లేకుండా కేవలం నీటితో కానీ, తేలికైన షాంపూలతో తలస్నానం చేయండి. జుట్టును శుభ్రపరచుటకు వేడి నీటిని వాడకండి. తర్వాత కండిషనర్ అప్లై చేయండి.

2. హెన్నా మరియు గుడ్డు :

2. హెన్నా మరియు గుడ్డు :

హెన్నామీ జుట్టును ఆరోగ్యకరమైనదిగా చేయడంలో మరియు మెరిసే జుట్టును అందివ్వడంలో సహాయపడుతుంది. హెన్నాలోని క్రిమిసంహారక తత్వాలు సూక్ష్మజీవులను సంహరించి చుండ్రు మరియు ఇతర చర్మపు అంటురోగాలను నిరోధించడంలో సహాయం చేయగలవు.

కావలసినవి:

1 కప్పు గోరింటాకు పొడి

2 టేబుల్ స్పూన్ల మెంతులు

1 గుడ్డు పచ్చసొన

Most Read: నా భర్త పోర్న్ కు బానిసయ్యాడు, బలవంతంగా ఆ భంగిమల్లో నన్ను అనుభవిస్తున్నాడు, కారణం నేనే #mystory238

తయారు చేసే విధానం :

తయారు చేసే విధానం :

మొదటగా, మెంతులను నీటిలో నానబెట్టి, ఒక రాత్రి అలాగే వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం, ఈ మెంతులను మెత్తగా రుబ్బి మిశ్రమంగా చేయాలి. దీనిలో గోరింటాకు పొడిని జతచేసి, కొంచం నీటిని కలిపి బాగా కలియబెట్టాలి. తర్వాత గుడ్డు పచ్చసొన వేసి మరలా పేస్టులా వచ్చేవరకు కలపాలి. దీన్ని మీ జుట్టుకు కుదుళ్ళతో పాటు వర్తించి, కనీసం 2 గంటలు అలాగే వదిలేయండి. వీలయితే షవర్ టోపీతో మీ జుట్టును కప్పి ఉంచండి. చల్లని నీటిలో, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.

3. అరటి మరియు గుడ్డు

3. అరటి మరియు గుడ్డు

మీరు పొడి జుట్టు కలిగి ఉంటే ఇది ఉత్తమ పరిష్కారంగా చెప్పబడుతుంది. పొటాషియం యొక్క గొప్ప మూలంగా ఉన్న అరటి, జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు రాలుట అరికట్టడంలో సహాయపడుతుంది.

కావలసినవి :

1 గుడ్డు

1 అరటి పండు

1 స్పూన్ ఆలివ్ నూనె

తయారు చేయు విధానం:

తయారు చేయు విధానం:

ఒక గుడ్డు, అరటి పండు గుజ్జు మరియు ఆలివ్ ఆయిల్ వేసి, మిశ్రమంలా పేస్టులా కలపండి. దీనిని మీ జుట్టుపై వర్తించి 15-20 నిముషాలు వదిలిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రం చేయండి.

Most Read: నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?

4. ఉల్లిపాయ మరియు గుడ్డు

4. ఉల్లిపాయ మరియు గుడ్డు

ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. జుట్టు నష్టాన్ని నివారించడంలో మరియు జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది.

కావలసినవి :

1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

2 గుడ్లు

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

ఉల్లిపాయ రసం మరియు గుడ్డు సొనలను మిశ్రమంలా కలపండి. పేస్టులా అయ్యేవరకు మృదువుగా కలపండి. ఒక హెయిర్ బ్రష్ సహాయంతో జుట్టు మీద వర్తించండి. 30 నిముషాల పాటు వదిలివేసిన తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి, చివరగా కండీషనర్ వర్తించండి.

5. ఉసిరి పొడి మరియు గుడ్డు :

5. ఉసిరి పొడి మరియు గుడ్డు :

ఉసిరి అనామ్లజనకాలులో అధికంగా ఉంటుంది, జుట్టు నష్టం మరియు మరమత్తులలో ఎంతగానో సహాయపడుతుంది. మరియు ముఖ్యంగా జుట్టు ఫోలికల్స్ బలోపేతం చేయడంలో దోహదం చేస్తుంది.

కావలసినవి :

½ కప్పు ఉసిరి పొడి

2 గుడ్లు

Most Read: ఆమెకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడొచ్చేది, సెక్స్ అంటే కాఫీ తాగినట్లే, నాతో పాటు అతనితోనూ #mystory237

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

ఒక గిన్నెలో గుడ్లు మరియు ఉసిరి పొడిని చేర్చండి. మిశ్రమంలా చేయండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మీద 30 నిముషాల పాటు వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి.

అంతేకాకుండా, జుట్టుకు వీలైనంత వరకు రసాయనాల వాడకం లేకుండా చూసుకోవలసి ఉంటుంది, ఎప్పటికప్పుడు జుట్టు ఆరోగ్యానికి నూనెలను వర్తించడం, శీకాయ వంటి ఆరోగ్యకర సాంప్రదాయక పద్దతులతో తల స్నానాలు చేయడం, వారంలో కనీసం రెండు మూడు సార్లు తలస్నానం చేయడం, ట్రాఫిక్ పరిస్తితుల్లో జుట్టు ఎండకు, దుమ్ముధూళికి ఎక్కువగా ప్రభావితం కాకుండా చూడడం మొదలైన చర్యలను పాటించడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా చూసుకునే వీలుంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Egg To Prevent Hair Loss And Boost Hair Growth

Who wouldn't love to have long, healthy and lustrous hair? To have healthy and voluminous hair it's important to treat issues like hair fall and dandruff as soon as they surface. An effective solution using eggs will help in preventing hair fall and boosting hair growth. These remedies can be easily done at home and will give you the desired results.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more