For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు (డాండ్రఫ్) ను అరికట్టడంలో అల్లం ఏవిధంగా సహాయపడుతుంది ?

చుండ్రు (డాండ్రఫ్) ను అరికట్టడంలో అల్లం ఏవిధంగా సహాయపడుతుంది ?

|

మీ జుట్టును పొడిగా చేసి, మీ మాడును నిర్జీవంగా చేసే సాధారణ జుట్టు సమస్యలలో చుండ్రు ఒకటి. ఇలాంటి పరిస్థితికి మీరు సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే దురద, మంటలు వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడటానికి దారితీయవచ్చు.

మీరు ఎదుర్కొంటున్న ఈ చుండ్రు సమస్యను నివారించడానికి మార్కెట్లో లభ్యమయ్యే డాండ్రఫ్ షాంపూలు ఉన్నప్పటికీ, సహజసిద్ధమైన పదార్ధాలతో తయారైన డాండ్రఫ్ షాంపూ అంతా ప్రభావశాలిగా ఉండకపోవచ్చు. చుండ్రుని నివారించడంలో అల్లాన్ని ఏవిధంగా ఉపయోగించాలో ఈరోజు మనం తెలుసుకుందాం !

How To Use Ginger To Treat Dandruff

చుండ్రు ప్రభావం వల్ల మీ మాడుపై ఏర్పడిన ఇన్ఫెక్షన్స్ను & ఫంగస్ను తొలగించడం కోసం, అల్లంలో ఉండే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ సహాయపడతాయి. ఇది చర్మంపై రక్తప్రసరణను పెంచుతుంది. మాడు యొక్క pH స్థాయిలు అసమతుల్యతగా ఉండటం వల్ల ఈ చుండ్రు అనేది ఏర్పడటానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అల్లం జుట్టు యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

1. అల్లము - కొబ్బరినూనె :-

1. అల్లము - కొబ్బరినూనె :-

కావలసిన పదార్థాలు :

1 టేబుల్ స్పూను అల్లం రసం

1 స్పూను కొబ్బరినూనె

తయారీ విధానం :

తాజా అల్లం ముక్కలను తీసుకుని, దాని నుండి రసాన్ని వేరు చేయండి. ఈ రసానికి కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెను కలిపి, మీ మాడుపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 40 నిమిషాలపాటు బాగా ఆరేలా వదిలేయాలి. ఆ తరువాత ఒక తేలికపాటి షాంపూతో మీ తలను శుభ్రంగా కడగాలి.

2. అల్లము-ఆలివ్ ఆయిల్ :-

2. అల్లము-ఆలివ్ ఆయిల్ :-

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

తయారీ విధానం :

తరిగిన అల్లం ముక్కలను ఆలివ్ నూనెలో వేసి బాగా నానబెట్టాలి. ఆ తరువాత దీనిని మీ మాడుపై 5 నిమిషాల పాటు వృత్తాకార కదలికలో మసాజ్ చేస్తూ, అప్లై చేయాలి. 30 నిమిషాలపాటు బాగా ఆరేలా దానిని వదిలేసి, చన్నీటితో మీ తలను శుభ్రం చేసుకోవాలి. అందుకోసం తేలికపాటి షాంపూను ఉపయోగించండి. ఈ పద్ధతిని వారంలో మూడుసార్లు తప్పక పాటించాలి.

3. అల్లము- నిమ్మరసం :-

3. అల్లము- నిమ్మరసం :-

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ అల్లం రసం

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం :

ఒక గిన్నెలో అల్లం రసానికి కొన్ని చుక్కల నిమ్మరసమును జోడించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు & మాడుపై వేసి, బాగా మర్ధన చేస్తూ 15-20 నిముషాల పాటు బాగా ఆరేలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

4. అల్లము - రోజ్ వాటర్ :-

4. అల్లము - రోజ్ వాటర్ :-

కావలసిన పదార్థాలు :

అల్లం రసం

రోజ్ వాటర్

తయారీ విధానం :

మీ జుట్టు పరిమాణానికి తగ్గట్లుగా పై రెండు పదార్థాలను సమాన భాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసి, దానికి కొద్దిగా నీటిని కలపాలి. మీ జుట్టును శుభ్రం చేయడానికి ఈ నీటిని ఉపయోగించండి. మీరు ఈ పరిహారాన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.

5. అల్లము - ఉల్లిరసం :-

5. అల్లము - ఉల్లిరసం :-

కావలసిన పదార్థాలు :

అల్లం

ఉల్లిపాయ

తయారీ విధానం :

మొదటగా, తరిగిన అల్లం ముక్కలను తీసుకుని బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇదే పద్ధతిలో ఉల్లిపాయను కూడా పేస్ట్గా మార్చుకోవాలి. ఈ రెండు పేస్ట్లను బాగా కలిపి మీ జుట్టుకు & మాడుకు అప్లై చేయాలి. ఒక 30-40 నిమిషాల పాటు దానిని అలాగే వదిలి వేసిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కావాలనుకుంటే మీరు ఉల్లిపాయకి బదులు వెల్లుల్లి కూడా ఉపయోగించవచ్చు.

 6. అల్లము + ఆపిల్ సైడర్ వెనిగర్ :-

6. అల్లము + ఆపిల్ సైడర్ వెనిగర్ :-

కావలసిన పదార్థాలు :

అల్లం పొడి

ఆపిల్ సైడర్ వెనిగర్

తయారీ విధానం :

1 వంతు అల్లం పొడికి, 3 వంతుల ఆపిల్ సైడర్ వెనిగర్ను కలపాలి. ఈ రెండు పదార్థాలను బాగా కలిపిన తరువాత, దీనిని మీ జుట్టు & మాడుకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలానే వదిలివేయండి. ఆ తర్వాత ఒక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. మీరు ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి ఉపయోగించడం ద్వారా చుండ్రును సమర్థవంతంగా తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

7. అల్లము + బీట్రూట్ రసం :-

7. అల్లము + బీట్రూట్ రసం :-

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ అల్లం రసం

1 టేబుల్ స్పూన్ బీట్రూట్ రసం

నిమ్మరసం (కొన్ని చుక్కలు)

తయారీ విధానం :

ఒక గిన్నెలో బీట్రూట్ రసాన్ని, అల్లం రసాన్ని & కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు & మాడుకు అప్లై చేయాలి. ఒక 30-40 నిమిషాల పాటు దానిని అలాగే వదిలి వేసిన తరువాత సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. మెరుగైన ఫలితాల కోసం వారానికి 2 సార్లు ఈ పద్ధతిని పాటించండి.

English summary

How To Use Ginger To Treat Dandruff

Dandruff is one of the most common hair-related issues and causes dry and flaky skin on the scalp. Not taking proper care of the condition can even lead to worse conditions like itching, scalp inflammation and hair fall. Ginger balances the pH of the scalp that ultimately helps in hair growth. Lemon, beetroot and rosewater are some ingredients you can use with ginger.
Story first published:Wednesday, August 22, 2018, 12:50 [IST]
Desktop Bottom Promotion