For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు రాలుతుందా? అయితే ఈ ఆహార పదార్ధాలని తిని చూడండి.

|

మనలో ప్రతిఒక్కరికి జుట్టు రాలిపోవడం అనే సమస్య సాధారణంగా ఉంటుంది. జుట్టు పెరుగుదల మన ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలితో ముడిపడి ఉంటుంది. మీరు ప్రతిదినము జుట్టుకు నూనె పట్టించినా, హెయిర్ ప్యాక్లు వేసుకున్నా కానీ అంతర్గత పోషణ చాలా అవసరం. కొన్ని రకాల ఆహారపదార్థాలు మన జుట్టును ఆరోగ్యంగా రాలకుండా ఉంచుతాయి. అటువంటి తొమ్మిది పదార్ధాలను గురించి తెలుసుకోండి. వాటిని మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోండి.


 1. పాలకూర:

1. పాలకూర:

కురుల పెరుగుదలకు పాలకూర అద్భుతమైన శాకాహార ఆహారం. పాలకూరలో ఐరన్, విటమిన్ A, విటమిన్ C మరియు ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. జుట్టు రాలడానికి ఐరన్ లోపం ముఖ్య కారణం. పాలకూరలో ఐరన్ తో పాటుగా సహజ కండీషనర్ గా పనిచేసే సెబం కూడా ఉంటుంది. ఇవే కాక ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన మాడు మరియు కాంతులీనే కురులు పొందడానికి పాలకూర తోడ్పడుతుంది.

 2. గుడ్లు మరియు పాల ఉత్పత్తులు:

2. గుడ్లు మరియు పాల ఉత్పత్తులు:

ఒత్తైన మరియు పొడవైన కురులకు గుడ్లు మరియు పాల ఉత్పత్తులు తోడ్పడతాయి. పాలు,పెరుగు మరియు గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ B12,ఐరన్,జింక్ మైయు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే బయోటిన్ (విటమిన్ B7) జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

3. వాల్ నట్లు:

3. వాల్ నట్లు:

వాల్ నట్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటిలో బయోటిన్, B కాంప్లెక్స్ విటమిన్లు(B1,B6 మరియు B9) ,ప్రొటీన్లు మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు యొక్క క్యూటికల్ ను బలంగా చేసి మాడుకు పోషణ అందిస్తుంది.

4. జామపండు:

4. జామపండు:

విటమిన్ C జట్టు పేలుసుగా మారకుండా చేస్తుంది. నారింజ పండ్ల కన్నా జామపండ్లలో విటమిన్ C అధికం. పండ్ల మాదిరిగా ఆకులతో కూడా విటమిన్ B మరియు C లు ఉంటాయి. ఇవి కొల్లాజన్ పనితీరును మెరుగుపరచి జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.

5. పప్పుధాన్యాలు:

5. పప్పుధాన్యాలు:

పప్పు ధాన్యాలలో మన జుట్టు పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు, ఐరన్,జింక్ మరియు బయోటిన్ లతో నిండి ఉంటాయి. అంతేకాక వీటిలో ఉండే ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల పనితీరు మెరుగుపరచి, మాడుపై ఉండే చర్మానికి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ ల సరఫరాను పెంపొందిస్తుంది. దీని వల్ల జుట్టు చిట్లకుండా శుభ్రంగా పెరుగుతుంది. జుట్టు రాలడం నివారించడానికి పప్పుధాన్యాలను అధికంగా తినండి.

6. బార్లీ:

6. బార్లీ:

జుట్టు పలుచబడకుండా అరికట్టే విటమిన్ E బార్లీలో పుష్కలంగా ఉంటుంది. అంతే కాక ఎర్ర రక్త కణాల ఉత్పాదనకు తోడ్పడి కుదుళ్లను బలంగా చేసే ఐరన్ , కాపర్ దీనిలో మెండుగా ఉంటాయి.

7. అవిస గింజలు:

7. అవిస గింజలు:

వీటిలో ఉండే ఒమేగ 3 కొవ్వు ఆమ్లాలు సులభంగా ప్రతి వెంట్రుక యొక్క కుదురుకు మరియు మాడు యొక్క కణత్వచానికి పోషకాలు అందిస్తుంది. అంటే కాక వెంట్రుకలకు సాగే గుణం చేకూర్చి వాటిని తెగకుండా కాపాడుతుంది. అవిసెలలో ఉండే ఆవశ్యక కొవ్వు ఆమ్లాలను మన శరీరం ఉత్పత్తి చేయలేదు, కనుక అవిసెలను మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

8. కోడి మాంసం:

8. కోడి మాంసం:

మీ కురులు ప్రోటీన్లతో చేయబడి ఉంటాయి, కనుక మీరు ఆహారంలో అధిక నాణ్యత కలిగిన సహజ ప్రొటీన్లను తీసుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది. మీరు శాఖాహారులైతే,తొఫు లేదా వేరుశనగలను ఎంచుకోండి.

9. క్యారెట్లు:

9. క్యారెట్లు:

క్యారెట్లు కంటికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ A సహజ కండీషనర్ గా పనిచేసి జుట్టును తెగనివ్వదు. చిలకడ దుంపలలో కూడా విటమిన్ A అధికంగా ఉంటుంది.

ఇవే కాక అధిక సూర్యరశ్మి కి గురవడం, కాలుష్యం, అధికముగా రసాయన ఉత్పత్తులని వినియోగించడం మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన జుట్టు రాలిపోతుంది. కనుక పై పదార్థాలను మీ దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇవి మీ జుట్టును ఒత్తుగా, దృఢంగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది.

English summary

Losing Hair? Devour These Nine Foods To Prevent Hair Fall

Losing Hair? Devour These Nine Foods To Prevent Hair Fall,Every one of us has had nightmares of hair fall but we often tend to forget that hair fall or hair growth is strongly linked with our diet and lifestyle. You may oil your hair regularly and apply natural hair masks but internal nourishment is as important as ex
Desktop Bottom Promotion