For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మృధువైన ఆరోగ్యకర జుట్టుకై సూచించబడిన నూనెలు ఇవే

మృధువైన ఆరోగ్యకర జుట్టుకై సూచించబడిన నూనెలు ఇవే

|

నిజానికి స్మూత్ మరియు సిల్కీ గా ఉన్న జుట్టుకు ఏ అదనపు హంగులు లేకపోయినా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిజానికి ఒక ఆరోగ్యకరమైన జుట్టుకు సంకేతం ఇది. చూపరుల దృష్టిని కూడా మరల్చుకోలేని అందం మీ సొంతమవుతుంది . మరో వైపు అధికంగా చిక్కు పడుతున్న జుట్టు అనారోగ్యకరమైన జుట్టుకు సంకేతంగా ఉంటుంది .

కృత్రిమ అలంకరణ పద్దతులు, పోషకాలు లేని ఆహారం, కాలుష్య కోరల జీవనం ఇలాంటివి అనేకం జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది అన్నది కాదనలేని సత్యం. ఇలా చిక్కుకు గురైన జుట్టుతో జీవనం చాలా అసౌకర్యంగా ఉంటుంది . కానీ దీన్ని నివారించడం ఎంత కష్టమైన చర్య అవుతుందో, రాకుండా చూడడం అంత సులభంగా ఉంటుంది.

Are The Oils That Can Help You Get Smooth Hair

అదృష్టవశాత్తు ఇలాంటి అనారోగ్యకరమైన జుట్టుని ఆరోగ్యంగా చేయడానికి అనేకరకాల సులువైన పద్దతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకించబడిన నూనెల ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇవి మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండి చిక్కుతో కూడుకున్న జుట్టును నెమ్మదిగా సిల్కీగా మరియు ఆరోగ్యంగా చేయడంలో భాద్యతను తీసుకుంటాయి.

ఈ జుట్టుకు ప్రత్యేకించబడిన నూనెల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

ఆర్గాన్ నూనె:

ఆర్గాన్ నూనె:

ఇది ఒక లీవ్ - ఇన్ కండిషనర్ గా కూడా పని చేస్తుంది. తద్వారా జుట్టును సున్నితంగా ఆరోగ్యకరంగా మార్చగలదు. కొద్దిగా తడిగా ఉన్న జుట్టుపై ఈ నూనెని అప్లై చేసి, ఒకరోజు ఉంచి స్నానం చేయాలి. ఈ పద్దతి వారంలో రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలను చూడవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో అధికమైన కొవ్వు పదార్ధాలు ఉండడం మూలంగా జుట్టుకు మంచి పోషకాలను అందించగలదు. కావున రోజులో 40-50 సెకండ్లు మర్ధనలాగా జుట్టుకు దట్టించి ఒక రాత్రి అలాగే ఉంచి ఉదయం లేచాక స్నానం చేయాలి. ఇలా వారంలో 2-3 సార్లు చేయడం మూలంగా మంచి ఫలితాలను పొందవచ్చు.

అవకాడో నూనె:

అవకాడో నూనె:

ఇందులో అనేకరకాల అనామ్ల జనకాలు ఉన్న కారణంగా మంచి పోషకాలను జుట్టుకు అందివ్వగలదు. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో, కొన్ని చుక్కల అవకాడో నూనెని కలిపి మర్ధన చేసి రాత్రంతా ఉంచి, ఉదయం లేచి స్నానం చేయాలి. వారంలో 2-3 సార్లు చేయడం మూలంగా మంచి ఫలితాలను పొందవచ్చు.

జూజూబా నూనె:

జూజూబా నూనె:

చాలమందికి తెలియని నూనె ఇది. కానీ జుట్టును స్మూత్ గా ఉంచుటలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీ కండిషనర్ తో జూజూబా నూనె కొన్ని చుక్కలను కలపడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ వారంలో రెండు సార్లు కనీసం చేయడం వలన జుట్టుకి మంచి పోషణను ఇవ్వగలదు.

బాదం నూనె:

బాదం నూనె:

కాస్త ఖరీదు ఎక్కువైనా, జుట్టుకి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. జుట్టుకు సరైన పోషణ ఇవ్వడంతో పాటు సిల్కీగా ఉండునట్లు చూడడంలో ఎంతో సహాయం చేస్తుంది .

ఈ బాదం నూనెతో 2-3 గంటల మర్ధనం చేసి, స్నానంచేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. వారంలో కనీసం రెండు సార్లు చేయడం సూచించబడినది.

రోస్మెరీ నూనె:

రోస్మెరీ నూనె:

మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగిన ఈ నూనె, జుట్టును స్మూత్ గా సిల్కీ గా చేసే మరొక ముఖ్యమైన నూనెగా చెప్పబడింది. ఒక స్పూన్ కొబ్బరినూనెలో 4-5 చుక్కల రోస్మెరీ నూనె కలిపి మర్ధన చేసి 40 నిమిషాల తర్వాత స్నానం చేయoడి. తద్వారా మీ జుట్టు సున్నితంగా మృధువుగా తయారవుతుంది.

ఆలివ్ నూనె:

ఆలివ్ నూనె:

ఆలివ్ నూనెలో కూడా అనేక పోషకాలతో కూడిన మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. కావున ఆలివ్ ఆయిల్ కూడా ప్రయత్నించవచ్చు. ఆలివ్ ఆయిల్ వంటల్లో కూడా వినియోగిస్తారు .

2-3 స్పూన్స్ ఆలివ్ నూనె తో జుట్టు అన్నిభాగాలకు విస్తరించునట్లుగా మర్ధన చేయాలి, 3-4 గంటల తర్వాత స్నానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. వారంలో రెండు సార్లు చెయ్యడం ద్వారా మీ జుట్టుని ఆరోగ్యకరంగా మలచుకోవచ్చు.

విటమిన్ – e నూనె :

విటమిన్ – e నూనె :

జుట్టుకు పోషణనిచ్చే నూనెలలో విటమిన్ - e నూనె చాలా ముఖ్యమైనది. విటమిన్ - e జుట్టు ఎదుగుదలకు ఆరోగ్యానికి సూచించబడినది.

2 స్పూన్స్ విటమిన్ - e తో మసాజ్ చేసి రాత్రంతా ఉంచి ఉదయం లేచి స్నానం చేయడం ద్వారా అధ్బుతమైన ఫలితాలను పొందవచ్చు. వారంలో రెండు మూడు సార్లు చేయడం మంచిది.

English summary

Here Are The Oils That Can Help You Get Smooth Hair

Having a smooth hair is a dream of every girl. From now on there's no more heading to the parlor to get that smooth hair, as you can get smooth and silky hair just by using some of the best natural ingredients. Start using argan oil, coconut oil, almond oil, etc., that can actually help your hair become smooth.
Story first published:Friday, March 30, 2018, 18:09 [IST]
Desktop Bottom Promotion