For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోలీకి ముందు మరియు తర్వాత మీ జుట్టు సంరక్షణ

|

హోలీ రాబోతోంది; మనలో చాలామందికి ఆ పండగ జరుపుకోవాలని ఉత్సాహంగా ఉంది, కానీ మన చర్మం, జుట్టుపై దాని ప్రభావాల గురించి చింత కూడా ఉన్నది. ఇలా ఆలోచించటం సహజమే, ఎందుకంటే రంగుల్లో వాడే రసాయనాలు నిజానికి చాలా హానికరమైనవే.

ఈ రంగులు మనం స్నానం చేసాక కూడా చాలా సమయం పాటు ఉండేటట్లుగా ఉన్నాయి. దీనివలన మనం మన శరీరాన్ని తలను మామూలు కన్నా ఎక్కువగా, శ్రద్ధగా స్నానం చేస్తాం, అలా చేయటం వలన శరీరం, తలపై ఉండే సహజనూనెలన్నీ తొలగిపోయి,పొడిబారిపోతాయి. ఇవి మరిన్ని సమస్యలకి దారితీస్తాయి.

pre holi hair care | post holi hair care | tips to take care of hair during holi

అందుకని, మేము మీరు హోలీకి ముందు మరియు తర్వాత మీ జుట్టు గురించి చింతించకుండా కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.

హోలీ అనేది రంగులు, రుచికర ఆహారం మరియు అందరూ కలిసిమెలసి చేసుకునే పండగ. ఈ అనుభవాన్ని మీరు అలానే పొందాలి. మా చిట్కాలతో మీ చర్మం, జుట్టు బావుంటాయని మీరు నమ్మవచ్చు. ఏమైనా, మనకి కూడా ఆ రంగులు శాశ్వతంగా మన ముఖాలపై ఉండిపోవాలని ఉండదుగా, కదూ?

మరో మంచి చిట్కా, మనం శాశ్వతమైన రసాయనిక రంగులకి దూరంగా ఉండాలి. రసాయన రంగులకి బదులు హెర్బల్ పౌడర్లు వాడండి.

హోలీకి ముందు మరియు తర్వాత మీ జుట్టుకోసం కొన్ని చిట్కాలు ఇవిగో.

1.నూనెతో మసాజ్

1.నూనెతో మసాజ్

మీ జుట్టు కుదుళ్ళను మీకిష్టమైన ఏ నూనెతో అయినా మసాజ్ చేయండి. అంటే అది కొబ్బరి,బాదం లేదా ఆలివ్ నూనె ఏదైనా సరే, మీరు హోలీ ఆడటానికి వెళ్ళేముందు మాత్రం మసాజ్ చేయండి. మీ జుట్టులోని ప్రతి పాయకి నూనె పట్టేట్లా చూడండి, అలా అవి సంరక్షించబడతాయి. హానికారక రసాయనాలనుండి జుట్టు పాడవకుండా మరియు కుదుళ్ళకి పోషణ అందేలా ఈ నూనెలు చేస్తాయి.

3.కుదుళ్ళను సంరక్షించండి

3.కుదుళ్ళను సంరక్షించండి

కుదుళ్ళ వద్ద ఇంకోసారి దట్టంగా నూనె రాయండి, లేదా మీరు కుదుళ్ళ కోసం హెయిర్ క్రీం కూడా వాడవచ్చు. ఇది నూనెతో మీ తలని మసాజ్ చేసేముందు రాయాలి. జుట్టు కుదుళ్ళు పొడిబారకుండా, వాటికి అదనపు శ్రద్ధ చూపించటం అవసరం.

ముడిపెట్టుకోండి

ముడిపెట్టుకోండి

జుట్టు పైకి ముడి పెట్టుకోవడం వలన నీటుగా తల పైన మొత్తం జుట్టు ఉంటుంది మరియు రంగులు కేవలం కన్పించే చోట్ల మాత్రమే అంటుకుంటాయి. ముడిగా పెట్టిన జుట్టుకి రంగుల వలన హాని కలగదు. జుట్టు విరబోసుకుని ఉండటంవలన హోలీ ఆడేటప్పుడు జుట్టు తగిలి,లాగబడి, బలహీనం అవుతాయి.

మీ జుట్టును కవర్ చేసుకోండి

మీ జుట్టును కవర్ చేసుకోండి

ఇవన్నీ చేసాక కూడా, మీ జుట్టుపై రంగుల ప్రభావం ఉండి తీరుతుంది, ఎందుకంటే, మనకు తెలిసిందే, రసాయనాలు మంచివి కావు. ప్రభావం ఇదివరకు కన్నా తక్కువే ఉన్నా, ఎంతో కొంత నష్టం అయితే ఉంటుంది. మీ జుట్టుపై ఆ చెడ్డ ప్రభావాలన్నీ పడేముందే జుట్టును స్కార్ఫ్ తో కవర్ చేయండి, మరియు ముడిగా కానీ పెట్టుకోండి.

షాంపూ తలస్నానం చేసేముందు

షాంపూ తలస్నానం చేసేముందు

షాంపూ వాడటానికి ముందు, ఆ రంగులన్నీ పోవటానికి ముందు జుట్టును నీరుతో కడగండి. ఈ రంగులని అలానే ఉంచేసి నేరుగా షాంపూతో కడిగితే, మీ జుట్టు చిక్కుపడిపోయి, మరింతగా ఊడిపోవచ్చు.

నిమ్మరసం వాడండి

నిమ్మరసం వాడండి

తలస్నానం చేసాక మరియు జుట్టును ఆరబెట్టే ముందుగా నిమ్మరసాన్ని జుట్టు కుదుళ్లకి రాయండి. దీనివలన మీ తల చర్మంపై పిహెచ్ సంతులనం తిరిగి వస్తుంది. హోలీ రంగులు మీ జుట్టు కుదుళ్లను మరీ క్షారస్థితిలోకి మార్చేస్తాయి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ తల చర్మంపై పిహెచ్ సంతులనాన్ని తిరిగి తేవడంలో పాత్ర పోషిస్తుంది. కానీ ఇలా రాసుకున్నాక ఎండలోకి మాత్రం వెళ్లవద్దు, లేకపోతే నిమ్మరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ కాబట్టి మీ జుట్టును పాడుచేసేస్తుంది.

నూనె

నూనె

మీ తల ఆరగానే, మరొక్కసారి జుట్టుకు నూనె రాయంది. ఇలా చేయటం వలన మీ వెంట్రుకలకి తేమ అందుతుంది. హోలీ రంగుల వలన మీ జుట్టు అంతా పొడిబారుతుంది. నూనె రాయటం వలన మీ జుట్టు కుదుళ్ళు, వెంట్రుకలకి పోషణ లభిస్తుంది. మీరు ఏ నూనైనా వాడవచ్చు, కానీ మేము ఇచ్చే సలహా మీరు ఆముదం మరియు కొబ్బరి నూనెల మిశ్రమాన్ని వాడండి.ఎందుకంటే ఈ నూనెలు లోపలివరకూ ఇంకుతాయి. ఆముదం నూనె చాలా జిడ్డుగా ఉంటుంది అందుకని దాన్ని ఒకదాన్ని వాడకుండా ఇంకో నూనెతో కలిపి వాడండి.

English summary

pre holi hair care | post holi hair care | tips to take care of hair during holi

Holi is a festival of colours, food and mingling together, and we wish to make your experience just that. With our tips, you can be sure that your skin and hair will be fine. After all, we don't really want those colours on our faces either, do we? So, do oil massage, tie a bun, cover your hair, use lemon juice to protect your hair!
Desktop Bottom Promotion