For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ హెయిర్ ప్రాబ్లెమ్స్ ని తగ్గించే సులభమైన విధానాలు

సాధారణ హెయిర్ ప్రాబ్లెమ్స్ ని తగ్గించే సులభమైన విధానాలు

|

నిర్జీవమైన అలాగే ఫ్రిజ్జీ హెయిర్, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ లాస్ వంటి సాధారణ హెయిర్ కేర్ సమస్యలకు పరిష్కారాన్ని వెతికీ వెతికీ అలసిపోయారా? ఈ సమస్యల నుంచి విముక్తి పొందలేకపోతున్నారా? అయితే, దిగులు చెందకండి. అటువంటి కొన్ని సాధారణ సమస్యలకు ఇక్కడ చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నాము. ఈ రెమెడీస్ ను పాటించి ప్రయోజనం పొందండి.

పైన పేర్కొనబడిన సాధారణ హెయిర్ కేర్ ప్రాబ్లెమ్స్ అనేవి పొల్యూషన్, లైఫ్ స్టైల్స్, యూవీ రేస్, ప్రోటీన్ లోపం వంటి ఫ్యాక్టర్స్ వలన తలెత్తే సమస్యలు.

Simple Ways To Treat Common Hair Care Problems

అసలు విషయంలోకి వస్తే, ఈ కామన్ హెయిర్ కేర్ ఇష్యూస్ గురించి వాటిని నేచురల్ రెమెడీస్ తో డీల్ చేసే విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. డాండ్రఫ్:

1. డాండ్రఫ్:

కావలసిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ మెంతి పొడి

3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

నిమ్మలో లభించే విటమిన్ సి అనేది స్కాల్ప్ లోని పీ హెచ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడానికి డాండ్రఫ్ పై పోరాడడానికి తోడ్పడుతుంది. మెంతిపొడి అనేది స్కాల్ప్ ను చల్లబరచి స్కాల్ప్ పై పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించడానికి సహాయకారిగా ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి?

మొదటగా, కొన్ని మెంతిగింజలను తీసుకుని బ్లెండ్ చేసి పౌడర్ ని తయారుచేసుకోండి. మెంతిపొడిని నిమ్మరసంతో కలిపి పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను స్కాల్ప్ పై అప్లై చేయండి. 20 నుంచి 25 నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత రెగ్యులర్ షాంపూతో వాష్ చేసుకోండి. ఈ మాస్క్ ని రెగ్యులర్ గా వాడితే ఆశించిన ఫలితాన్ని పొందుతారు.

2. హెయిర్ ఫాల్:

2. హెయిర్ ఫాల్:

కావాల్సిన పదార్థాలు:

క్యాస్టర్ ఆయిల్

కొబ్బరి నూనె/ ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్

క్యాస్టర్ ఆయిల్ లో ఉండే విటమిన్ ఈ మరియు ఇతర ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెయిర్ గ్రోత్ ని పెంపొందించి హెయిర్ వాల్యూమ్ ను మెరుగుపరుస్తాయి.

ఎలా వాడాలి?

సమాన మోతాదులో క్యాస్టర్ ఆయిల్ మరియు మీకు నచ్చిన ఇతర ఆయిల్ ను తీసుకోవాలి. అలాగే కొన్ని చుక్కల రోజ్ మేరీ లేదా ల్యావండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించాలి. ఇవి పరిమళాన్ని అందిస్తాయి.

ఈ బ్లెండ్ ను హెయిర్ పై అలాగే స్కాల్ప్ పై అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచాలి. గంట తరువాత తేలికపాటి సల్ఫేట్ ఫ్రీ షాంపూతో వాష్ చేసుకోవాలి.

3. స్ప్లిట్ ఎండ్స్:

3. స్ప్లిట్ ఎండ్స్:

కావలసిన పదార్థాలు:

బాగా పండిన బొప్పాయి (సగం)

అర కప్పు పెరుగు

స్ప్లిట్ ఎండ్స్ సమస్యను తగ్గించే ఎసెన్షియల్ విటమిన్స్ మరియు మినరల్స్ బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి. రెగ్యులర్ గా ఈ రెమెడీను వాడటం వలన స్ప్లిట్ ఎండ్స్ సమస్య తొలగిపోవడంతో పాటు శిరోజాలు పట్టులా మృదువుగా మారతాయి.

ఎలా వాడాలి?

బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి బ్లెండ్ చేసుకుని మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఇప్పుడు పెరుగును జోడించాలి. ఈ రెండిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ మరియు స్కాల్ప్ పై అప్లై చేసి 45 నుంచి 50 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. షవర్ క్యాప్ తో హెయిర్ ను కవర్ చేయండి. ఆ తరువాత నార్మల్ వాటర్ మరియు షాంపూతో హెయిర్ ను రిన్స్ చేయండి.

 4. ఫ్రిజ్జీ హెయిర్:

4. ఫ్రిజ్జీ హెయిర్:

కావలసిన పదార్థాలు:

అర కప్పు పచ్చి పాలు

1 నుంచి 2 టేబుల్ స్పూన్ల తేనే

శిరోజాలను దృఢంగా చేసే గుణాలు పాలలో కలవు. డీప్ కండిషనర్ గా పాలు వ్యవహరిస్తాయి. తేనె అనేది శిరోజాలలోమాయిశ్చర్ ని నిలిపివేసి హెయిర్ ను మృదువుగా అలాగే సిల్కీగా మారుస్తుంది.

ఎలా వాడాలి?

పచ్చి పాలను అలాగే ఆర్గానిక్ తేనెను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేయండి. ఇందుకోసం, హెయిర్ ను సెక్షన్స్ గా విడదీయండి. 20 నిమిషాల పాటు హెయిర్ పై ఈ మిశ్రమాన్ని ఉంచండి. 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఈ ప్రాసెస్ ని వారానికి ఒకసారి పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.

5. గ్రే హెయిర్:

5. గ్రే హెయిర్:

కావలసిన పదార్థాలు:

కొబ్బరి నూనె

ఉసిరి పొడి

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది గ్రే హెయిర్ సమస్యను వీలైనంత వాయిదా వేస్తుంది. అందువలన ఇది అనేక రెడీ మేడ్ హెయిర్ డైలలో ముఖ్య పదార్థంగా ప్రముఖ స్థానం పొందింది.

ఎలా వాడాలి?

ఉసిరిపొడిని అలాగే కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని ప్యాన్ పై మరిగే వరకు వేడిచేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అలాగే స్కాల్ప్ పై అప్లై చేసి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. శిరోజాల పొడవును బట్టి ఈ నిడివి ఆధారపడి ఉంటుంది.

English summary

Simple Ways To Treat Common Hair Care Problems

Dull and frizzy hair, dandruff, split ends, hair loss etc., are some of the common hair care concerns. Problems like these can occur due to certain factors like pollution, lifestyles, UV rays of the sun, lack of proper protein intake, etc. Therefore, it's important to control them with some home remedies. Ingredients like lemon, honey, papaya can help with these.
Desktop Bottom Promotion