For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్సర్ వ్యాధికి గురైన “సోనాలిబింద్రే” ను చూసారా : కీమోథెరపీ హెయిర్ లాస్ టిప్స్ గురించి తెలుసుకోండి

కాన్సర్ వ్యాధికి గురైన “సోనాలిబింద్రే” ను చూసారా : కీమోథెరపీ హెయిర్ లాస్ టిప్స్ గురించి తెలుసుకోండి

|

కాన్సర్ వ్యాధికి గురై, చికిత్స తీసుకుంటూ ఈ మద్యనే తన వ్యాధి గురించిన వివరాలను బయటపెట్టి, అభిమానులను హుతాశయుల్ని చేసింది సోనాలి బింద్రే. బొంబాయి సినిమాతో సౌత్ లో అడుగు పెట్టిన సోనాలి బింద్రే అనతికాలంలోనే ఇంద్ర, మురారి, శంకర్ దాదా, ఖడ్గం, మన్మదుడు వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొంది, నేడు కాన్సర్ వ్యాధితో భాదపడడం యావత్ సినీ ప్రేక్షక లోకం జీర్ణించుకోలేని వార్తగా మారింది.

ఆ క్రమంలో భాగంగానే సోనాలి బింద్రే ఈ మద్యనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కీమోథెరపీలో భాగంగా తన జుట్టు కత్తిరించుకుంటున్న వీడియో పోస్టు చేసింది. న్యూ చిక్ లుక్ లో కనిపించిన సోనాలీ, ఎంత కష్టాన్ని లోలోపల భరిస్తున్నా అభిమానులకు మాత్రం నవ్వునే పంచింది.

 Sonali Bendres New Look : Chemotherapy Hair Loss Tips

ఆమె తన క్రొత్త రూపంలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి, తన పరిస్థితిని అధిగమించడంలో సహాయం చేసే “అనేకమంది కాన్సర్ విజేతల కథల”ను పంచుకుంటున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. మరియు ఆమె తన హెయిర్ స్టైలిస్ట్ “టోమోహిరో అరాకవా” గురించి తన పోస్ట్లో పేర్కొన్నారు మరియు, "లాంగ్ హెయిర్ నుండి చిక్ లుక్ వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు" అని తెలిపింది.

కీమోథెరపీ యొక్క దారుణమైన దుష్ప్రభావాలలో జుట్టు నష్టం కూడా ఒకటి మనకు ఇది వరకే తెలుసు. సోనాలిబింద్రే కూడా కీమో థెరపీ కారణంగా ఈపరిస్థితికి గురికాక తప్పలేదు. కీమో థెరపీ చేయించుకునే వారు, జుట్టు నష్టం నివారణా చర్యలలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం.

నేడు, ఈ వ్యాసంలో, మీ జుట్టుపై శ్రద్ధ వహించడానికి ఎటువంటి చిట్కాలను అనుసరించాలో చర్చించబోతున్నాము. ఈ కీమో థెరపీ సెషన్ పూర్తైన తర్వాత, తిరిగి జుట్టు పెరగడం ప్రారంభించబడుతుంది. కానీ ఈలోపు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

మీ జుట్టుపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి:

మీ జుట్టుపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి:

కీమో థెరపీలో భాగంగా మీరు జుట్టు నష్టాన్ని అనుభవిస్తున్నందున, మరింత నష్టం నుండి బయటపడడానికి జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. కావున ఎక్కువ రసాయనిక షాంపూలను, కండీషనర్లను, హెయిర్ క్రీమ్స్, మొదలైన వాటిని ఉపయోగించకుండా ఉండుటకు ప్రయత్నించండి, ఇవి సాలిసిలిక్ ఆమ్లాలను, మరియు ఆల్కహాల్ కలిగి ఉంటాయి. మరియు మీ జుట్టు అలంకరణలో భాగంగా ఉపయోగించే వేడి తత్వాలు కలిగిన హెయిర్ డ్రైయర్స్, జుట్టుని నిటారుగా ఉంచే స్ట్రైటనర్స్, కర్లర్స్ వంటి వినియోగానికి దూరంగా ఉండడమే మేలు. మరియు బ్లోడ్రయర్ వాడకుండా, సహజ ప్రక్రియలోనే జుట్టుని ఆరనివ్వండి.

మీ జుట్టును చిన్నదిగా కత్తిరించండి:

మీ జుట్టును చిన్నదిగా కత్తిరించండి:

మీ పొడవాటి జుట్టును లూస్ హెయిర్ వలె వదిలేయడానికి బదులుగా, మీ జుట్టుకు చిన్నదిగా చాప్ చేయండి. సోనాలి బింద్రే కూడా అదే చేసింది. చిన్న జుట్టు చాలా మందంగా కనిపిస్తుంది. అదే పొడవాటి జుట్టు కలిగి ఉన్న ఎడల పల్చగా కనపడడమే కాకుండా ఆత్మన్యూనతకు దారితీస్తుంది. చిన్న జుట్టు కలిగి ఉండడం వలన మరొక ప్రయోజనం కూడా ఉంది, జుట్టు పతనం అనేది చిన్న జుట్టులో తక్కువగా గుర్తించబడుతుంది. కావున షార్ట్ హెయిర్ ఉండడం మంచిదే.

ఒక హెడ్-కవర్ ట్రై చేయండి:

ఒక హెడ్-కవర్ ట్రై చేయండి:

ఒకవేళ మీరు మీ తలను విగ్ లేదా నకిలీ జుట్టుతో కవర్ చేయడానికి ఇష్టపడుతున్న ఎడల, నిస్సందేహంగా, నిస్సంకోచంగా వెళ్ళవచ్చు. స్కాఫ్ వినియోగించడం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నిజానికి స్కాఫ్ వినియోగంలో అనేక అలంకరణలు ఉన్నాయి, క్రమంగా మీరు అనేక మార్గాలలో మేకప్ చేసుకునే వీలుంటుంది కూడా. మీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గం ఎన్నుకోండి.

మీ మిగిలిన జుట్టును జాగ్రత్తగా చూసుకోండి:

మీ మిగిలిన జుట్టును జాగ్రత్తగా చూసుకోండి:

మీరు మీ జుట్టును కోల్పోకముందే, మిగిలిన జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు చెప్పినట్లుగా, మీ జుట్టుతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎక్కువగా మీ జుట్టుతో పనులు చేయడం చేయకండి. మీ జుట్టును సున్నితంగా బ్రష్ చేసి, ఆపై జాగ్రత్తగా శుభ్రపరచవలసి ఉంటుంది.

 మీ తల చర్మాన్ని(స్కాల్ప్) రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోండి:

మీ తల చర్మాన్ని(స్కాల్ప్) రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోండి:

మీరు సూర్యుడికి నేరుగా మీ తలని బహిర్గతం చేస్తే, అది మీ చర్మానికి ఎక్కువ నష్టం కలిగించవచ్చు. తీవ్రమైన సూర్యరశ్మి పాటు, తీవ్రమైన చలి కూడా మీ చర్మాన్ని ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే మీరు కీమోథెరపీ చేయించుకుంటున్న దశలో ఈ ప్రాంతం మరింత సున్నితoగా మారుతుంది. ముందు చెప్పినట్లుగా మీ తలను కప్పి ఉంచడం ద్వారా మీరు జాగ్రత్త తీసుకోవచ్చు.

చికిత్స సమయంలో మీ తలని క్లీన్ షేవ్ చేసుకోండి:

చికిత్స సమయంలో మీ తలని క్లీన్ షేవ్ చేసుకోండి:

ఒక్కోసారి తీవ్రమైన జుట్టునష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి, అటువంటి సమయాల్లో వీలయితే మీ తలను షేవ్ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడింది. క్రమంగా ఎటువంటి అసౌకర్యానికి కూడా లోనుకాకుండా ఉండవచ్చు. కొందరికి తల భాగాన దురదగా అనిపించడం జరుగుతుంది. ఈ సమయాల్లో తలను నున్నగా షేవ్ చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మరియు జుట్టు నష్టం వంటి సమస్యలు బయట పడకుండా కూడా ఈ పద్దతి సహాయం చేస్తుంది.

ముఖ్యంగా ఈ సమయంలో మనోనిబ్బరం, ధైర్యం అత్యవసరమైనవిగా ఉంటాయి. నేటి కాలంలో పసిపిల్లలతో సహా ఈ కాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. వైద్యం అందని ద్రాక్ష పండు చందాన ఉండడం కారణంగా అనేక మంది పేదలు వైద్యానికి నోచుకోక ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. జుట్టు పొతే మళ్ళీ వస్తుంది, ప్రాణం పోతే తిరిగి రాదు. కావున కొంతకాలం చికిత్సకు పూర్తిగా సహకరించే క్రమంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, ఆహార, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Sonali Bendre's New Look : Chemotherapy Hair Loss Tips

After being diagnosed with high-grade cancer and announcing about her illness a few days ago via social media, Bollywood actress Sonali Bendre is giving us lessons on how to deal with it. She posted a recent picture of her new hairstyle. The hair loss during chemotherapy can be dealt with some simple tips like covering your hair, protecting it from heat, etc.
Story first published:Thursday, July 12, 2018, 17:54 [IST]
Desktop Bottom Promotion