Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
మాడుపై చుండ్రును తొలగించడానికి, బేకింగ్ సోడాను ఉపయోగించే వివిధ పద్ధతులు.
మాడుపై చుండ్రును తొలగించడానికి, బేకింగ్ సోడాను ఉపయోగించే వివిధ పద్ధతులు.
చుండ్రు అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే, ఒక సాధారణ సమస్య. పొడిబారి, పొలుసులుగా మారిన చర్మం చుండ్రు ఏర్పడటానికి దారితీస్తుంది. ప్రారంభ దశలలో చుండ్రు నివారణకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, జుట్టు రాలడం, మాడుపై దురద మరియు అంటువ్యాధులు సోకడం వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయినా కాని, మీరు చింతించాల్సిన అవసరం లేదు. దీనికి సులభమైన పరిష్కారం సహజ పదార్ధం రూపంలో మన వంటగదిలోనే ఉంది. అది వేరేదో కాదు.. బేకింగ్ సోడా ...
బేకింగ్ సోడాను కేశసంరక్షణ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీసెప్టిక్ లక్షణాలు, చుండ్రును కలిగించే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది మాడు మీద చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడి, సహజ తేమను నిలబెట్టడంలో సహాయపడుతుంది.

ఈ రోజు మనం, చుండ్రును నివారణకు, బేకింగ్ సోడాను ఇతర పదార్ధాలతో కలిపి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. చదవండి!

1. నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం
1 టీ స్పూన్ బేకింగ్ సోడా
వాడే విధానం:
1. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం కలిపి పేస్టు చేయండి.
2. నెమ్మదిగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించి, మాడుపై మర్దన చేసుకుని, కొన్ని నిముషాల పాటు వదిలివేయండి.
3. కొన్ని నిముషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. బేకింగ్ సోడా మరియు ఆపిల్ సైడర్ వెనిగర్
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా
2-3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్
వాడే విధానం:
1. పదార్ధాలనన్నింటిని చక్కగా కలపండి.
2. దానిపై మాడుపై శుభ్రంగా రాసుకుని చేసి, 5-10 నిముషాల పాటు వదిలివేయండి.
3. తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బేకింగ్ సోడా మరియు ఆలివ్ ఆయిల్
కావలసిన పదార్థాలు
1 స్పూన్ బేకింగ్ సోడా
1 గుడ్డు పచ్చసొన
1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
వాడే విధానం:
1. నూనె వేడి చేసి, గుడ్డు పచ్చసొనతో కలపండి.
2. ఇప్పుడు దీనిలో బేకింగ్ సోడాను వేసి అన్ని పదార్ధాలను ఉండలు ఏర్పడకుండా బాగా కలపాలి.
3. ఇప్పుడు దీనిని మీ మాడుకు రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వండి.
4. తరువాత చల్లటి నీటితో శుభ్రంగా కడగండి.
5. ఉత్తమ ఫలితాల కొరకు వారానికి ఒకసారి ఇలా చేయండి.

4. బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనె
కావలసిన పదార్థాలు:
1 స్పూన్ బేకింగ్ సోడా
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
1 టేబుల్ స్పూన్ తేనె
వాడే విధానం:
1. కొబ్బరి నూనెలో తేనె, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
2. మీ తలపై, ఈ మిశ్రమాన్ని రాసుకుని, 20-30 నిముషాల పాటు ఆరనీయండి.
3. తరువాత సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోండి.
4. మంచి ఫలితాల కొరకు, ఈ మాస్కును వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఈ నివారణలు త్వరగా ఫలితం చూపించవు. ఫలితం పొందటానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల, మీరు తేడాను గమనించే వరకు, ఈ నివారణలను క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది.
బేకింగ్ సోడా క్షార లక్షణాలను కలిగి ఉన్నందువల్ల, మొదటిసారు ఉపయోగించినపుడు, మీ జుట్టు చూడటానికి అందంగా కనిపించకపోవచ్చు. అయితే, కొన్ని పర్యాయాలు వాడిన తరువాత, మీ జుట్టు ఆరోగ్యకరంగా కనిపిస్తుంది కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.



Click it and Unblock the Notifications