For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ముఖాకృతికి తగినట్లుగా జుట్టు పాపిటి తీసుకుంటున్నారా ?

|

మీరు మీ జుట్టు పట్ల సరైన శ్రద్ధ తీసుకునే వారైతే, మీ జుట్టుకు స్టైలింగ్ చేసుకునే విధానం, మీ పూర్తి స్టైలింగ్ మీద ప్రధాన పాత్రను పోషిస్తుందన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఇక జుట్టు స్టైలింగ్ విషయానికి వస్తే, మీరు మీ జుట్టుకు పాపిటిని తీసే విధానం మీద మీ పూర్తి మేకప్ ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం స్టైలింగ్లో అననుకూల మార్పులు చోటు చేసుకున్నా, అది పూర్తి లుక్ మేడా ప్రభావాన్ని చూపిస్తుంది.

కానీ మనలో అనేకమంది తమ జుట్టుకు పాపిట తీసే విధానం గురించి ఎక్కువగా ఆలోచించరు. క్రమంగా కొన్ని మేకప్ సరళులను అనుసరించి, అవి విఫలమయ్యాక భాదపడుతూ ఉంటారు. కావున ముఖాకృతిని అనుసరించి మీరు ఎన్నుకున్న జుట్టు పాపిటి, మీ మేకప్ పరిపూర్ణతకు ఎంతగానో దోహదపడుతుందని గుర్తుంచుకోండి. మీ లుక్ మరియు స్టైల్ అనేది హెయిర్ స్టైలింగ్ అనుసరించే విధానం మీద, మరియు ఎన్నుకునే పాపిటి మీద సూచనప్రాయంగా ఆధారపడి ఉటుంది.

Face Shape

మీరు సైడ్ పార్ట్, డీప్ సైడ్ పార్ట్ లేదా మిడిల్ పార్ట్ రకాలలో, ఏది మీ ముఖానికి నప్పుతుందో ప్రధానంగా తెలుసుకోవలసి ఉంటుంది. మరియు మీరు వేర్వేరు హెయిర్ కట్స్ మరియు కేశాలంకరణ సంబంధించిన ప్రయోగాలను అనుసరించాలని భావిస్తున్న ఎడల, మీకంటూ ఫైనల్ రిజల్ట్ మీద ఒక అవగాహన ఉండాలి. కానీ అది తెలుసుకోవడం ఎలా అంటే, మీ జుట్టును పాపిటి తీసే విధానం గురించిన అవగాహన కలిగి ఉండడమే అన్నిటికన్నా ముఖ్యంగా సూచించబడుతుంది.

ఈ వ్యాసంలో మనం విభిన్న ముఖాకృతుల మీద ఆధారపడి, జుట్టును స్టైలింగ్ చేసే విధానం, మరియు పాపిటిని అనుసరించే విధానం గురించిన వివరాలను తెలుసుకుందాం. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

1. గుండ్రటి ముఖాకృతి - లాంగ్ బాంగ్స్ తో కూడిన “డీప్ సైడ్ పార్టింగ్”

1. గుండ్రటి ముఖాకృతి - లాంగ్ బాంగ్స్ తో కూడిన “డీప్ సైడ్ పార్టింగ్”

Instagram

గుండ్రటి ముఖానికి కాస్త చిత్రమైన స్టైలింగ్ విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. గుండ్రటి ముఖాన్ని కలిగి ఉన్నవారు, మీ జుట్టు స్టైలింగ్లో కొద్దిపాటి మార్పులను అనుసరించిన ఎడల, మీ మొత్తం లుక్ మరియు స్టైల్ పరంగా ఉన్నతంగా కనిపించేలా చేయవచ్చు. లేనిచో ముఖం పెద్దదిగా కనిపిస్తూ, మీ రూపకం మీద ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు.

ఈ సమస్యను ఎదుర్కొనడానికి, మీ జుట్టుకు డీప్ సైడ్ పార్టింగ్ అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. మీ కనుబొమ్మ యొక్క వంపుకు వ్యతిరేక దిశలో, చెవులకు దగ్గరగా పాపిటిని తీయవలసి ఉంటుంది.

మీ ముఖానికి ఒక చక్కటి రూపాన్ని ఇవ్వడం కొరకు, వదులైన పొడవాటి జుట్టును అనుసరించడం ఉత్తమ ఎంపికగా ఉంటుంది. మీరు ఏవైపు నుండైనా ఈ "డీప్ సైడ్ పార్ట్" ను అనుసరించవచ్చు. మీ ఆలోచనలకు తగినట్లుగా ఎన్నుకోవడం ద్వారా, మీ గురించి మీరు మెరుగ్గా ఉన్నట్లు భావించగలుగుతారు.

కొన్ని సందర్భాలలో, గుండ్రటి ముఖం తక్కువగా ఉన్న పక్షంలో, మద్య పాపిటిని అనుసరించి జుట్టును వదిలేయడమే ఉత్తమంగా సూచించబడుతుంది. రెండు వైపులా మీ ముఖాన్ని కొద్దిగా కప్పి ఉంచేలా కూడా ఈ విధానం పనిచేస్తుంది. క్రమంగా ఈ అనుసరణ, మీముఖం స్లిమ్ గా మరియు పొడవుగా కనిపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా డీప్ సైడ్ పార్టెడ్ తో పాటుగా, లాంగ్ హెయిర్ బాంగ్స్ అనుసరించడం కూడా ఉత్తమంగా సూచించబడుతుంది.

2. దీర్ఘవృత్తాకార ముఖాకృతి (ఒవెల్ షేప్) - ఎటువంటి పాపిటినైనా అనుసరించవచ్చు.

2. దీర్ఘవృత్తాకార ముఖాకృతి (ఒవెల్ షేప్) - ఎటువంటి పాపిటినైనా అనుసరించవచ్చు.

Instagram

వివిధ రకాల హెయిర్ పార్టింగ్స్ అనుసరించడానికి, సరైన ముఖాకృతిగా ఈ ఒవెల్ షేప్ ఉంటుంది. అండాకృతిలో ముఖం ఉన్న వారు తమ జుట్టును ఏవిధంగా అయినా సరే, పార్టింగ్ చేసుకోవచ్చు. అనగా, సైడ్ పార్టింగ్, డీప్ సైడ్ పార్టింగ్, లేదా మిడిల్ పార్టింగ్.

ఇక, మీరు ఒక ఒవెల్ షేప్ ముఖాన్ని కలిగి ఉంటే, మీరు వివిధ స్టైలింగ్ పద్దతులను మరియు హెయిర్ కట్స్ అనుసరించవచ్చు. మీకు పొడవాటి జుట్టు ఉన్నా, షార్ట్ లేదా మీడియం జుట్టు ఉన్నా, మీకెటువంటి నష్టమూ లేదు. అంతేకాకుండా, మీరు ఎటువంటి స్టైలింగ్ విధానాలను అనుసరించినా, అది ట్రెండీగానే కనిపిస్తుంది. క్రమంగా ప్రశంసలను అందుకుంటారు.

3. చతురస్రాకారపు ముఖాకృతి - పక్క పాపిటి

3. చతురస్రాకారపు ముఖాకృతి - పక్క పాపిటి

Instagram

చతురస్రాకార ముఖాకృతి అంటే మీకు విశాలమైన మరియు దృఢమైన నుదురు, జా-లైన్ ఉంటాయి. గుండ్రటి ముఖం, సున్నితమైన అంశాలను కలిగి ఉండగా, చతురస్రాకార ముఖం పదునైన లక్షణాలను కలిగి ఉంటుంది.

అయినప్పటికీ, అనేకమంది తమ ముఖాకృతి పరంగా కొన్ని పదునైన లక్షణాలనే ఎక్కువగా కోరుకుంటారు. చతురస్రాకారపు ముఖం విషయంలో మీ జుట్టును స్టైలింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ ముఖాన్ని కాస్త మృదువుగా చేయడానికి, మరియు చతురస్రాకారపు ముఖం యొక్క వెడల్పును దాచిపెట్టడానికి, మీ నుదురును కూసింత కప్పి ఉంచేలా స్టైలింగ్ అనుసరిస్తూ, మీ జుట్టుకు పక్క పాపిటిని జోడించడం ఉత్తమంగా సూచించబడుతుంది. పక్క పాపిటి తీసిన జుట్టు మీ జా-లైన్ వెడల్పును కప్పిపుచ్చడానికి కూడా సహాయపడుతుంది. క్రమంగా మీ ముఖాకృతికి మంచి స్టైలింగ్ అందివ్వగలుగుతుంది.

4. డైమండ్ ఫేస్ - సైడ్ పార్టింగ్

4. డైమండ్ ఫేస్ - సైడ్ పార్టింగ్

Ajay Kadam

పదునైన జాలైన్ మరియు దృఢమైన ముఖాకృతి, మిగిలిన ఇతర ముఖాకృతులకంటే భిన్నంగా ఉండేలా చూస్తుంది. ఇక పాపిటి విషయానికి వస్తే, సైడ్ పార్టింగ్ డైమండ్ ముఖాకృతికి ఉత్తమంగా పనిచేస్తుంది.

సైడ్ పార్టెడ్ చేస్తూ, భుజాల మీదుగా జుట్టుని జారవిడిచిన ఎడల, జాలైన్ షార్ప్నెస్ తగ్గి, మృదువుగా కనిపించేందుకు దోహదపడుతుంది. మరియు సైడ్ పార్టింగ్ మీ నుదురును కప్పిపుచ్చడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ బ్యాంగ్స్ తో కూడిన సైడ్ పార్టింగ్ అనుసరించడం ద్వారా, మీ ఆకృతికి అదనపు ఆకర్షణ జోడించడానికి వీలవుతుంది. లూజ్ హెయిర్ స్టైలింగ్లో కర్ల్స్ ప్రయత్నించండి. అంతేకాకుండా లూస్ వేవ్స్ ఉండేలా చూసుకోండి.

ప్రత్యామ్నాయంగా, మీరు కొద్దిగా మిడిల్ పార్టింగ్ కూడా ఎంచుకోవచ్చు. ఇది రెండు వైపుల నుండి మీ నుదుటిని కప్పి మీ జా-లైన్ షార్ప్నెస్ తగ్గిస్తుంది.

5. ఆబ్లాంగ్-ఫేస్ - సెంటర్ పార్టింగ్

5. ఆబ్లాంగ్-ఫేస్ - సెంటర్ పార్టింగ్

Instagram

మీ మనసులో మెదిలే మొదటి ప్రశ్న, " ఆబ్లాంగ్-ఫేస్" అంటే ఏమిటి ? అవునా ? . నుదురు నుండి గడ్డం వరకు అదే వెడల్పుతో ఉన్న ఎడల, దానిని ఆబ్లాంగ్-ఫేస్ అని వ్యవహరించడం జరుగుతుంది.

మరి,ఈ ముఖాకృతికి స్టైలింగ్ సాధ్యమేనా అంటే, మద్య పాపిటిని అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. మీరు కనుక ఆబ్లాంగ్-ఫేస్ కలిగి ఉన్నట్లయితే మీ ఎంపికగా మిడిల్ పార్టింగ్ ఉండాలని గుర్తుంచుకోండి. ఈ ముఖాకృతి అరుదుగా కనిపిస్తుంటుంది.

ఇరువైపులా వెంట్రుకలతో కూడిన మధ్య పాపిటి, ముఖం పొడవును, అదేవిధంగా ముఖం పక్కభాగాలను కప్పి ఉంచేందుకు దోహదపడుతుంది. మీరు మీ లుక్లో అదనంగా మార్పులను జోడించడానికి, లాంగ్ బాంగ్స్ ప్రయత్నించవచ్చు.

6. హార్ట్ షేప్ ఫేస్ - సైడ్ పార్టింగ్

6. హార్ట్ షేప్ ఫేస్ - సైడ్ పార్టింగ్

The House Of Pixels

సైడ్ పార్టింగ్ సరిగ్గా నప్పగల మరొక ఉత్తమమైన ముఖాకృతి హార్ట్ షేప్ ఫేస్. హార్ట్ షేప్ ముఖాకృతి ఒక బలమైన జాలైన్ కలిగి ఉంటుంది. అందువల్ల, సైడ్ పార్టింగ్ దీనికి అద్భుతంగా పనిచేస్తుంది.

సైడ్ పార్టింగ్ మీ షార్ప్ ఫీచర్స్ తేలికపాటిగా కనిపించడానికి, మరియు మీ ముఖాకృతిని చదునుగా చేయడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా, మీ గడ్డం భాగం తక్కువగా కనిపించేలా చేస్తుంది. అదేవిధంగా మీరు డీప్ సైడ్ పార్టింగ్ కూడా ఎంచుకోవచ్చు, ఇది కూడా సైడ్ పార్టింగ్ వలనే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అది మీ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. మరియు మీరు ఎంచుకున్న స్టైలింగ్ పరంగా, మీ లుక్ ఎలివేట్ అవుతుంది.

అయితే, మీరు మీ నడుము క్రిందకు చేరేలా పొడవైన జుట్టును కలిగి ఉంటే, మీరు మద్య పాపిటిని అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. సైడ్ పార్టింగ్ షార్ట్, మీడియం మరియు లాంగ్ హెయిర్ సంబంధం లేకుండా ఉత్తమంగా పనిచేస్తుంది.

7. పియర్ షేప్ ముఖాకృతి : డీప్ సైడ్ పార్టింగ్

7. పియర్ షేప్ ముఖాకృతి : డీప్ సైడ్ పార్టింగ్

Instagram

ఒక పియర్ షేప్ ముఖాకృతి కలిగి ఉన్నవారు, విశాలమైన జాలైన్ మరియు సన్నటి హెయిర్ లైన్ కలిగి ఉంటారు. అందువల్ల, ఈ ముఖాకృతికి డీప్ లైన్ పార్టింగ్ అత్యుత్తమంగా సహాయపడగలదు. ఇది జాలైన్ వెడల్పును కప్పిపుచ్చడానికి సహాయపడుతుంది.

ఒక డీప్ సైడ్ పార్టింగ్, మీ జాలైన్ కప్పడానికే కాకుండా, మీ ముఖానికి సమతుల్యాన్ని అందించడంలో కూడా సహాయం చేస్తుంది. మీరు మీ జుట్టుకు ఏభాగంలో అయినా సైడ్ పార్టింగ్ అనుసరించవచ్చు. మీ జుట్టును, మీ చెవులకు దగ్గరగా, మరియు మీ జాలైన్ సమాంతరంగా నుదుటిపై ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. చివరన, మీ జుట్టును కర్ల్ చేసి, మీ జుట్టుకు కొంత వాల్యూం జోడించడం కొరకు, వాటిని కూసింత పైకి స్క్రోల్ చేయవలసి ఉంటుంది. క్రమంగా భారీ మార్పును గమనించగలరు. అంతేకాకుండా లాంగ్ హెయిర్ బాంగ్స్ అనుసరించడం కూడా, దీనికి అదనపు ఆకర్షణగా ఉండగలదు.

ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా, క్రమంగా మీ ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని స్టైలింగ్ అనుసరించేలా చర్యలు తీసుకోండి. ఒక్కోసారి ఎన్ని స్టైలింగ్ విధానాలను అనుసరించినా, చివరికి తప్పుడు రిజల్ట్స్ నే అందిస్తుంటాయి. కావున,హెయిర్ స్టైలింగ్ విధానాలను ఎన్నుకునే ముందుగా ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని పాపిటి తీయడం గురించిన ఆలోచన కలిగి ఉండడం ద్వారా సత్ఫలితాలను సాధించగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Choose The Right Hair Parting Based On Your Face Shape

While taking proper care of your hair is essential, the way you style your hair plays an important role in your overall appearance. And when it comes to styling the hair, the way you part your hair makes a huge difference. But what most of us don't give much thought about while parting our hair is the shape of our face. The way you should style your hair to complement your look and accentuate your features depends mainly on how you part your hair.
Story first published:Wednesday, May 22, 2019, 12:39 [IST]
Desktop Bottom Promotion