For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ శీతాకాలంలో చుండ్రును పోగొట్టే సూపర్ ఎఫెక్టివ్ టిప్స్

శీతాకాలంలో చుండ్రును పోగొట్టే సూపర్ ఎఫెక్టివ్ టిప్స్

|

అందం విషయంలో అనేక సమస్యలుంటాయి. వాటిలో ముఖ్యంగా జుట్టు సమస్యలు కూడా ఉంటాయి. కాలానికతీతంగా జుట్టు సమస్యలు కూడా పెరగవచ్చు. వేసవి వేడి వల్ల కొన్ని రకాల జుట్టు సమస్యలొస్తే, శీతాకాలంలో ఒకరకమైన సమస్యలు..జుట్టుపై తీవ్రప్రభావం చూపుతాయి. శీతాకాంలో జుట్టును మెయింటైన్ చేయడం ఒక సవాలు. ప్రధానంగా చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది. అందుకు తలలో దురద , తల నుండి పొట్టు వంటిది రాలడం ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుంది. వాతావరణం మరీ వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా జుట్టుపై ప్రభావం చూపుతుంది.

8 Simple And Effective Tips To Prevent Dandruff In Winter

వాతావరణం కారణంగా తల పొడిగా మారడం వల్ల తలలో చుండ్రు తీవ్రత పెరుగుతుంది. దాంతో తల నుండి పొట్టు వంటిది భుజాలపై రాలి నలుగురిలో నవ్వులపాలు చేస్తుంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, మురికి మరియు వాతావరణం మరియు బహిర్గత కారకాలు వంటివి చుండ్రుకు అనేక కారణాలున్నాయి. దానికి తోడు శీతాకాలంలో అధికంగా ఉంటాయి. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి.

1. తలకు మాయిశ్చరైజ్ :

1. తలకు మాయిశ్చరైజ్ :

చుండ్రుకు ప్రదాన కారణం తలలో తేమలేకపోవడం, పూర్తిగా పొడిగా ఉండటం. అది శీతాకాంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చుండ్రు వల్ల జుట్టు మరింత పాడవకుండా ఉండాలంటే తలకు తగినంత తేమను అందివ్వాలి. అందుకు తలలో జుట్టు మొదళ్ళకు పోషణను ఇచ్చే ఉత్పత్తులు, మాయిశ్చరైజర్లు వాడాలి. జుట్టును పొడిగా మార్చే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

2. తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ తప్పనిసరి

2. తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ తప్పనిసరి

తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి చుండ్రు నివారణ. ఆయిల్ మసాజ్ వల్ల జుట్టును బలంగా ఉంచుతుంది, తగిన పోషణ అందిస్తుంది. అందుకు కొబ్బరి నూనె గొప్పగా సహాయపడుతుంది. ఈ నూనెను ఇతర నూనెలతో కలిపి వాడవచ్చు. మరియు కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రు నివారించవచ్చు. తలస్నానికి ఒక గంట ముందు దీన్ని తలకు రాసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

3. షాంపు ఎక్కువ వాడకండి

3. షాంపు ఎక్కువ వాడకండి

జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం జుట్టుకు షాంపు పెట్టి శుభ్రం చేసుకోవడం సహజం. అయితే ఎక్కువగా షాంపు చేయడం వల్ల జుట్టు మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది. దాంతో సమస్య మరింత త్రీవం అవుతుంది. కావున షాంపు మితంగా వాడండి వారంలో రెండు మూడు సార్లు చాలు.

4. ఆల్కహాల్ ఉన్నటువంటి హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా

4. ఆల్కహాల్ ఉన్నటువంటి హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులకు దూరంగా

హెయిర్ స్టైల్ ఉత్పత్తులు మనం వాడటం సహజం. హెయిర్ స్టైల్ కొరకు రోజూ సెరమ్ నుండి హెయిర్ జెల్ వరకు వాడుతుంటాము.చుండ్రు సమస్య ఉండకూడదనుకుంటే ఇలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులు వల్ల జుట్టులో తేమను కోల్పోతుంది.దాంతో జుట్టు పొడిబారి చుండ్రు మరింత అధికం అవుతుంది.

5. యాంటీ డాండ్రఫ్ షాంపులో ఎలాంటి పదార్థాలున్నాయో చూడండి

5. యాంటీ డాండ్రఫ్ షాంపులో ఎలాంటి పదార్థాలున్నాయో చూడండి

తలలో చుండ్రు ఉందని తెలియగానే షాపుకు వెళ్ళి లేబుల్ చదవకుండానే యాంటీ డాండ్రఫ్ షాంపులు ఏవి పడితే అవి కొంటుంటాము. చుండ్రుకు ప్రభావంతంగా పనిచే యాంటీ డాండ్రఫ్ ను ఎంపిక చేసుకుని కొనాలి. ముఖ్యంగా జింక్, విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, టీట్రీ ఆయిల్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.

6. రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపు వాడాలి

6. రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపు వాడాలి

చుండ్రుతో పోరాడే ప్రభావంతమైన పదార్థాలతో తయారుచేసిన యాంటీ డాండ్రఫ్ షాంపును ఎంపిక చేసుకోవాలి. వీటిని కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి. చుండ్రు పూర్తిగా తొలగిపోవాలంటే కనీసం ఒక నెల సమయం పడుతుంది. అంత వరకు మీరు ఓపికగా వేచి చూడాలి.

7. సూర్యకిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పించండి

7. సూర్యకిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పించండి

తలలో చుండ్రుకు కారణం సూర్యరశ్మికూడా ఒక కారణం. సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు ఇటు చర్మం, అటు జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి, బయట వెళ్ళేటప్పుడు జుట్టుకు రక్షణ కల్పించాలి. ఇంటి నుండి బయట వెళ్లేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి .

8. మీరు తినే ఆహారం

8. మీరు తినే ఆహారం

చుండ్రు నివారణకు మీరు తీసుకునే ఆహారం కొద్ది మార్పులతో పూర్తిగా నివారించుకోవచ్చు.మీరు రోజూ తినే ఆహారంలో సరైన విటమిన్లు మరియు పోషకాలు ఉండేట్లు చూసుకోవడం వల్ల ఇవి చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలతో పాటు తలలో ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాను నివారిస్తాయి. తాజా కూరలు, పండ్లు, నట్స్ , ప్రోటీన్స్ ఫుడ్స్, ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. హై షుగర్ మరియు హై ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. చుండ్రు నివారణలో ఇది ఒక మ్యాజిక్ చేస్తుంది.

English summary

8 Simple And Effective Tips To Prevent Dandruff In Winter

Winter is just around the corner and with it comes one of the most common hair issues of all time - dandruff. Dandruff is a disorder of the scalp that comes with some evident symptoms such as itchiness and flakiness.[1] It becomes even more an aggressive issue during the winters as during this season the weather is cold and dry and your scalp becomes more prone to dandruff.
Desktop Bottom Promotion