For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు సమస్యా..కొబ్బరి నూనె-ఉసిరికాయతో ఇలా చేయండి!

|

ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. తెల్లజుట్టు నివారణకు ఇంట్లో తయారుచేసుకో గలిగిన హోం రెమెడీ ఒకటి ఆమ్లా పౌడర్ తో కొబ్బరి నూనె. ఈ హో రెమెడీస్ చాలా ప్రభావంతంగా పనిచేసి తెల్ల జుట్టును ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. మరి ఆ రెమెడీ గురించి తెలుసుకుందాం.

తయారుచేయడానికి పట్టే సమయం:

తయారుచేయడానికి పట్టే సమయం:

15నిముషాలు

కావల్సినవి:

కావల్సినవి:

2టీ స్పూన్ల ఆమ్లా పౌడర్

3 టేబుల్ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ కోకనట్ ఆయిల్

తయారుచేసే పద్దతి:

తయారుచేసే పద్దతి:

ఒక చిన్న సాస్ పాన్ లో ఈ రెండు పాదార్థాలను వేసి సన్న మంట మీద వేడి చేయాలి. ఆమ్లా పౌడర్ బ్లాక్ గా మారే వరకు వేడి చేయండి.

తర్వాత స్టౌ మీద నుండి పక్కకు తీసి పెట్టుకువాలి.

గోరువెచ్చగా చల్లారే వరకు ఉండనిచ్చి తర్వాత తలకు మసాజ్ చేయాలి.

ఒక గంట లేదా రెండు గంటల అలాగే పెట్టుకోవచ్చు. లేదా రాత్రిలో తలకు అప్లై చేసి ఉదయం తలస్నానం చేయవచ్చు.

మరుసటి రోజు ఉదయం షాంపు లేదా కండీషనర్ తో తలస్నానం చేయాలి.

రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ప్రయోజనాలు :

ప్రయోజనాలు :

ఉసిరికాయలో ఉండే విటమిన్ సి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ఇది కొల్లాజెన్ బూస్టింగ్ బెనిఫిట్స్ ను అమాంతంగా పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలీ సెల్స్ ను పెంచి, జుట్టు డ్యామేజ్ కు కారణమయ్యే వాటితో పోరాడుతుంది. హెల్తీ హెయిర్ ఫాలీసెల్స్ జుట్టు బాగా పెరుగుతుంది. మరియు తెల్ల జుట్టు నివారించబడుతుంది. ఈ హోం రెమెడీతో పాటు ఇతర హెర్బల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బ్లాక్‌ టీ

బ్లాక్‌ టీ

తెల్లజుట్టు నివారణలో బ్లాక్‌ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్‌ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్‌ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్‌ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

సేజ్‌ ఆకులు

సేజ్‌ ఆకులు

ఎండిన సేజ్‌(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్‌ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్‌-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు.

హెన్నా

హెన్నా

తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్‌లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్‌ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు.

ఉసిరి

ఉసిరి

నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్‌ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్‌, గ్రైండ్‌ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకు జుట్టుకు సంబంధించిన మెలనిన్ ఉత్పత్తిని రీస్టోర్ చేస్తుంది. జుట్టుకు న్యాచురల్ హెయిర్ కలర్ ను అందిస్తుంది,. . కరివేపాకులో ఉండే విటమిన్ బి జుట్టు పెరుగుదలకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెలో తాజా కరివేపాకు రెబ్బలు వేసి వేడి చేసి గోరువెచ్చగా మారిన తర్వాత తలకు రాయాలి. ఇలా చేస్తే జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది.

English summary

Amla Powder And Coconut Oil To Get Free Gray Hair Problems

Amla contains high amounts of vitamin C which is essential for healthy hair growth, owing to its collagen-boosting abilities. It also contains antioxidants that keep the hair follicles healthy by fighting away damage causing factors.
Story first published: Saturday, September 21, 2019, 12:38 [IST]