For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Beauty Benefits of Kalonji: నల్ల జీలకర్రతో ఇలా చేస్తే అందమైన కురులు, మెరిసే చర్మం మీ సొంతమవ్వడం ఖాయం...

|

ప్రస్తుత రోజుల్లో కలోంజి సీడ్స్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. చాలా మంది వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కలోంజి గింజలనే నల్ల జీలకర్ర విత్తనాలు అంటారు. మన భారతీయులు చాలా వంటల్లో వీటిని ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు.

వీటిని ప్రధానంగా కూరగాయలు, కూర, పప్పు మరియు ఇతర రుచికరమైన వంటకాలలో ఎక్కువగా వాడతారు. ఇందులో ఉండే ఔషధ గుణాల కారణంగా, వీటితో చర్మ సౌందర్యం మరియు కురులకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూర్చేందుకు సహాయపడతాయి.

ఈ విత్తనాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు ముడి ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, లినోసిక్ యాసిడ్ మరియు ఒలీయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు మరియు అస్థిరమైన నూనెలు ఉంటాయి. దీంతో మీ చర్మ సౌందర్యం మరియు జుట్టు సంరక్షణను పెంచుతుందని నిపుణులు నిరూపించారు. ఈ సందర్భంగా కలోంజి గింజలు మీ స్కిన్ గ్లో పెరుగుదలకు, కురుల మెరుగుదలకు ఎలా సహాయపడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Health Benefits of Kalonji:ఈ గింజలను రెగ్యులర్ గా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...

జుట్టు సంరక్షణ కోసం..

జుట్టు సంరక్షణ కోసం..

కలోంజి గింజలు పురుషులు మరియు స్త్రీలలో జుట్టు రాలడం మరియు జుట్టు నెరిసే సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీ స్కల్స్ ను ఎల్లవేళలా చల్లగా మరియు దురద లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. కలోంజి గింజలను ఉపయోగించడం వల్ల విభిన్న జుట్టు ప్రయోజనాలను మరియు జుట్టు సంరక్షణ కోసం కలోంజి విత్తనాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రుకు చెక్..

చుండ్రుకు చెక్..

ప్రస్తుత తరం వారిలో చాలా మంది మగాళ్లు, మహిళలు ఈరోజుల్లో చుండ్రు సమస్య సాధారణంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. మీరు తీవ్రమైన చుండ్రు సమస్యతో బాధపడుతుంటే, కలోంజి గింజలతో ఉపశమనం లభిస్తుంది. కలోంజి ఆయిల్ లో యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలమీద ఉండే చుండ్రుకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. ఇంతకీ కలోంజి నూనెను ఎలా వాడాలంటే.. ముందుగా కలోంజి నూనె తీసుకుని కాసేపు వేడి చేయండి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా కొబ్బరినూనె వేసి మీ తలకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

జుట్టు రాలడం తగ్గుదల..

జుట్టు రాలడం తగ్గుదల..

జుట్టు రాలే సమస్య కొన్నిసార్లు వయసు, హార్మోన్ల సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం మరియు జుట్టు యొక్క అపరిశుభ్రమైన స్థితి కారణంగా కూడా ఉండొచ్చు. మీ జుట్టు రాలడం సమస్యలను తగ్గించడానికి, మీరు కొన్ని కలొంజి గింజలను ఉపయోగించొచ్చు.

ముందుగా రెండు చెంచాల కలోంజి గింజలను తీసుకుని అందులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా కొబ్బరి నూనె మరియు ఒక చెంచా ఆముదం కలపాలి. ఈ పదార్థాలన్నీ కలిపి కాసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేయాలి. ఆ తర్వాత మీ జుట్టును వెచ్చని టవల్ తో చుట్టండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ మరియు కండిషనర్ తో కడగాలి.

ఈ ఆకుకూరకు సాటిలేదు మరే ఆకుకూర..వంద రెట్లు పోషకాలు..వందరెట్లు లాభాలు..

జుట్టు పెరుగుదల..

జుట్టు పెరుగుదల..

ఒక వ్యక్తిలో జుట్టు పెరుగుదలను పెంచడానికి కలోంజి గింజలు గణనీయంగా ఉపయోగపడతాయి. మీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకునేందుకు మరియు మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకునేందుకు కలోంజి సీడ్ పేస్టుని ఉపయోగించాలి.

మూడు నుండి నాలుగు చెంచాల కలోంజి గింజలను తీసుకుని వాటిని గంటసేపు నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. కలోంజి పేస్టులో రెండు చెంచాల తేనే మరియు ఒక చెంచా పెరుగు వేసి కలపాలి. ఈ పేస్టును మీ తలకు పట్టించి నీటితో శుభ్రం చేయాలి.

హెయిర్ మాస్క్..

హెయిర్ మాస్క్..

మీ తలపై పేలవమైన స్కాల్ప్ పరిస్థితి తరచుగా ఇబ్బంది పెడితే.. అది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అలాగే జుట్టు మీద కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల కావొచ్చు. కాబట్టి మీరు స్కాల్ప్ ఇరిటేషన్ మరియు దురద సమస్యలతో బాధపడుతుంటే.. కలోంజి విత్తనాలను వాడొచ్చు.

ముందుగా కొన్ని కలోంజి గింజలను తీసుకుని.. వాటిని బాగా కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా ఆలోవెరా జెల్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్, చిటికెడు పసుపు కలపండి.

జుట్టు వాల్యూమ్ పెరుగుదల..

జుట్టు వాల్యూమ్ పెరుగుదల..

కలోంజి జుట్టు రాలే సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడటమే కాకుండా, జుట్టుకు వాల్యూమ్ ను పెంచడంలోనూ సహాయపడుతుంది.

ముందుగా కొన్ని కలోంజి గింజలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి. విత్తనాలను 10 నిమిషాలు ఉడకబెట్టండి. అది చల్లారిన తర్వాత దానిలో రెండు చెంచాల నిమ్మరసం కలపండి. ఈ రెండు పదార్థాలను కలిపిన తర్వాత.. ఈ నీటిని శుభ్రపరిచిన తర్వాత వాడటం వల్ల మీ జుట్టు పెరుగుదల మరియు వాల్యూమ్ ను తక్షణమే పెంచడానికి మరియు ట్రేస్ లను స్మూత్ గా చేసేందుకు సహాయపడుతుంది. కలోంజి గింజలతో జుట్టు ప్రయోజనాలను ఆస్వాదించడానికి, వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ట్రై చేయండి.

అందమైన చర్మం..

అందమైన చర్మం..

ఎవరైతే ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారో.. అలాంటి వారికి కలోంజి సీడ్స్ అద్భుతమైన వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా కలోంజి విత్తనాలతో ఆయిల్ స్కిన్ ను ఎలా పోగొట్టుకోవాలో చూసెద్దాం. ముందుగా కొన్ని కలోంజి సీడ్స్ తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రను తీసుకుని అందులో ఒక స్పూన్ కలోంజి విత్తనాల పౌడర్ కు, ఒక టీ స్పూన్ లెమన్ పీల్ పౌడర్ మరియు రెండు స్పూన్ల తేనేను కలిపి ఓ మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేసుపై, మెడపై రాసుకుని పది నిమిషాల తర్వాత సున్నితంగా స్క్రబ్ చేసుకుంటూ నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ చర్మం చాలా తాజాగా కనిపిస్తుంది.

ఇవి గుర్తుంచుకోండి..

ఇవి గుర్తుంచుకోండి..

* మీరు కలోంజి విత్తనాల ఆయిల్ ను ఎప్పటికీ ఎక్కువ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది తలపై దురద మరియు చికాకుకు దారి తీయొచ్చు. సురక్షితంగా ఉండేందుకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను కలోంజి నూనెతో కలపాలి.

* చాలా మంది ప్రజలు కలోంజి ఆయిల్ అలర్జీతో బాధపడుతున్నారు. అందువల్ల మీరు దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. మీ తలపై కొన్ని చుక్కలు వేయండి. మీ తలపై మంటతో బాధపడుతున్నారా లేదా చెక్ చేసుకోండ.

* మీరు ఈ విత్తనాల నూనెను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే మీ చర్మంపై మొటిమలు వచ్చేలా చేయొచ్చు. అందుకే కాటన్ బాల్ సహాయంతో కలోంజి నూనెను పూయడం ఎల్లప్పుడూ మంచిగా ఉంటుంది.

నల్ల జీలకర్రతో కురులకు మేలు జరుగుతుందా?

ప్రస్తుత తరం వారిలో చాలా మంది మగాళ్లు, మహిళలు ఈరోజుల్లో చుండ్రు సమస్య సాధారణంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. మీరు తీవ్రమైన చుండ్రు సమస్యతో బాధపడుతుంటే, కలోంజి గింజలతో ఉపశమనం లభిస్తుంది. కలోంజి ఆయిల్ లో యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలమీద ఉండే చుండ్రుకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. ఇంతకీ కలోంజి నూనెను ఎలా వాడాలంటే.. ముందుగా కలోంజి నూనె తీసుకుని కాసేపు వేడి చేయండి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా కొబ్బరినూనె వేసి మీ తలకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

కలోంజి విత్తనాల్లో ఎలాంటి చికిత్స లక్షణాలు ఉంటాయి?

కలోంజి విత్తనాల్లో ఉండే ఇమ్యునోపొటెన్షియన్, బ్రోంకోడైలేటేషన్ మరియు యాంటిట్యూమర్, యాంటి హిస్టామినిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెర్టెన్సివ్, యాంటీ ఇన్ఫ్లమెటరీ, యాంటీ మైక్రో బయల్, హెపాటోప్రొటెక్టివ్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ వంటి చికిత్స లక్షణాలను కలిగి ఉంటాయి.

నల్ల జీలకర్రలో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

ఈ విత్తనాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు ముడి ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, లినోసిక్ యాసిడ్ మరియు ఒలీయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు మరియు అస్థిరమైన నూనెలు ఉంటాయి. ఈ నల్ల జీలకర్రను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

English summary

Beauty Benefits of Kalonji for skin and hair in Telugu

Here we are talking about the beauty benefits of kalonji for skin and hair in Telugu. Have a look
Story first published: Friday, November 19, 2021, 15:08 [IST]