Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కొబ్బరి పాలు + ఆముదం నూనెతో చుండ్రుకు గుడ్ బై
చుండ్రును పోగొట్టడానికి కొబ్బరి పాలు+ఆముదం నూనె
జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చికాకు తెప్పించే సమస్య చుండ్రు. చుండ్రు/డాండ్రఫ్ ఏర్పడటానికి అసలైన కారణం తెలియనప్పటికీ చర్మంలో కొన్ని పరిస్థితుల వలన ఈ సమస్య ఏర్పడుతుంది. రోజూ షాంపూ పెట్టి స్నానం చేసినా కొన్నిసార్లు చుండ్రు వదలదు. చుండ్రు వల్ల జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనబడదు. వాటి కోసం వివిధ రకాల షాంపులు మార్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అటువంటప్పుడు ఇతర పరిష్కారాల కోసం వెతకడం మంచిది.

చుండ్రు జుట్టు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకోవాలి. చుండ్రు జుట్టు సమస్యల్లో ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి మరియు మీ జుట్టును ప్రకాశవంతంగా మార్చుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా మంచి షైనింగ్ తో నిగనిగలాడుతూ కనబడటం చాలా ముఖ్యం. చుండ్రు రావడానికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ప్రధాన కారణమైనా, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పొల్యూషన్, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నరాల జబ్బులు, శుభ్రత పాటించకపోవడం వంటివి కారణమవుతాయి. అయితే మెడికేటెడ్ షాంపూల అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చుండ్రు దూరం చేసుకోవచ్చు.

జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి పాలు మరియు ఆముదం
జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి పాలు మరియు ఆముదం నూనెను ఉపయోగించి చుండ్రును శాశ్వతంగా నివారించుకోవచ్చు. ఈ రెండింటి కలయి చుండ్రును తొలగిస్తుంది మరియు జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ హోం రెమెడీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందు చుండ్రుకు గల అసలు కారణాలేంటో చూద్దాం.

చుండ్రుకు కారణాలు:
- పొడి బారిన చర్మం ఉన్నవారికి డాండ్రఫ్ సమస్య ఏర్పడవచ్చు.
- కొన్ని రకాలైన షాంపూలు మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ డాండ్రఫ్ ని ప్రేరేపించవచ్చు.
- స్కాల్ప్ పై ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రింగ్ వార్మ్ సమస్య వలన చుండ్రు ఏర్పడవచ్చు.
- ఎలర్జీ వలన కలగచ్చు.
- సోరియాసిస్ సమస్య ఉన్నవారికి డాండ్రఫ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
- ఈ సమస్య ఉన్న వాళ్ళు తరచూ తల స్నానం చేయకపోవటం వలన పరిస్థితి తీవ్రం అవుతుంది.
- స్ట్రెస్ మరియు చల్లని వాతావరణం వలన డాండ్రఫ్ అధికరించవచ్చు.
- సరైన పోషక ఆహారాలను తీసుకోక పోవటం వలన కూడా చుండ్రు సమస్య ఏర్పడవచ్చు. కారణాలు తెలుసుకున్నారాగా మరి ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.

కొబ్బరి పాలు మిశ్రమం
కొబ్బరి పాలు మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక టీస్పూన్ కొబ్బరి పాలలో కొద్దిగా ఆముదం నూనెను కలిపి తలకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు రోజులు చేస్తే, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు నివారణకు మంచి ఎంపిక. చుండ్రును పోగొట్టడంతో పాటు, ఇందులో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాలేంటో చూద్దాంజ

చుండ్రును పరిష్కరించడానికి
చుండ్రుతో బాధపడేవారికి వివిధ నివారణ చర్యలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొబ్బరి పాలు, ఆముదం నూనె మిశ్రమం ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. రెండింటినీ కలిపి తలకు అప్లై చేయడం ద్వారా చుండ్రును శాస్వతంగా తొలగిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులను నయం చేయడానికి మనం కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఈ హోం రెమెడీని వారంలో రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. కొబ్బరి పాలు మిశ్రమాన్ని చుండ్రు తొలగించడానికి ఉపయోగిస్తారు.

పొడవాటి జుట్టు కోసం
వాస్తవంగా చెప్పాలంటే పొడవాటి జుట్టుకు ఆముదం ఆయిల్ ఉత్తమం. కాబట్టి చుండ్రులేని పొడవాటి జుట్టును కోరుకునే వారు కొబ్బరి పాలతో పాటు కొద్దిగా ఆముదం ఆయిల్ ను కలిపి తలకు ప్యాక్ వేసుకోవాలి. క్రమం తప్పకుండా ఈ రెండూ తలకు అప్లై చేస్తుంటే పొడవాటి జుట్టు పొందాలనే మీకోరిక తీరుతుంది. మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా మరియు శాస్వతంగా పెరగడానికి కొబ్బరి పాలు ముఖ్యమైన నూనె బాదం లేదా కొబ్బరి నూనె మిశ్రమం ఉత్తమమైన వాటిల్లో ఒకటి.

జుట్టును ప్రకాశంతంగా మెరిపిస్తుంది
జుట్టును కాంతివంతంగా మెరిసిసేట్లు చేసే వాటిలో కొబ్బరి పాలు, ఆముదం నూనె మిశ్రమం ఒకటి మీ జుట్టు యొక్క మెరిసే మరియు ముదురు రంగును పెంచడానికి కొబ్బరి పాలు మిశ్రమం ఉత్తమమైన పదార్థాలలో ఒకటి. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది. కాబట్టి, గ్లో పెంచడంతో పాటు, మీ జుట్టును బలోపేతం చేయడానికి ఈ రెండింటి కలయిక ఉత్తమమైనది. ఈ రెండు మిశ్రమాలు జుట్టుకు కావల్సిన మెరుపును పెంచుతాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు.

తెల్ల జుట్టు
చిన్న వయస్సులోనే ఆందోళన కలిగించే తెల్ల జుట్టు. తెల్ల జుట్టు కనబడకుండా రంగులు వేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ సమస్యను తగ్గించడానికి కొబ్బరి పాలు మరియు ఆముదం నూనె మిశ్రమం సహాయపడుతుంది. ఇది చిన్న వయస్సులో తెల్ల జుట్టు నివారించడానికి సహాయపడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది.

ఒత్తైన జుట్టు కోసం
d
తమ జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నిజం ఏమిటంటే చాలామందికి అది లభించదు. అందువల్ల, కొబ్బరి పాలు ఆముదం నూనె మిశ్రమం వల్ల ఒత్తైన జుట్టును పొందవచ్చు. ఒత్తైన జుట్టుతో పాటు, జుట్టు ప్రకాశంతంగా మరియు నల్లగా స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ జుట్టు ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. అవోకాడో ఆయిల్ మీ జుట్టుకు చికిత్స చేయడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి.



Click it and Unblock the Notifications