For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల జుట్టు సమస్యలకు ఒక్కటే పరిష్కార మార్గం: కొబ్బరి నూనె

వివిధ రకాల జుట్టు సమస్యలకు ఒక్కటే పరిష్కార మార్గం: కొబ్బరి నూనె

|

జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జుట్టు సంరక్షణ కోసం తరచూ కొబ్బరి నూనెను జుట్టుకు వాడుతుంటారు. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కొబ్బరి నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు అందుతాయి. కొబ్బరి నూనె జుట్టుకు తగిన బలాన్నిస్తుంది.

కొబ్బరి నూనెతో అనేక జుట్టు సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా జుట్టు సమస్యల్లో ప్రధానంగా ఉండే హెయిర్ ఫాల్ నుండి, జుట్టు చిట్లడం, ముడులు పడటం, పొడిబారడం వంటి అనేక సమస్యలకు పరిష్కారంగా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జుట్టు పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతే కాదు కొబ్బరి నూనేలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదళ్లులోకి చొచ్చుకుని పోయి, జుట్టు మొదళ్ళను ఉత్తేజపరిచి, జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.

పైన చెప్పిన విధంగా కొబ్బరి నూనె జుట్టుకు అందించే ప్రయోజనాలేంటి మరియు అనేక జుట్టు సమస్యలకు పరిష్కారంగా కొబ్బరి నూనెను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.

కొబ్బరి నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు :

కొబ్బరి నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు :

  • జుట్టు రాటడం నివారిస్తుంది.
    • చుండ్రుతో పోరాడుతుంది.
      • డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి పునరుత్తేజపరుస్తుంది
        • జుట్టు పాడవకుండా కాపాడుతుంది.
          • తెల్లజుట్టును నివారిస్తుంది
            • జుట్టు వాల్యూమ్ ను పెంచుతుంది
              • పొడి జుట్టును నివారిస్తుంది.
              • కొబ్బరి నూనె నుండి ఈ అన్ని ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. అయితే కొబ్బరి నూనెతో కొన్ని అమేజింగ్ హెయిర్ మాస్క్ లు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

                జుట్టు రాలకుండా

                జుట్టు రాలకుండా

                ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీలన్లు హెయిర్ ఫోలిసెల్స్ స్టిమ్యులేట్ చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

                కావల్సిన పదార్థాలు:

                • ఒక కప్పు కొబ్బరి నూనె
                  • ఒక గుడ్డు
                  • ఉపయోగించే పద్దతి:

                    • ఎగ్ వైట్ ను సపరేట్ చేసి, బౌల్లో తీసుకుని బాగా గిలకొట్టాలి. స్మూత్ గా చేయాలి.
                      • దీనికి కొబ్బరి నూనెను జోడించిన బాగా మిక్స్ చేయాలి.
                        • ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి.
                          • 30 నిముషాలు అలాగే వదిలేయాలి.
                            • అరగంట తర్వాత చల్లటి లేదా గోరవెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.
                            • డల్ హెయిర్

                              డల్ హెయిర్

                              నిర్జీవంగా ఉన్న జుట్టును తిరిగి పున:స్థితికి తీసుకురావడానికి అలోవెరాలోని విటమిన్ ఎ, సి మరియు ఇ, ఫ్యాటీ యాసిడ్స్, మినిరల్స్ సహాయపడుతాయి. ఇవి జుట్టుకు సరిపడా పోషణను అందిస్తాయి. జుట్టును శుభ్రపరిచి, డల్ హెయిర్ ప్రకాశవంతంగా మార్చుతుంది.

                              కావల్సినవి:

                              • కొబ్బరి నూనె 3టేబుల్ స్పూన్లు
                                • ఫ్రెష్ అలోవెర జెల్ 1 టేబుల్ స్పూన్
                                • ఉపయోగించే పద్దతి:

                                  • ఒక బౌల్లో కొబ్బరి నూనెతీసుకోవాలి.
                                    • దానికి అలోవెర జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
                                      • ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.
                                        • రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి.
                                          • తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
                                          • తెల్ల వెంట్రుకలను నివారించడానికి

                                            తెల్ల వెంట్రుకలను నివారించడానికి

                                            కొబ్బరి నూనెకు ఆమ్లా పౌడర్ జతగా చేసి జుట్టుకు వాడితే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారిపోతుంది. అంతే కాదు చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.

                                            కావల్సినవి

                                            • 3 స్పూన్ల కొబ్బరి నూనె
                                              • 2 స్పూన్ల ఆమ్లా పౌడర్
                                              • ఆమ్లా

                                                ఉపయోగించే పద్దతి

                                                • కొబ్బరి నూనెను సాస్ పాన్ లో తీసుకోవాలి.
                                                  • దానికి ఉసిరికాయ పౌడర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.
                                                    • ఈ మిశ్రమాన్ని వేడి చేస్తూ, నల్లటి పదార్థం ఏర్పడే వరకు తక్కువ మంట మీద వేడి చేయాలి.
                                                      • తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలి,.
                                                        • ఈ మిశ్రమాన్ని తలకు కు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
                                                          • ఒక గంట అలాగే వదలాలి.
                                                            • గటం తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.
                                                            • డ్యామేజ్ అయిన జుట్టు :

                                                              డ్యామేజ్ అయిన జుట్టు :

                                                              అరటి పండులో పొటాషియం, విటమిన్స్ మరియు న్యాచురల్ ఆయిల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే తలపైనున్న స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి పునరుత్తేజపరుస్తుంది.

                                                              కావల్సినవి:

                                                              • ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
                                                                • ఒక పండిన అరటిపండు
                                                                  • ఒక అవొకాడో
                                                                  • ఉపయోగించే పద్దతి:

                                                                    • ఒక బౌల్లో అరటిపండు, అవొకాడో గుజ్జును తీసుకోవాలి.
                                                                      • ఈ మిశ్రమానికి కొద్దిగా కొబ్బరి నూనెను జోడించి బాగా మిక్స్ చేయాలి.
                                                                        • ఈ మిశ్రాన్ని తలకు అప్లై చేయాలి.
                                                                          • 10-15 నిముషాల పాటు అలాగే ఉండనివ్వాలి.
                                                                            • గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి

English summary

How To Use Coconut Oil To Tackle 8 Most Common Hair Issues

Coconut oil is an effective way to tackle many of our hair problems. From hair fall to split ends, coconut oil provides a solution to almost every hair issue. It has antioxidant, anti-inflammatory and antibacterial properties that play a major role to nourish your scalp to leave you with rejuvenated hair.
Desktop Bottom Promotion