For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీమోథెరపీ తర్వాత జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి?

జుట్టు రాలిపోయే వరకు తెలియదు మనకు జుట్టు ఎంత ముఖ్యమో...ఇక క్యాన్సర్ తో భాదపడే వారికి గురించి చెప్పక్కరే లేదు. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరఫీ ఉంటుంది. కీమోథెరపీ సమయంలో జుట్టు రాలిపో

|

జుట్టు రాలిపోయే వరకు తెలియదు మనకు జుట్టు ఎంత ముఖ్యమో...ఇక క్యాన్సర్ తో భాదపడే వారికి గురించి చెప్పక్కరే లేదు. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరఫీ ఉంటుంది. కీమోథెరపీ సమయంలో జుట్టు రాలిపోవడం చాలా సహజం. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్క స్త్రీ మరియు పురుషులు దీని గురించే ఎక్కువగా భయపడుతుంటారు.

కీమోథెరఫీ అనగానే అందరికీ ప్రధానంగా జుట్టు ఊడిపోవటమే గుర్తుకొస్తుంటుంది. చాలా మంది దీన్ని తలచుకుని బాధపడుతుంటారు. భయపడుతుంటారు. కీమోథెరపీ మందులు సైటోస్టాటిక్ ప్రభావాన్ని కలిగి శరీరంలో అతి వేగంగా వృద్ధి చెందే కణాలను నిర్వీర్యం చేస్తాయి. ఈ క్రమంలో శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం చూపుతాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయటంతో పాటు మామూలు కణాలను దెబ్బతీస్తాయి. ఈ క్రమంలో వెంట్రుకల కుదుళ్ళు దెబ్బతింటే జుట్టు ఊడిపోతుంటుంది.

పాక్షికంగా వ్యాధితో పాటు వచ్చే నాడీ ఒత్తిళ్ళు

పాక్షికంగా వ్యాధితో పాటు వచ్చే నాడీ ఒత్తిళ్ళు

పాక్షికంగా వ్యాధితో పాటు వచ్చే నాడీ ఒత్తిళ్ళు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. తంతువులు పాక్షికంగా మరియు పూర్తిగా బయటకు వస్తాయి. ఇది అటువంటి కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది:

  1. కీమోథెరపీ వ్యవధి
  2. వాడిన మందులు వాటి మోతాదు
  3. రోగి వయస్సు
  4. అతని జుట్టు కుదుళ్ళ రకం.

కానీ జుట్టు శాశ్వతంగా ఊడిపోదు.

కానీ జుట్టు శాశ్వతంగా ఊడిపోదు.

కానీ జుట్టు శాశ్వతంగా ఊడిపోదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనుకూలంగా జరుగుతున్నప్పుడు తిరిగి వెంట్రుకల పెరగడం ప్రారంభమవుతుంది. తిరిగి వెంట్రుకల సాధారణ స్థితిలో పెరుగుతాయి.

అయితే కీమోథెరపీ తర్వాత జుట్టు యొక్క నిర్మాణం మారవచ్చు. గతంలో జుట్టు పొడవుగా, నునుపుగా ఉంటే ట్రీట్మెంట్ తర్వాత కర్లీ హెయిర్ గా మారవచ్చు. సాధారణంగా చికిత్స తర్వాత వెంట్రుకలు తిరిగి పెరగడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.

కీమోథెరపీ చికిత్స సమయంలో జుట్టును ఎలా చూసుకోవాలి:

కీమోథెరపీ చికిత్స సమయంలో జుట్టును ఎలా చూసుకోవాలి:

కీమోథెరపీ సమయంలో మీ జుట్టుకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవి..

 తరచూ తలస్నానం చేయకూడదు

తరచూ తలస్నానం చేయకూడదు

* తరచూ తలస్నానం చేయకూడదు, అవసరమైనప్పుడు మాత్రమే చేసుకోవాలి. షాంపును వాడకూడు. లేదా సాధ్యమైనంత వరకూ మృదువైన వాటిని ఎంపిక చేసుకోవాలి.

పదే పదే తల దువ్వకూడదు

పదే పదే తల దువ్వకూడదు

* పదే పదే తల దువ్వకూడదు. అంతే కాదు, తల దువ్వడానికి మృదువైన దువ్వెను లేదా మసాజ్ బ్రష్ ను మాత్రమే ఉపయోగించాలి

 కీమోథెరపీ తర్వాత హెయిర్ డ్రయ్యర్లు, కర్లింగ్ టూల్స్

కీమోథెరపీ తర్వాత హెయిర్ డ్రయ్యర్లు, కర్లింగ్ టూల్స్

* కీమోథెరపీ చేయించుకునే సమయంలో లేదా కీమోథెరపీ తర్వాత హెయిర్ డ్రయ్యర్లు, కర్లింగ్ టూల్స్ మరియు హీటింగ్ టూల్స్ ఉపయోగించకూడదు.

ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళాల్సి వచ్చినా..

ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళాల్సి వచ్చినా..

* కీమోథెరపీ చేయించుకుంటున్న రోగిలో తలపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళాల్సి వచ్చినా క్యాప్ (టోపీ)లతో తలకు రక్షణ కల్పించడం మంచిది.

కీమోథెరపీ తర్వాత జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి :

కీమోథెరపీ తర్వాత జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి :

శీతలీకరణ : తక్కువ ఉష్ణోగ్రతలు జుట్టు రాలకుండా నెమ్మదిస్తుంది లేదా పూర్తిగా ఆపడానికి సహాయపడుతుంది. దీనికి కారణం రక్తప్రవాహంలో స్థానికంగా తగ్గుదల ఫలితంగా కీమోథెరఫీ ఫోలికల్స్ పై అంతగా ప్రభావం చూపవు. శీతలీకరణలో ప్రత్యేకమైన హెల్మెట్లును ఉపయోగిస్తారు. కీమోథెరపీ సెషన్ల కాలంమొత్తం ఉపయోగిస్తారు. ఈ హెల్మెట్లలో ఫ్రీజర్ లో ఫ్రీ కూల్డ్ ఉంటుంది. ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి ముంది జుట్టు తేమగా ఉంచుకోవాలి.

కీమోథెరపీ తర్వాత హెయిర్ కట్:

కీమోథెరపీ తర్వాత హెయిర్ కట్:

కీమోథెరపీ తర్వాత తలపై జుట్టు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫోలికల్ పోషణ చాలా అవసరం. జుట్టు పొట్టిగా ఉన్నప్పుడు పోషకాలు త్వరగా మరియు సులభంగా స్వీకరిస్తుంది. కాబట్టి, పల్చగా పొడవుగా ఉన్న జుట్టును పొట్టిగా కట్ చేయడం మంచిది.

English summary

Hair Loss After Chemotherapy, Causes and Advices..!!

You might not think about how important your hair is until you face losing it. And if you have cancer and are about to undergo chemotherapy, the chance of hair loss is very real. Both men and women report hair loss as one of the side effects they fear most after being diagnosed with cancer.
Desktop Bottom Promotion