For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు గుడ్డును వాడాక.. వాసన వస్తోందా? అయితే వీటిని కలపండి...

హోమ్ రెమెడీస్ తో జుట్టు, పుర్రె భాగంలో వచ్చే కోడిగుడ్డు వాసనను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కోడిగుడ్డు అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే గుడ్డును ఆరోగ్యంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా వాడొచ్చు. ఇది మన జుట్టుకు అవసరమైన పోషణను అందించడంతో పాటు జుట్టును అందంగా, పొడవుగా మరియు ఒత్తుగా మార్చడంలో గుడ్లు ఎంతగానో తోడ్పడతాయి. గుడ్లలో ఉండే బయోటిన్ మరియు ఫోలేట్ వంటి ప్రోటీన్లు జుట్టుకు డీప్ కండీషనర్ గా పని చేస్తాయి. అలాగే అవి జుట్టును రిపేర్ చేస్తాయి. ఇది జుట్టును సిల్కీగా, స్మూత్ గా ఉంచుతుంది. అంతేకాదు చుండ్రు కూడా తగ్గిపోతుంది.

Home Remedies to Remove Egg Smell From Hair and Scalp

హెయిర్ పై గుడ్డు ఎలా అప్లై చేయాలంటే..
హెయిర్ మాస్క్ గా గుడ్డును జుట్టుకు అనేక రకాలుగా అప్లై చేయొచ్చు. ముందుగా ఏదైనా హెయిర్ మాస్క్ ను సిద్ధం చేస్తున్నప్పుడు, దానికి గుడ్డు జోడించండి. మీ జుట్టు జిడ్డుగా ఉంటే, అప్పుడు గుడ్డులోని తెల్లసొన భాగాన్ని మాత్రమే జోడించాలి. మీ జుట్టు పొడిగా ఉంటే, మీరు గుడ్డులోని తెల్లసొన మరియు పసుపు భాగాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతే, దాన్ని మీ హెయిర్ మాస్కులో కలిపి, దాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి...

ఆవాల నూనె..

ఆవాల నూనె..

మీరు మీ జుట్టుకు హెన్నా లేదా హెయిర్ మాస్క్ ని వాడి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉండే జుట్టులో ఆవాల నూనెతో మసాజ్ చేయండి. అరగంట తర్వాత మళ్లీ మంచి షాంపూతో తలస్నానం చేస్తే.. మీ జుట్టు నుండి వచ్చే దుర్వాసనను పూర్తిగా తొలగించుకోవచ్చు.

ఆలివ్ నూనె, అరటి..

ఆలివ్ నూనె, అరటి..

మీరు మీ జుట్టుకు గుడ్డును అప్లై చేసినట్లయితే, అరటి, పాలు మరియు ఆలివ్ ఆయిల్ కలిపి హెయిర్ మాస్క్ ను తయారు చేసి జుట్టుకు అప్లై చేసి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. గుడ్డు వాసన కూడా పోతుంది.

ఆరెంజ్ జ్యూస్..

ఆరెంజ్ జ్యూస్..

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గుడ్డు వాసనను కూడా వదిలించుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ ని జుట్టు మరియు స్కాల్ప్ కు అప్లై చేసి, 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

నిమ్మకాయ..

నిమ్మకాయ..

నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జుట్టులోని దురద మరియు చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. ఇందుకోసం హెన్నా లేదా హెయిర్ మాస్క్ ను షాంపూతో కడిగిన తర్వాత, ఒక కప్పు నీటిలో నిమ్మకాయ రసం కలపండి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

దాల్చిన చెక్క, తేనే..

దాల్చిన చెక్క, తేనే..

దాల్చిన చెక్క మరియు తేనే రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుడ్ల వాసనను తొలగించడంలో సహాయపడతాయి. ముందుగా రెండు లేదా మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనేను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత తేలికపాటి షాంపూ మరియు గోరువెచ్చని నీటితో కడిగేయండి.

తాజా పెరుగు..

తాజా పెరుగు..

మీ జుట్టుకు గుడ్డును అప్లై చేసేటప్పుడు ఇది కలిపితే గుడ్ల వాసన పోతుంది. ముందుగా ఒక గిన్నెలో తాజా పెరుగు, రెండు చెంచాల నిమ్మరసం వేసి కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Home Remedies to Remove Egg Smell From Hair and Scalp

Here we are talking about how you can rid of the smell of egg yolk with the help of some quick home remedies. Have a look
Story first published:Monday, June 27, 2022, 14:16 [IST]
Desktop Bottom Promotion