For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తిమీర : బట్టతల, జుట్టురాలడం ఆపుతుంది, తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుంది!! ఇలా వాడండి!!

జుట్టు రాలడం ఆపడానికి మరియు తిరిగి జుట్టు పెరగడానికి కొత్తిమీరను ఇలా వాడండి!!

|

జుట్టు సమస్యలు ఎవరికి లేవు చెప్పండి. చిన్న వయస్సు పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయస్సులో జుట్టు రాలే సమస్య వల్ల నిరాశకు గురి అవుతున్నారు. ఇందుకు జీవనశైలి, ఆహారం, ఆరోగ్య రుగ్మతలు మొదలైనవి కారణమవుతున్నాయి. అయితే ఇలాంటి వారి నుండి చాలా కంపెనీలు పెద్దగా వ్యాపాలు చేస్తున్నాయి. బట్టతల నివారించడం కోసమని, ఇతర జుట్టు సమస్యలను కోసమని, తెల్ల జుట్టు నివారణకని వివిధ రకాల ఔషధాలు మార్కెట్లో అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

How To Use Coriander Leaves for Hair Loss and Re-growth

జుట్టు రాలడం, బట్టతల ఇంత తీవ్రమైన సమస్య నుండి బయటపడటానికి మార్గం ఉందా అని అడిగినప్పుడు సమాధానం మన పూర్వీకులకు నుండి ఒక పరిష్కారం దొరికింది. కోల్పోయిన జుట్టును కొత్తిమీరతో తిరిగి పొందవచ్చని ప్రస్తుత అధ్యయనం సూచిస్తుంది. ఇది ఎలా సాధ్యమో ఈ పోస్ట్‌లో చర్చిస్తాము.

కొత్తిమీర ఆకులు!

కొత్తిమీర ఆకులు!

వంటలో రుచికి మరియు ఆరోగ్యం పరంగా జీర్ణక్రియకు మనం జోడించే ప్రధాన వంట సామాగ్రి కొత్తిమీర. ఈ కొత్తిమీరలో వివిధ పోషకాలు ఉన్నాయి. కొత్తిమీర మీ జుట్టు రాలడం నివారించడంతో పాటు ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో చూద్దాం.

కొత్తిమీర నూనె

కొత్తిమీర నూనె

తలపై జుట్టు రాలిపోయిన ప్రదేశంలో తిరిగి జుట్టు పెరగడానికి కొత్తిమీర నూనె ఉత్తమంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి కావలసినవి ...

కొత్తిమీర: 1 కట్ట

2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్

కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

తయారీ విధానం

మొదట కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వడగట్టి రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ రసానికి కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనె కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ తలకు ముఖ్యంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతున్న ప్రదేశంలో దీన్ని రాయండి. 1 గంట సేపు అలాగే ఉంచండి. తర్వాత స్నానానికి వెళ్ళండి. మీరు వారానికి ఒకసారి ఇలా చేస్తే, జుట్టు తిరిగి పెరుగుతుంది.

జుట్టు రాలడం నివారించడానికి !

జుట్టు రాలడం నివారించడానికి !

ఈ రోజు నిన్న కాదు, గత కొన్ని శతాబ్దాలుగా మన పూర్వీకులు బట్టతలను నివారించడానికి తిరిగి జుట్టును పెంచుకోవడానికి ఈ పద్ధతిని అభ్యసించేవారిని చెబుతున్నారు. దీనికి కావల్సినవి...

కొత్తిమీర ఒక కట్ట

అర కప్పు నీరు

తయారీ విధానం

తయారీ విధానం

మొదట మీరు కొత్తిమీరను మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఈ పేస్ట్ కు కొద్దిగా నీరు కలపండి మరియు మళ్ళీ రుబ్బాలి. మెత్తగా పేస్ట్ తయారైన తరువాత జుట్టు మూలాల నుండి అప్లై చేయండి. బట్టతల ఉన్న ప్రదేశంలో కాస్త ఎక్కువగా దీనిని అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి.

4 నుండి 6 వారాలు ...

4 నుండి 6 వారాలు ...

మీరు అవసరమైనంత కొద్దిగా షాంపూలను లేదా కండీషనర్ ను ఉపయోగించవచ్చు. మీరు వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీ జుట్టు బట్టతల ప్రదేశంలో పెరగడం చూస్తారు. మీ పూర్తి జుట్టు పెరుగుదలకు 4 నుండి 6 వారాలు పట్టవచ్చు.

ధనియాలు

ధనియాలు

3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుని వాటి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలిపి తలకు రాయాలి. బట్టతల ఉన్న ప్రదేశంలో తిరిగి జుట్టు పెరగడాన్ని మీరు గమనిస్తారు. అలాగే జుట్టు రాలడం నివారించబడుతుంది. అందుకు కావాల్సినవి..

ధనియాలు

నీళ్ళు

తయారీ విధానం

తయారీ విధానం

నీళ్ళలో ధనియాలు వేసి బాగా ఉడకబెట్టి 15 ఉడకబెట్టిన తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా చల్లారనివ్వండి. తరువాత జుట్టు మొదళ్ళ నుండి అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు రాలడం నివారించబడుతుంది

English summary

How To Use Coriander Leaves for Hair Loss and Re-growth

This article talks about how to use coriander leaves for hair loss and hair re-growth
Desktop Bottom Promotion