Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
చలికాలంలో డ్రై హెయిర్ నివారించి, ఒత్తైన, మెరిసే జుట్టు పొందడానికి ఈ నూనె ఉపయోగించండి
చలికాలంలో డ్రై హెయిర్ నివారించి, ఒత్తైన, మెరిసే జుట్టు పొందడానికి ఈ నూనె ఉపయోగించండి
జుట్టు అందంగా..ఆరోగ్యంగా కనబడాలంటే తల, జుట్టు శుభ్రత చాలా ముఖ్యం. తలకు రెగ్యులర్ గా నూనె అప్లై చేయాలి. చలికాలంలో జుట్టు పొడిబారడం సహజం. కాబట్టి, తలకు ఎప్పటికప్పుడు నూనె రాయాలి. తలకు పట్టించే నూనెల్లో కొబ్బరి నూనె ఒకటి ఉత్తమమైనది. కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అవును, జుట్టు రకం లేదా ఆకృతితో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ బలమైన, మృదువైన, ఒత్తైన మరియు మెరిసే జుట్టును పొందడానికి కొబ్బరి నూనెను ఉపయోగించాలి. మీరు ఈ చలికాలంలో కేవలం కొబ్బరి నూనెను మాత్రమే కాదు ఇతర నూనెలు కూడా సహాయపడుతాయి. చలికాలంలో మీ జుట్టు డ్రైనెస్ ను ఎదుర్కోవడానికి సహాయపడే అనేక హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి.

వీటిలో మీ జుట్టుకు సరిపోయేదాన్ని ఎంచుకుని, అప్లై చేయాలి. ఈ చలికాలంలో అందమైన, ఒత్తైన జుట్టును ప్రోత్సహించే వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఈ నూనెలు ఏమిటో మరియు అవి మీ జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఈ కథనంలో చూద్దాం.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను సంవత్సరంలో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. అయితే చలికాలంలో మాత్రం నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు పోతుంది. జుట్టు కుదుళ్ళ పొడిని తగ్గిస్తుంది. జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. ఇంకా చలివల్ల వచ్చే ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది.
కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు కోకనట్ ఆయిల్లో, కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె, అరటిపండు లేదా అవొకాడో మిక్స్ చేసి తలకు పట్టించి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయండి.

బాదం నూనె
చలికాలంలో జుట్టుకు బాదం నూనెను ప్రయత్నించండి. చలి కారణంగా దెబ్బతిన్న మీజుట్టును రిపేర్ చేస్తుంది. తలలో డ్రైనెస్ తగ్గిస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణ అందించి జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇంకా జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. అలాగే మీ జుట్టును ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. బాదం నూనెను నేరుగా జుట్టుకు అప్లై చేయవచ్చు.కొద్దిగా బాదం నూనె తీసుకుని కుదుళ్ళకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

నువ్వుల నూనె
ఈ చలికాలంలో మీ జుట్టు మరీ పొడిగా, నిర్జీవంగా మారినట్లైతే వెంటనే, నువ్వుల నూనెను అప్లై చేయండి. ఈ నూనెలో ఒమేగా 3, 6 మరియు 9 వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. దీన్ని తలకు పట్టించడం వల్ల,మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒత్తైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు రెగ్యులర్ గా ఉపయోగించే కొబ్బరి నూనెతో నువ్వుల నూనె మిక్స్ చేసి, మీ తలకు మసాజ్ చేయండి. ఇది డ్రై హెయిర్ నుండి మీకు విముక్తి కలిగిస్తుంది.

ఆలివ్ నూనె
చలికాలంలో జుట్టు సంరక్షణలో ఆలివ్ నూనె ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే దీని ఉంటే క్రియాశీల పదార్థాలు జుట్టు కుదుళ్ళకు హాని జరగకుండా నిరోధిస్తాయి. ఈ నూనె జుట్టు మరియు తలకు పోషణను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి గుడ్డు పచ్చసొన మరియు తేనె కలపండి. మీరు చేయాల్సిందల్లా ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నుండి 30 నిమిషాల పాటు ఈ హెయిర్ ప్యాక్ ను అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ జుట్టు రాలడం, చివర్లు చీలిపోవడం మరియు నిస్తేజంగా ఉండే జుట్టు కుదుళ్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

భృంగరాజ్ హెయిర్ ఆయిల్
ఈ రోజుల్లో, అనేక సహజమైన జుట్టు సంరక్షణ హెయిర్ ఆయిల్ బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బ్రింగ్ రాజ్‌ఒకటి. ఈ నూనె మీ జుట్టుకు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఇది చుండ్రు మరియు పొడి జుట్టును నివారించడంలో సహాయపడుతుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, జుట్టుకు తగినంత రక్త ప్రసరణను పెంచుతుంది, జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారకుండా నివారిస్తుంది. మీరు భృంగరాజ్ నూనెను మధ్యస్తంగా వేడి చేసి, మీ తలకు మరియు కుదుళ్ళకు అప్లై చేసి, కడిగే ముందు అరగంట పాటు అలాగే ఉంచాలి.

ముగింపు గమనిక
మీరు ఇప్పటికీ కొబ్బరి నూనెపై ఆధారపడాలనుకుంటే, మీ జుట్టుకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి కరివేపాకుతో దీన్ని ఉపయోగించండి. తాజా కరివేపాకుతో పాటు కొబ్బరినూనె వేసి నల్లగా మారే వరకు మరిగించాలి. అది చల్లారిన తర్వాత నల్లటి నూనెను తలకు పట్టించాలి. దీన్ని మీ జుట్టు మీద ఒక గంట పాటు ఉంచి తర్వాత కడిగేసుకుంటే కొన్ని వారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications











