Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పుదీనా హెయిర్ మాస్క్: జుట్టు బలంగా..ఆరోగ్యంగా..పెరుగుతుంది
పుదీనా హెయిర్ మాస్క్: జుట్టు బలంగా..ఆరోగ్యంగా..పెరుగుతుంది
మన జుట్టు అందంగా కనిపించడానికి చాలా రకాలుగు ప్రయత్నాలు చేస్తుంటాము. అయితే కొన్ని రకాల జుట్టు సమస్యలను ఎలా నివారించాలో తెలియక కొంత మంది మిన్నుకుండిపోతారు. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి చాలా మంది వివిధ రకాల నూనెలు మరియు షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సారి మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా కేవలం మన వంటింట్లో ఉండే పుదీనా ఆకులను ప్రయత్నించండి. ఇది జుట్టుకు కావల్సినంత బలాన్నిస్తుంది. మరియు మంచి రంగుతో నిగనిగలాడుతుంది. ముఖ్యం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూద్దాం.
మనం జుట్టు ఆరోగ్యం, అందానికి పుదీనా ఎలాంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు, ఇది జుట్టును బలంగా ఉండేలా చేస్తుంది. పుదీనా ఆకులు ఎలాంటి జుట్టు సమస్యలైనా పరిష్కరించడానికి సహాయపడుతుంది. కేవలం పుదీనా ఆకులే కాదు, పుదీనా ఆయిల్ తో కూడా మనం చాలా జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. తలో చర్మం ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అదే తల ఒత్తిడికి గురైనా, దురద, పొడిబారి లేదా చుండ్రు వంటి సమస్యలతో జుట్టు హెల్తీగా పెరగదు. అందుకు పుదీనా ఆకులు కానీ, పుదీనా నూనె కానీ గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి కొన్ని జుట్టు సంరక్షణ సమస్యలను పరిష్కరించడానికి పుదీనా ఆకులు ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ముందుగా పుదీనా ఆకుల్లో మరియు నూనెలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం..

పుదీనా ఎందుకు?
- పుదీనాలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల ఇది తలలో చర్మం ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది.
- పుదీనా తలలో వెంట్రుకల మొదళ్ళకు రక్త ప్రసరణను సరఫరా చేస్తుంది.
- పుదీనాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఒత్తిడికి గురైన మరియు దురద కలిగించే లక్షణాలను నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- తలలో ఎటువంటి దురద లేకుండా ప్రభావంతమైన ఫలితాలను చూపెడుతుందిది.
- పుదీనాలో ఎండే మెంథాల్ గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సహజంగానే ఉత్తేజపరుస్తుంది. వీటితో పాటు పుదీనా హెయిర్ మాస్క్ ఏవిధంగా ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం:

చుండ్రు లేకుండా చేస్తుంది
చుండ్రు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మానసికంగా ఆందోళన కలిగిస్తుంది. కానీ దీన్ని పూర్తిగా తొలగించడానికి, మనం పుదీనా ఆకులను ఉపయోగించవచ్చు. చుండ్రును పూర్తిగా తొలగించడానికి మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మరియు బలాన్ని పెంచడానికి, పుదీనా నూనెను తలకు రాసుకోవచ్చు. ఇది మీ జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాపడుతుంది. పుదీనా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది. అలాగే, జుట్టు రాలడాన్ని నివారించడానికి పుదీనా చాలా మంచి.

జుట్టు పెరగడానికి
జుట్టు పెరుగుదలకు పుదీనా నూనెను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. జుట్టు ఆరోగ్యం మరియు జుట్టు పెరుగుదలకు దాల్చినచెక్క నూనె ఒకటి. ఇది మీ జుట్టు యొక్క ఆరోగ్యం మరియు బలాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు పుదీనా నూనెను వాడవచ్చు. జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలంటే 5-6చుక్కల పుదీనా నూనెనుకు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె కలిపి తలకు అప్లై చేయాలి. రాత్రి సమయంలో అప్లై చేయడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలుంటాయి.

మీ జుట్టు ఆకృతిని పెంచడానికి
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా మంది పుదీనా నూనెలను ఉపయోగిస్తారు. మీ జుట్టును బలోపేతం చేయడానికి పుదీనా ఒకటి. హెయిర్ స్టైలింగ్ పెంచడానికి మరియు జుట్టు రాలడం నివారించడానికి సహాయపడే ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ పరిస్థితులను పరిష్కరించడానికి మనం దీనిని ఉపయోగించవచ్చు. జుట్టులోపల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టును బలంగా చేస్తుంది.

తలలో దురద
కొద్దిగా కొబ్బరి నూనె మరియు కొంచెం పుదీనా నూనెతో కలిపి తలకు అప్లై చేస్తే దురద సమస్య నుండి ఉపశమనం పొందుతారు. అలాగే మరో పద్దతిలో పుదీనా ఆయిల్ కు కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు అప్లై చేస్తే దురదను తగ్గించడంతో పాటు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జుట్టు రాలడం ఆపుతుంది
సెడన్ గా హెయిర్ ఫాల్ జరుగుతుంటే పుదీనా ఆకులు అందుకు ప్రభావంతమైన పరిష్కారం. పుదీనా ఆకులు పేస్ట్ లేదా పుదీనా నూనెకు కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యలను పరిష్కరించే మార్గాల్లో ఎఫెక్టివ్ మార్గం ఇది.

జుట్టు చివరలు చిట్ల కుండా
జుట్టు చివర్లు చిట్లకుండా చేయడంలో పుదీనా ఉత్తమం అనడంలో ఎటువంటి సందేహం లేదు. పుదీనా ఆయిల్ జుట్టు చివర్లకు నేరుగా అప్లై చేయవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి ఉత్తమైనది. అలాగే జుట్టు చివర్లు చిట్లకుండా చేయడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తలలో రక్తప్రసరణ-కూలింగ్ ఎఫెక్ట్:
తలకు పుదీనా ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ ను స్థిరపరిచి వాటికి సరిగా రక్తప్రసరణ జరిగేలా చేయడంలో ఇది గ్రేట్. అలాగే తలను చల్లగా ఉంచుతుంది.

తల పొడిబారకుండా చేస్తుంది:
పుదీనా ఆయిల్ పిహెచ్ లెవల్స్ ను సమతుల్యం చేసి, తల పొడిబారకుండా చూస్తుంది. జుట్టు తేమగా, మంచి షైనింగ్ తో అద్భుతంగా మార్చుతుంది.

జీర్ణ సమస్యలను నివారించి..
పుదీనా ఆకులు వంటల్లో రెగ్యులర్ గా వాడటం వల్ల జీర్ణ సమస్యలను తొలగించి జుట్టు అందాల్సిన పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

కండీషనర్ :
పుదీనా ఆయిల్ జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేసి తలలో పేలు, చుండ్రును తొలగిస్తుంది. దాంతో జుట్టు మంచి వాసన వస్తుంది. జుట్టు నుండి మంచి సువాసన మంచి అనుభూతిని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications