For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రే కలర్ హెయిర్ పై యూత్ ఎందుకు మోజు పడుతున్నారో తెలుసా...

గ్రే కలర్ హెయిర్ పై యువత ఎందుకు ఆసక్తి చూపుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మందికి జుట్టు సాధారణంగా ప్రతి నెల ఒక అంగుళం వరకు పొడవు పెరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మన జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు చిన్న వయసులోనే జుట్టు నెరవడం ప్రారంభమవుతుంది. ఇవి జుట్టు పెరిగే ఫేజ్ కాలాన్ని కూడా తగ్గిస్తాయి.

Reasons why youngsters developing grey hair?

పెరిగే వయసు, విటమిన్లు, మినరల్స్ లేదా ప్రోటీన్లు తక్కువగా ఉండటం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం, హార్మోన్ల అసమతుల్యత, హెయిర్ స్టైలింగ్ వంటి ఉత్పత్తులను జుట్టుకు ఎక్కువగా వాడటం వంటి అనేక కారణాల వల్ల జుట్టు నెరవటం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Reasons why youngsters developing grey hair?

కాలుష్య ప్రభావం, ఇతర కారణాల వల్ల జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం, పొడిబారటం వంటి తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. దీనంతటికి మీ జుట్టు ఎలాంటిది అన్న విషయంపై మీకు మంచి అవగాహన ఉంటే చాలు.

కూల్ కెప్టెన్ ధోనీ హెయిర్ స్టైల్స్ లో కుర్రాళ్లను ఎక్కువగా ఆకట్టుకున్నవి ఏవంటే...కూల్ కెప్టెన్ ధోనీ హెయిర్ స్టైల్స్ లో కుర్రాళ్లను ఎక్కువగా ఆకట్టుకున్నవి ఏవంటే...

కొన్ని సంఘటనల వల్ల..

కొన్ని సంఘటనల వల్ల..

మీ తలపై మందంగా, నల్లగా పెరిగిన జుట్టు మధ్యలో తెల్లని వెంట్రుకలతో కలిసినప్పుడు బూడిద రంగులో ఉండే జుట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొన్ని నెలల వరకు ఉంటుంది. కానీ అకస్మాత్తుగా జరిగే సంఘటనల వల్ల కొన్ని సందర్భాలలో ‘ఒక్క రాత్రిలోనే జుట్టు గ్రే రంగు'కు మారుతుంది

ఎప్పుడు నెరుస్తుందంటే..

ఎప్పుడు నెరుస్తుందంటే..

మనలో చాలా మందికి జుట్టు నెరవడానికి ఒక నమూనా ఉంటుంది. మగవారిలో మొదట గడ్డం, ఆ తర్వాత మీసం, సైడ్ లాక్స్ మరియు కాలక్రమేణా తల ఇతర ప్రాంతాల్లో కూడా నెరవటం విస్తరిస్తుంది. అయితే పురుషుల ఛాతిమీద ఉండే జుట్టు మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే నెరుస్తుంది. అదే అడవారిలో పాపిట మధ్యలో మొదలై తర్వాత తల మొత్తం విస్తరిస్తుంది.

ఎందుకు జరుగుతుందంటే..

ఎందుకు జరుగుతుందంటే..

ఇలా జుట్టు నెరవటం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ సమస్యకు కారణమేంటని ఆరా తీస్తే.. హార్మోన్ల అసమతుల్యత, హైపోథైరాయిడిజం, పోషకాహార లోపం, అత్యంత హానికరమైన రక్తహీనత తదితర ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా కారణమే..

ఇవి కూడా కారణమే..

ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్స్, హెవీ కెమికల్స్ ఉండే రంగులను వాడటం, జన్యులోపాలు, కెమోథెరపీ మరియు రెడియేషన్ వంటి కారణాల వల్ల కూడా జుట్టు నెరుస్తోంది. అయితే కొంతమంది పిల్లలకు 8 ఏళ్ల వయసు నుండే ఈ సమస్య ప్రారంభమవుతుంది.

యువత ఎక్కువగా..

యువత ఎక్కువగా..

అయితే ఇలా జుట్టు నెరవడం అనే సమస్య నుండి ఎక్కువగా 25 ఏళ్లు దాటిన యువత భయపడుతున్నారు. వీరితో పాటు కొంతమంది చిన్న వయసు ఉండే వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.

సరైన ఆహారం లేకపోవడం..

సరైన ఆహారం లేకపోవడం..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవటం, విటమిన్ల లోపం, రోజు వారీ ఆహారంలో ఐరన్, రాగి మరియు అయోడిన్ వంటి సహాయక కారకాలు లభించకపోడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు జుట్టు పెరుగుదలకు కారణమైన పోషకాలపైన ప్రభావం చూపుతుంది.

మానసిక ఒత్తిళ్లు..

మానసిక ఒత్తిళ్లు..

ఒత్తిడి, రక్తహీనత, పూర్ హెయిర్ కండిషనింగ్, జుట్టు యొక్క దుర్వినియోగం మరియు జన్యు కండిషనింగ్ వంటి వాటికి కారణమవుతున్నాయి.

పరిష్కారాలివీ..

పరిష్కారాలివీ..

చిన్న వయసులోనే జుట్టు నెరవటం అనే సమస్య మొదలైతే.. దాన్ని శాశ్వతంగా పరిష్కరించలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాహార లోపం దిద్దుబాటుతో దీనిని నివారించవచ్చు. డాక్టర్ షా కూడా ఇలాంటి నిరోధ ప్రయత్నాలను సూచించారు. ‘రెగ్యులర్ ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జుట్టు పరిశుభ్రత మరియు ఒత్తిడి లేని పనులు చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

గోరింటాకు వాడటం..

గోరింటాకు వాడటం..

జుట్టు నెరవటం అనే సమస్య నుండి విముక్తి పొందేందుకు తాత్కాలిక, పాక్షిక-శాశ్వత పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గోరింటాకు. దీని పొడిని రెగ్యులర్ జుట్టుకు పట్టిస్తే.. మీ జుట్టు రెడ్ కలర్లో మారుతుంది. అలాగే అమ్మోనియా లేని గోరింటాకు లేదా జుట్టు రంగును ఎంచుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పొగతాగడం మానేస్తే..

పొగతాగడం మానేస్తే..

జుట్టు నెరవడం తగ్గిపోయి.. సాధారణ స్థితికి రావాలంటే పొగతాగడం కచ్చితంగా మానేయాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల ఒత్తిడి తగ్గి, క్రమబద్ధమైన జీవనశైలి అలవడుతుందని చెబుతున్నారు.

English summary

Reasons why youngsters developing grey hair in telugu

Here are the reasons why youngsters developing grey hair? Take a look.
Desktop Bottom Promotion