నేలను తాకే పొడవాటి జుట్టు కావాలంటే ఏం చేయాలో చెప్పిన పాకిస్థానీ డాక్టర్.. టిప్స్ పాటిస్తే జుట్టు పెరగడం ఖాయం

అందంగా ఉండాలని ఎవరికీ ఉండదు చెప్పండి. ఒత్తైన జట్టు, అందమైన మోము కోసం అందరూ కష్టపడుతుంటారు. అందమైన బలమైన జుట్టును పొందేందుకు జుట్టు సంరక్షణకు బాగా ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అలాగే అందమైన చర్మాన్ని, ముఖాన్ని పొందేందుకు కూడా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు కొందరికి సఫలీకృతమయితే, మరికొందరికి మాత్రం కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు.

అయితే.. పాకిస్థానీ మహిళల జుట్టు సంరక్షణ, వారి ఆకర్షణ విషయంలో వారు ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంటారని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆకాశాన్ని తాకే కురులు, ఒత్తుగా, నల్లగా మరియు మెరిసిపోతూ కనిపించే జుట్టును కలిగి ఉంటారు. మీరు కూడా అలాంటి జుట్టు పొందాలని ఆశపడితే, పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా షేర్ చేసిన సహజ హెయిర్ కేర్ చిట్కాలను పాటించవచ్చు. ఆమె ఈ చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ చిట్కాలు పాటించి మీరు జుట్టును ఒత్తుగా, బలంగా మార్చుకోవడం మాత్రమే కాకుండా జుట్టు రాలడం, పొడి బారడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Hair growth and maintenance tips as per pakistan doctor in telugu

డాక్టర్ షెరిన్ ఫాతిమా జుట్టు సంరక్షణ ప్యాక్

కావలసిన పదార్థాలు:

ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్) - 1/4 కప్పు
ఆర్గాన్ ఆయిల్ సీరం - 5 చమచాలు
వేడి నీరు - 1/2 కప్పు

ప్యాక్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఆవ నూనె పోసుకోవాలి. ఆ తరువాత ఆ ఆవనూనెలో 5 చెంచాల ఆర్గాన్ ఆయిల్ సీరం వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆవనూనెతో పాటు ఆర్గానిక్ ఆయిల్ సీరం రెండూ బాగా కలిసే విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో వేడి నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక క్రీం మాదిరిగా తయారు చేసుకోవాలి. క్రీం మాదిరిగా వచ్చేంత వరకు దానిని కలుపుతూనే ఉంటే.. పాకిస్థాన్ బ్యూటీ డాక్టర్ ఫాతిమా చెప్పిన హెయిర్ ప్యాక్ సిద్ధమైనట్లే.

ఈ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలంటే:

తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకూ బాగా అప్లై చేయండి.
తర్వాత, జుట్టును కప్పించి ఒక గంటపాటు అలాగే ఉంచండి.
ఒక గంట తర్వాత, జుట్టును తడిగా చేసి మీకు నచ్చిన హైడ్రేటింగ్ షాంపూనుతో శుభ్రంగా తలస్నానం చేయండి.
తలస్నానం చేసిన తర్వాత, వెంట్రుకలు పూర్తిగా ఆరకముందే, మీకు నచ్చిన హెయిర్ సీరంను అప్లై చేయండి.
తర్వాత జుట్టును గాలితో ఆరనివ్వండి. హెయిర్ డ్రైయర్ వాడకూడదు.

ఫలితాలు: ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వాడినట్లయితే, కొద్ది రోజుల్లో మీకు ఒత్తుగా, మెరిసే, ఆరోగ్యకరమైన కురులు లభిస్తాయి. ఆవ నూనెలో ఉండే విటమిన్ E, ఒమేగా-3 వంటి పోషకాలు జుట్టును బలపరుస్తాయి, రాలడాన్ని నిరోధిస్తాయి, అలాగే జుట్టును మెరిసిపోనిచ్చేలా చేస్తాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ జుట్టుకు సహజమైన అందాన్ని అందించవచ్చు.

Story first published: Thursday, March 13, 2025, 13:52 [IST]
Desktop Bottom Promotion