Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఎంత పసుపుగా ఉన్నా..జస్ట్ ఇలా చేస్తే దంతాలు ముత్యాల్లా మెరిసిపోతాయి
దంతాలు ఒక వ్యక్తి పరిశుభ్రత లోపాన్ని కూడా సూచిస్తాయి. మొఖం ఎంత అందంగా ఉన్నా నోరు తెరిచిన వెంటనే దంతాలు పసుపు రంగులో కనిపిస్తే అందమంతా పోతుంది. సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నిత్యం టీ,కాఫీలు తాగడం, ధూమపానం, మద్యం సేవించడం వంటివన్నీ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని వల్ల ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ప్రజలతో బహిరంగంగా మాట్లాడలేరు.
మనం ఏది తిన్నా నోటి ద్వారా మాత్రమే కడుపులోకి వెళ్తుంది కాబట్టి మురికి పళ్ళు ఆరోగ్యాన్ని కూడా హానికరమే. దంతాలను మెరిసేలా చేయడం అంత కష్టం కాదు. కొన్ని హోం రెమెడీస్ ద్వారా దంతాల నుండి మరకలు, పసుపు రంగును తొలగించవచ్చు. వాటిని కేవలం 3 నుండి 4 సార్లు ఉపయోగిస్తేనే దంతాల మీద ప్రభావం చూపుతుంది.

ఈ హోం రెమెడీస్ మీ పసుపు దంతాలను ముత్యాల్లా మెరిసేలా చేస్తాయి
-ఒక టీస్పూన్ కొబ్బరి నూనె నోటిలో పెట్టుకొని మింగకుండా పుక్కిలించండి. 15 నిమిషాల తర్వాత నోరు కడుక్కోవచ్చు. ఇలా చేయడం వల్ల దంతాల రంగు మారడం పోతుంది. ఇది దంతాల రంగును పెంచడానికి కూడా సహాయపడుతుంది.
-వేప పొడిని ఉపయోగించి దంతాల పసుపు రంగుని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. వేప పొడిని తీసుకుని బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాల నుండి బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దంతాల ఆరోగ్యం కోసం మీరు వేప టూత్‌పేస్ట్‌తో మీ దంతాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
-భోజనం చేసిన తర్వాత వారానికి 2 రోజులు నిమ్మతొక్కను దంతాల మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయ తొక్క దంతాలను తెల్లగా చేయడంలో చాలా సాయపడుతుంది. నిమ్మకాయ బద్దతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
-దంతాలు మెరిసేలా చేయడంలో నారింజ కూడా చాలా ఉపయోగపడుతుంది. నారింజలో విటమిన్ సి ఉన్నందున, ఈ భాగం దంతాల నుండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్‌లో కొన్ని పండ్లను మిక్స్ చేసి దంతాలకు అప్లై చేయండి. ఇది దంతాల రంగును తొలగించడంలో సహాయపడుతుంది.
-రోజుకి రెండుసార్లు పళ్లు తోముకోవడం మంచిది. అలాగే ప్రతి మూడు నెలలకోసారి బ్రష్ ని మార్చుకోవాలి. మీ దంతాలపై ఉప్పు, పసుపు లేదా బేకింగ్ సోడా ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. ఇవి దంతాల మీద అరిగిపోవడానికి, దంతాల మరకలు పెరగడానికి దారితీస్తాయి.
-అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల ఆవాల నూనె కలపి దాంతో మీ దంతాలను శుభ్రం చేసుకోండి. దీంతో మీ దంతాలు మెరుస్తాయి.
-దంతాలు సహజంగా మెరిసేలా చేయడానికి స్ట్రాబెర్రీలను చూర్ణం చేసి 5 నుండి 6 నిమిషాల పాటు దంతాల మీద ఉంచండి. ఇది మీ నోటి దుర్వాసనని నివారిస్తుంది, మీ దంతాలు కూడా తెల్లగా మారుతాయి.



Click it and Unblock the Notifications