Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Pimples on face: మొటిమలతో బాధపడుతున్నారా? జస్ట్ ఇది వాడితే మ్యాజిక్ జరిగి మొత్తం పోతాయ్!
చాలామందికి ముఖ్యంగా అమ్మాయిలు మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి అయితే రెండు చెంపలు, నుదురు, ముక్కుపై మొటిమలు ఉంటాయి. మొటిమల సమస్యని వదిలించుకోడానికి కొందరు ఖరీదైన కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు కానీ ఫలితం ఉండదు. మొఖంపై మొటిమల కారణంగా కొంతమంది ఆత్మవిశ్వాసం కోల్పోయి బయట నలుగురిలో తిరగలేక ఇబ్బందిపడుతుంటారు.
మొటిమల కారణంగా మొఖాన్ని బహిరంగంగా కనబడుకుండా మొఖానికి చున్నీ చుట్టుకొని తిరుగుతుంటారు కొందరు అమ్మాయిలు. అయితే కొన్ని హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌ల ద్వారా మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చు, అందంగా కూడా కనబడవచ్చు.

ఇలా చేస్తే మొటిమల సమస్యకు పరిష్కారం
-చలికాలంలో వచ్చే మొటిమలను వదిలించుకోవడానికి తులసి ఆకులను గ్రైండ్ చేసి,వేప ఆకుల పేస్ట్, పసుపు పొడి, గంధపు పొడిని కలిపి ప్యాక్ తయారు చేయండి. ఈ ప్యాక్ ని మీ ముఖమంతా అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి.
-అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనెతో ప్యాక్ తయారు చేయండి. పసుపు సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇది మొటిమల చికాకును తగ్గించడానికి, చర్మాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ను మీ మొఖంపై 10-15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి.
-వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి కలబంద ఆయిల్ లో వేయవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలలో వెల్లుల్లిని కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని చర్మంపై 10-15 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మొటిమలతో పోరాడటానికి ఇది చాలా మంచి ప్యాక్.
-తులసి ఆకుల పొడిని ఒక చెంచా ఓట్స్ పౌడర్, ఒక చెంచా పచ్చి పాలు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని మొఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి.
-జిడ్డు చర్మాన్ని సంరక్షించడానికి తులసితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. తులసి, వేప ఆకులను కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి బాగా పట్టించాలి. కాసేపు ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications